Yuvraj Singh Record Break T20 WC Qualifier : టీ20 ప్రపంచ కప్ 2026 మెగా టోర్నీ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న క్వాలిఫయర్ మ్యాచుల్లో తాజాగా ఓ అరుదైన ఫీచ్ నమోదైంది. ఓ యంగ్ ప్లేయర్ భారత్ దిగ్గజ క్రికటర్ యూవరాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇంతకీ అదేంటంటే?
క్వాలిఫైయర్ మ్యాచ్‌లో భాగంగా సమోవా, వనువాటు దేశాల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో సమోవా బ్యాటర్ డేరియస్ విస్సెర్ ఒకే ఓవర్‌లో 39 పరుగులు సాధించాడు. సమోవా ఇన్నింగ్స్‌లోని 15వ ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టాడు. అదనంగా మూడు నో బాల్స్ కూడా పడటం వల్ల ఒకే ఓవర్‌లో (6, 6, 6, నోబాల్, 6, 0, నో బాల్, నో బాల్+6, 6) అలా ఎక్కువ పరుగులు వచ్చేశాయి. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లోని సిక్సర్ల వీరుల జాబితాలో చేరిపోయాడు. అయితే ఇప్పటి వరకు యువీ కాకుండా, ఈ లిస్ట్‌లో కీరన్ పొలార్డ్ (2021), నికోలస్ పూరన్ (2024), దీపేంద్ర సింగ్ (2024) మాత్రమే ఈ అరుదైన ఫీట్‌ను సాధించారు.
🚨WORLD RECORD CREATED IN MEN’S T20 LEVEL 1 OVER 39 RUNS
— SportsOnX (@SportzOnX) August 20, 2024
Darius Visser scored 39 runs in match between Samoa Vs Vanuatu
(🎥 - ICC)#T20 #T20WorldCup #records #ICC #CricketUpdate #cricketnews pic.twitter.com/sXiyrlxjtE
ఇదిలా ఉండగా, సమోవా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ (62 బంతుల్లో 132 పరుగులు : 14 సిక్స్‌లు, 5 ఫోర్లు) సాధించిన తొలి క్రికెటర్‌గానూ డేరియస్ రికార్డుకెక్కాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సమోవా నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులకే అందరూ పెవిలియన్ బాట పట్టారు. అందులోనూ డేరియస్ శతకం చేయగా, కెప్టెన్ కలేబ్ జస్మత్ (16) మాత్రమే రెండంకెల స్కోరు సాధించడం గమనార్హం. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన వనవాటు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు మాత్రమే స్కోర్ చేయగలిగింది. దీంతో 10 పరుగుల తేడాతో సమోవా ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.