Sanjay Bangar Son Gender Change : టీమ్ఇండియా మాజీ ఆటగాడు, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ ఆసక్తిర విషయం వెల్లడించారు. తాను హార్మోన్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారినట్లు తెలిపారు. ఇక నుంచి తన పేరు ఆర్యన్ కాదు అనయ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు షేర్ చేశారు. ఆర్యన్ తన జెండర్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ గురించి అందులో పేర్కొన్నారు.
టీమ్ఇండియా మాజీ ఆటగాడు, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ ఆసక్తిర విషయం వెల్లడించారు. తాను హార్మోన్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారినట్లు తెలిపారు. ఇక నుంచి తన పేరు ఆర్యన్ కాదు అనయ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.
'క్రికెట్ వదులుకుంటున్నా'
అనయ గత 10 నెలలుగా హార్మోన్ రీప్లేస్ మెంట్ థెరపీ తీసుకుంటున్నారు. ఇటీవల సర్జరీ చేయించుకుని అమ్మాయిగా రూపాంతరం చెందానని చెప్పుకొచ్చారు. 'చిన్నప్పటి నుంచి క్రికెట్ నా జీవితంలో భాగమైంది. మా నాన్న దేశానికి ప్రాతినిధ్యం వహించినప్పుడు, కోచ్‌గా ఉన్నప్పుడు నేను చాలా గర్వంగా ఫీలయ్యాను. ఆయన అడుగుజాడల్లో నడవాలని కలలు కన్నాను. క్రీడల పట్ల నా తండ్రికి ఉన్న అభిరుచి, క్రమశిక్షణ, అంకితభావం ఎంతో స్ఫూర్తినిచ్చాయి. క్రికెట్లో స్కిల్స్ మెరుగుపర్చేందుకు నా జీవితాంతం గడిపాను. ఏదో ఒక రోజు నా తండ్రిలాగే దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను' అని ఇన్ స్టా పోస్టులో అనయ రాసుకొచ్చారు.
'నాకు ఇష్టమైన క్రికెట్ వదిలేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. హార్మోన్ రీప్లేస్ మెంట్ థెరపీతో ట్రాన్స్ ఉమెన్‌గా మారాను. దీంతో నా శరీరం బాగా మారిపోయింది. నా కండరాల్లో బలం తగ్గిపోయింది. అలాగే అథ్లెటిక్ సామర్థ్యాలను కోల్పోతున్నాను. నాకు ఇష్టమైన క్రికెట్‌ను కోల్పోతున్నాను' అని పేర్కొన్నారు.
తండ్రిలానే క్రికెటర్ కావాలని!
ఆర్యన్ బంగర్ కూడా తన తండ్రిలాగే క్రికెటర్ కావాలని కలలు కన్నారు. అందుకు తగ్గట్టుగానే చిన్నతనం నుంచే క్రికెట్ ప్రాక్టీస్ చేశారు. ఎడమచేతి వాటం బ్యాటర్‌గా గుర్తింపు పొందిన ఆర్యన్, లీసెస్టర్ షై ర్‌లోని హింక్లీ క్రికెట్ క్లబ్ తరపున ఆడారు. ప్రస్తుతం ట్రాన్స్ ఉమెన్‌గా మారి వార్తల్లోకెక్కారు.
కాగా, సంజయ్ బంగర్ తన కెరీర్ లో 12 టెస్టులు ఆడి 470 పరుగులు చేశాడు. అలాగే 15 వన్డేల్లో 180 రన్స్ బాదాడు. 2014 నుంచి 2018 వరకు భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా పనిచేశాడు. అలాగే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు హెడ్ కోచ్ గా పనిచేశాడు. అలాగే పంజాబ్ కింగ్స్ కు క్రికెట్ డెవలప్ మెంట్ హెడ్ గా సేవలు అందించాడు.