ETV Bharat / sports

ఆమె బరిలోకి దిగితే అంతా బంగారమే - పారాలింపిక్స్‌లో ఏకంగా 18 గోల్డ్ మెడల్స్‌! - Sarah Storey 18 Gold Medals - SARAH STOREY 18 GOLD MEDALS

Paris Paralympics Sarah Storey 18 Gold Medals : 46ఏళ్ల వయసులోనూ అలుపెరగని పోరాట పటిమతో ఎంతో మంది స్పూర్తిగా నిలుస్తోంది సారా స్టోరే. పారాలింపిక్స్‌ విశ్వ క్రీడల్లో ఏకంగా 18 గోల్డ్ మెడల్స్‌తో పాటు ఎన్నో రజత, కాంస్య పతకాలను సాధించి రికార్డులు క్రియేట్ చేస్తోంది.

source Associated Press
Paris Paralympics Sarah Storey 18 Gold Medals (source Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2024, 6:13 PM IST

Paris Paralympics Sarah Storey 18 Gold Medals : ప్రస్తుతం జరుగుతున్న పారిస్‌ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు తమ ప్రతిభను చాటుతూ పతకాలు సాధిస్తున్నారు. అయితే ఈ విశ్వ క్రీడల్లో పతకాలు సాధించి తమ దేశానికి కీర్తి తెచ్చి పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లు కూడా సత్తా చాటుతున్నారు. వైకల్యం తమకు అడ్డుకాదని నిరూపిస్తున్నారు.

అయితే ఈ విశ్వ క్రీడలకు సంబంధించి గత రెండున్నర దశాబ్దాలుగా ఏకంగా 18 గోల్డ్‌ మెడల్స్‌తో పాటు ఎన్నో సిల్వర్‌, బ్రాంజ్‌ మెడల్స్‌ను అందుకుని రికార్డులు సృష్టిస్తోంది సారా స్టోరే. 46ఏళ్ల వయసులోనూ అలుపెరగని పోరాట పటిమతో ఎంతో మంది స్పూర్తిగా నిలుస్తోంది.

సారా స్టోరే ఎవరంటే? - సారా స్టోరే బ్రిటన్‌కు చెందిన పారాలింపియన్‌. ఆమెకు పుట్టుకతోనే ఎడమ చేతికి వైకల్యం ఉంది. అయినా కూడా స్విమ్మింగ్‌లోకి దిగి తన ప్రతిభను చాటింది. 14 ఏళ్ల వయసులోనే పారాలింపిక్‌ పోటీల్లో పాల్గొని మొదటి సారి మెడల్‌ను అందుకుంది. అలా 1992 నుంచి 2004 వరకు నాలుగు సార్లు పారాలింపిక్స్‌ బరిలోకి దిగి మొత్తంగా ఐదు గెల్డ్ మెడల్స్, ఎనిమిది సిల్వర్ మెడల్స్‌, మూడు బ్రాంజ్ మెడల్స్‌ను సాధించింది.

సైక్లింగ్‌ను పతకాల వేట - మొదట స్విమ్మింగ్‌పై మక్కువ పెంచుకున్న సారా స్టోరే, ఏథెన్స్‌ పోటీల తర్వాత సైక్లింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. అందులోనూ పతకాలు సాధించింది. బీజింగ్‌, లండన్‌ పోటీల్లోనూ ఎన్నో మెడల్స్‌ను ముద్దాడింది. టోక్యో పారాలింపిక్స్‌లో మూడు విభాగాల్లో పాల్గొన్న సారా అప్పుడు మూడు గోల్డ్ మెడల్స్‌ సాధించి సెన్సేషనల్ క్రియేట్ చేసింది.

తాజాగా పారిస్‌ పారాలింపిక్స్‌లోనూ మహిళల సైక్లింగ్‌ విభాగంలో(C5) రికార్డ్ క్రియేట్ చేసింది. 20 నిమిషాల 22.15సెకన్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. ప్రత్యర్థి కన్నా నాలుగున్నర సెకన్ల తేడాతో గమ్యాన్ని చేరుకుంది. తద్వారా మరో గోల్డ్‌ మెడల్‌ను ఖాతాలో వేసుకుంది.

దీంతో స్విమ్మింగ్‌, సైక్లింగ్‌ ఈవెంట్‌లలో మొత్తంగా 29 మెడల్స్‌ సాధించిన సారా తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. పారాలింపిక్స్‌లోనే ఏకంగా 18 స్వర్ణాలను ముద్దాడింది. ప్రపంచ ఛాంపియన్‌లో పాల్గొన్న ప్రతిసారీ మెడల్స్‌ను అందుకుంది.

రూ.66కోట్ల టాక్స్ చెల్లించిన కోహ్లీ- ఆయనే హైయెస్ట్! మరి మిగతా వాళ్లు? - Virat Kohli Income Tax Payment

పారాలింపిక్స్​లో భారత్ నయా చరిత్ర - 5 రోజుల్లోనే 24 పతకాలు - Paralympics 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.