Ravichandran Ashwin Retirement : టీమ్ఇండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గబ్బా టెస్టు అనంతరం 38ఏళ్ల అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇక అశ్విన్ రిటైర్మెంట్ ఇప్పట్నుంచే అమలుకానుంది. మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటిస్తూ, మాట్లాడాడు.
'ఇంటర్నేషనల్ క్రికెట్లో భారత్ తరఫున ఇదే నా ఆఖరి మ్యాచ్. ఈ జట్టుతో నాకు ఎన్నో అనుభూతులు ఉన్నాయి. నా కెరీర్లో మద్దతుగా నిలిచిన బీసీసీఐ, నా టీమ్‌మేట్స్‌కు కృతజ్ఞతలు. ముఖ్యంగా రోహిత్, విరాట్, అజింక్యా రహానే, ఛెతేశ్వర్ పుజారా. నా జర్నీలో కోచ్‌ల పాత్ర కూడా ఎంతో ఉంది. ఆస్ట్రేలియా క్రికెట్‌కు కూడా థాంక్స్. మీతో ఆడడాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను. ఇది నాకు ఎమోషనల్ మూమెంట్' అని అశ్విన్ అన్నాడు. అంతకుముందు డ్రెస్సింగ్ రూమ్‌లో అశ్విన్ భావోద్వేగంతో విరాట్‌ను హాగ్ చేసుకున్న వీడియో వైరల్‌గా మారింది.
🫂💙🇮🇳
— Star Sports (@StarSportsIndia) December 18, 2024
Emotional moments from the Indian dressing room 🥹#AUSvINDOnStar #BorderGavaskarTrophy #Ashwin #ViratKohli pic.twitter.com/92a4NqNsyP
ఇక రిటైర్‌మెంట్ ప్రకకటించిన అశ్విన్ గురువారం భారత్‌కు రానున్నాడు. ఈ మేరకు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పలు విషయాలపై రోహిత్ మాట్లాడాడు. అశ్విన్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని తెలిపాడు. కాగా, అశ్విన్ రిటైర్మెంట్పై బీసీసీఐ కూడా పోస్ట్ షేర్ చేసింది. 'థాంక్స్ అశ్విన్. అద్భుతం, ఇన్నోవేషన్, తెలివైన బౌలర్‌కు నువ్వు పర్యాయపదంగా మారావు. సీనియర్ స్పిన్నర్‌గా భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించావు. లెజండరీ కెరీర్‌ను కొనసాగించినందుకు కంగ్రాట్స్' అని బీసీసీఐ పోస్టు పెట్టింది.
𝙏𝙝𝙖𝙣𝙠 𝙔𝙤𝙪 𝘼𝙨𝙝𝙬𝙞𝙣 🫡
— BCCI (@BCCI) December 18, 2024
A name synonymous with mastery, wizardry, brilliance, and innovation 👏👏
The ace spinner and #TeamIndia's invaluable all-rounder announces his retirement from international cricket.
Congratulations on a legendary career, @ashwinravi99 ❤️ pic.twitter.com/swSwcP3QXA
కాగా, 2009లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన అశ్విన్ టీమ్ఇండియాకు 15 ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా టెస్టుల్లో అశ్విన్ భారత్‌కు కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాల్లో భాగం అయ్యాడు. తన కెరీర్లో 106 టెస్టుల్లో అశ్విన్ 537 వికెట్లు, 3503 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు ఉన్నాయి. ఇక 116 వన్డేల్లో 156, 65 టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు. ఇంటర్నేషనల్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్ ఐపీఎల్లో కొనసాగనున్నాడు.
End of an Era! 💔
— OneCricket (@OneCricketApp) December 18, 2024
Ashwin waves goodbye to Indian cricket 🥹#AUSvIND #Ashwin pic.twitter.com/ex3vG2j5yh
ఆ ఆల్‌టైమ్ రికార్డుపై అశ్విన్ ఫుల్ ఫోకస్!
కుంబ్లే రికార్డు బ్రేక్ చేసిన అశ్విన్ - తొలి భారత బౌలర్‌గా ఘనత - Ashwin Records