Sara Tendulkar Latest Photos : టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ క్రికెట్ అభిమానిని అడిగిన సరే చెబుతారు. అలానే ఆయన కూతురు సారా తెందుల్కర్ గురించి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎక్కువగా ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పర్సనల్ విషయాలతో నిత్యం వార్తలలో నిలుస్తుంటుంది. లవ్, డేటింగ్ అంటూ ఆమెకు సంబంధించిన వార్తలు నెట్టింట్లో అనేక రూమర్స్ వైరల్ అవుతుంటాయి. అయితే వాటిపై ఆమె ఎప్పుడూ పెద్దగా స్పందించదు. రియాక్ట్ అవ్వకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది.
నెట్టింట్లో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ పిక్స్‌ను అప్లోడ్ చేస్తూ అందాలను ఆరబోస్తుంది. ఆమె ఆన్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వకపోయినప్పటికీ ఇప్పటికే తన గ్లామర్‌తో ఓ హీరోయిన్ కన్నా ఎక్కువగానే ఫాలోయింగ్ సంపాదించుకుందనే చెప్పాలి. తాజాగా మరోసారి ఈ బ్యూటీ షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పిక్స్‌లో గెల్డెన్ జాల్ లెహంగాలో ఎంతో అందంగా కనిపించింది సారా. థ్రెడ్‌వర్క్‌తో ఉన్న ఈ లెహంగాలో లైట్ మేకప్‌లో చాలా బ్యూటీఫుల్‌గా ఉంది.
సారా పోస్ట్ చేసిన ఈ ఫోటోలకు గంటలోపే 3 లక్షలకు పైగా లైక్స్ రావడం విశేషం. అలానే ఈ సూపర్ బ్యూటిఫుల్ పిక్స్‌పై నెటినజ్స్ క్రేజీ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే సారా ఇలా అందంగా ముస్తాబవ్వడానికి కారణం సంగీత్ కోసం అని తెలుస్తోంది. ఆ ఫోటోలను షేర్ చేసిన సారా సంగీత్ కోసం రెడీ అంటూ ఒక క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.
కాగా, సారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక సారా క్యాప్షన్ చూసిన నెటిజన్లు, సచిన్ అభిమానులు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నావ్ అంటూ ఆమెను అడుగుతున్నారు. బ్యూటీఫుల్‌గా ఉన్నావ్ వదినమ్మ, గిల్ బావ ఏం అంటున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆమె సినీ ఎంట్రీపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. చాలాకాలంగా ఆమె క్రికెటర్ శుభ్ మాన్ గిల్‌తో ప్రేమలో ఉందంటూ ఆ మధ్య వార్తలు బాగా వచ్చాయి. అనంతరం వీరిద్దరు బ్రేకప్ కూడా చెప్పుకున్నారని రూమర్స్ వచ్చాయి. అయితే దీనిపై వీరిద్దరు స్పందించలేదు.
రూ.70వేల కోట్ల నెట్‌వర్త్- ఈ క్రికెటర్ కుబేరుడు గురూ- రోహిత్, విరాట్ కాదు
విరాట్ బొమ్మ గీసిన స్మృతి- డ్రాయింగ్‌లో కింగ్ 'కిరీటమే' హైలైట్