Sarah Hildebrand Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో పతకం ముద్దాడాలనుకుని ఆ అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్న భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు మద్దతుగా పలువురు సినీ, క్రీడా రాజకీయవేత్తలు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రెజ్లింగ్ 50 కేజీల విభాగ గోల్డ్ విన్నర్ అమెరికా రెజ్లర్ సారా హిల్డర్‌బ్రాంట్ కీలక వ్యాఖ్యలు చేసింది. రెజ్లర్లు బరువు తగ్గించుకోవడంలో ఎదుర్కొనే కష్టాలను తను అర్థం చేసుకోగలనంటూ వెల్లడించింది.
"వినేశ్ ఓ గొప్ప అథ్లెట్. ఆమె ఓ అద్భుతమైన రెజ్లర్. తనపై అనర్హత వేటు పడటం ఎంతో బాధాకరం. బరువు కోసం నేను కూడా చాలా చేశాను. అందుకే ఆమె కష్టాన్ని బాగా అర్థం చేసుకోగలను. ఈ వార్త తెలియగానే ఫైనల్‌లో తలపడకుండానే బంగారు పతకం వచ్చిందని అనుకున్నాను. పారిస్ ఒలింపిక్స్‌లో విజేత నేనే అని భావించాను. కానీ, గంట వ్యవధిలోనే ఆ సంబరాలకు బ్రేక్ పడింది. కానీ ఫైనల్‌లో లోపేజ్‌తో తలపడనున్నాని తెలిసింది. చివరికి ఈ పోటీల్లో విజేతగా నిలవడం ఎంతో ఆనందంగా ఉంది. నేను కూడా ఈ పోటీల కోసం చాలా బరువు తగ్గాల్సి వచ్చింది. అందుకోసం ఎంతో తీవ్రంగా శ్రమించాను. వినేశ్ విషయంలో ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. సెమీస్‌లోనూ ఆమె చాలా అద్భుతంగా ఆడింది. కానీ, ఆమెకు ఒలింపిక్స్ ఇలా ముగుస్తుందని అనుకోలేదు. మనస్ఫూర్తిగా వినేశ్‌కు నేను సపోర్ట్ ఇస్తున్నాను. ఆమె నిజంగానే గొప్ప వారియర్. రెజ్లర్‌గానే కాకుండా వ్యక్తిగతంగానూ వినేశ్ ఓ మంచి మనిషి" అంటూ సారా వినేశ్‌పై ప్రశంసల జల్లు కురిపించింది.
కాంస్యం ఆ ఇద్దరికీ
ఇక బుధవారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) ఎంతో ఉత్కంఠగా జరిగిన రెజ్లింగ్ 50కేజీల ఫైనల్‌లో క్యూబాకు చెందిన గుజ్మన్ లోపేజ్‌పై సారా హిల్డర్‌బ్రాంట్ విజయం సాధించింది. అలా గోల్డ్ మెడల్‌ను ఈ అమెరికా రెజ్లర్ ముద్దాడింది. ఇక లోపేజ్‌కు రజతం దక్కగా, జపాన్ అథ్లెట్ సుసాకీ, చైనా రెజ్లర్ జికీ ఫెంగ్ కాంస్యాలు అందుకున్నారు.
'కుస్తీ గెలిచింది, నేను ఓడాను' - రిటైర్మెంట్ ప్రకటించిన వినేశ్ - Vinesh Phogat Retirement
'ఫొగాట్ అనర్హత క్రూరమైన చర్య- అథ్లెట్లకు ఆ మాత్రం తెలుసు' - Paris Olympics 2024