Sehwag On Rohit Sharma Captaincy: ఐపీఎల్లో స్టార్ టీమ్ ముంబయి ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఈ సీజన్లో ముంబయి వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడి ఇంకా పాయింట్లు ఖాతా తెరవలేదు. ఈ క్రమంలో ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్యపై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువవుతున్నాయి. కాగా, దీనిపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్పందించాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ ఒత్తిడిని తట్టుకొని ఎలా కమ్‌బ్యాక్ ఇస్తాడో చూడాలన్నాడు.
'ఆయా సీజన్లలో ముంబయి ఇండియన్స్ ప్రారంభంలో వరుసగా 3-4 మ్యాచ్‌ల్లో ఓడినా తర్వాత మంచి కమ్‌బ్యాక్ ఇచ్చేది. అలాంటి పరిస్థితుల నుంచి ఏకంగా ప్లే ఆఫ్స్ చేరిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ, అది రోహిత్ శర్మ ముంబయి. ఇప్పుడుంది హార్దిక్ పాండ్య ముంబయి. ప్రస్తుత పరిస్థితులను, ఒత్తిడిని అధిగమించి అతడు ఎలాంటి కమ్‌బ్యాక్ ఇస్తాడో చూడాలి' అని సెహ్వాగ్ ఓ స్పోర్ట్స్ ఛానెల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అయితే గతంలో పలు సీజన్లలో వరుసగా నాలుగు, ఐదు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ ఆ జట్టు గొప్పగా పుంజుకుంది. ఆ తర్వాత వరుస విజయాలతో ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ ఇలాంటి ఒత్తిళ్లను తట్టుకొని జట్టును నడిపించాడని సెహ్వాగ్ అన్నాడు.
ఇక ప్రస్తుత సీజన్లో గుజరాత్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో పోరాడిన ముంబయి కేవలం 6 పరుగుల తేడాతో ఓడింది. ఆ తర్వాత సన్‌రైజర్ హైదరాబాద్ మ్యాచ్‌లో పేలవ బౌలింగ్‌తో భారీగా స్కోర్ సమర్పించుకుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఏకంగా ఐపీఎల్ హిస్టరీలోనే హైయ్యెస్ట్ స్కోర్ (277 పరుగులు) నమోదు చేయగా, ఛేదనలో ముంబయి 245 పరుగులు చేసింది. తాజాగా రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ముంబయి ఘోర ఓటమి మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసి 125 పరుగులే చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని రాజస్థాన్ 15.3 ఓవర్లలో ఛేదించి విజయాల్లో హ్యాట్రిక్ కొట్టగా, ముంబయి ఓటముల్లో హ్యాట్రిక్ అందుకుంది.
రాజస్థాన్ మ్యాచ్‌లో రోహిత్ శర్మనే భయపెట్టేసిన అభిమాని - IPL 2024 RR VS MI
'చాలా బాధగా ఉంది - అలా చేసి ఉంటే మరోలా ఉండేది' - Hardik Pandya IPL 2024