Sachin Tendulkar playing cricket in Kashmir : దాదాపు పాతికేళ్ల పాటు క్రికెట్ కెరీర్, ఆటకు వీడ్కోలు పలికి పదేళ్లు అయిపోయింది. అయినా క్రికెట్ ఫ్యాన్స్‌ను తన బ్యాట్‌తో అలరించిన గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ తెందూల్కర్ క్రేజ్ ఏమాత్రం ఇంకా తగ్గలేదు. ఆయన ఎక్కడకెళ్లినా అభిమానులు సచిన్ - సచిన్ అంటూ కేరింతలు కొడుతూనే ఉంటారు. అయితే రీసెంట్గా ఆయన తన కుటంబ సభ్యులతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.
అసలే మాస్టర్ ఎప్పుడు సోషల్ మీడియాలో ఎప్పుడు ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. అలా కశ్మీర పర్యటనకు వెళ్లిన అతడు అక్కడ తాను గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. అలా తాజాగా అక్కడ క్రికెట్ ఆడిన సందర్భాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. క్రికెట్ అండ్ కశ్మీర్ - ఏ మ్యాచ్ ఇన్ హెవన్ అని క్యాప్షన్ రాసుకొచ్చారు. అంటే భూతల స్వర్గంలో క్రికెట్ ఆడినట్లు ఉందని తన అందమైన అనుభూతిని పంచుకున్నాడు.
కాగా, సచిన్ తెందూల్కర్ తొలిసారి కశ్మీర్ పర్యటనకు వెళ్లాడు. భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి అక్కడికి వెళ్లాడు. అక్కడి అందాలను చూసి తాను ఆశ్చర్యానికి గురైనట్లు కూడా గత పోస్ట్‌లో లిటిల్ మాస్టర్ రాసుకొచ్చాడు. శ్రీనగర్ - జమ్మూ హైవేపై కారులో ప్రయాణిస్తూ భూతల స్వర్గంలో పర్యటించడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. అలాగే క్రికెట్ బ్యాట్లను తయారు చేసే కంపెనీకి వెళ్లీ అక్కడ కశ్మీర్ విల్లో బ్యాట్లు, ఇంగ్లిష్ విల్లో బ్యాట్ల నాణ్యతను పోల్చడానికి వచ్చానని అన్నాడు.
సచిన్ తమ కంపెనీకి రావడంపై ఎంజే స్పోర్ట్స్ యజమాని మహమ్మద్ షహీన్ హర్షం వ్యక్తం చేశారు. మేం బ్యాట్లను తయారు చేసే పనిలో బిజీగా ఉన్నాం. అదే సమయంలో మా గేట్ వద్ద ఓ వాహనం సడెన్‌గా ఆగింది. అందులో సచిన్ తెందూల్కర్‌ను చూసి ఆశ్చర్యపోయాం. ఆయన కారు దిగి వచ్చి కొన్ని బ్యాట్ల స్ట్రోక్‌ను పరిశీలించారు. నాణ్యతపై సంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. కశ్మీర్ విల్లో బ్యాట్లు, ఇంగ్లిష్ విల్లో బ్యాట్ల క్వాలిటీని పోల్చడానికి వచ్చినట్లు మాతో చెప్పారు. స్థానిక బ్యాట్ల తయారీదారులకు మద్దతు ఇవ్వాలని మేం ఆయన్ను కోరాం అని షహీన్ చెప్పుకొచ్చారు.
-
Cricket & Kashmir: A MATCH in HEAVEN! pic.twitter.com/rAG9z5tkJV
— Sachin Tendulkar (@sachin_rt) February 22, 2024