Sachin Tendulkar Fan : టీమ్ఇండియా మాజీ ప్లేయర్, క్రికెట్ గాడ్‌కు భారత్‌లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఆయన క్రికెట్‌ను వీడి దాదాపు పదేళ్లు అయింది. అయినప్పటికీ ఫ్యాన్స్ ఆయన్ను ఇప్పటికీ గుండెల్లో పెట్టుకుని కొలుస్తుంటారు. తన ఆటను గుర్తుచేసుకుంటుంటారు. ఇక మాస్టర్ బ్లస్టర్‌కు దేశవిదేశాల్లోనూ కొన్ని లక్షల సంఖ్యలో అభిమానులున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా కూడా సచిన్‌తో ఫొటో దిగడానికి, ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి అభిమానులు ఎగబడుతుంటారు. అయితే ఇటీవలే సచినే స్వయంగా ఓ ఫ్యాన్‌ను కలిశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.
ఇంతకీ ఏం జరిగిదంటే ?
స్టార్ క్రికెటర్ సచిన్ తన ఫ్రెండ్‌తో కలిసి కారులో వెళ్తున్న సమయంలో ముంబయి ఇండియన్స్ జెర్సీ ధరించి బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని సచిన్ చూశారు. అతడి జెర్సీ వెనక భాగంలో 'తెందూల్కర్ 10 ఐ మిస్ యూ' అని రాసి ఉంది. దీన్ని చూసి ఆ ఫ్యాన్‌ను ఫాలో అయిన ఈ క్రికెట్ గాడ్ కొద్ది దూరం వెళ్లాక తర్వాత కారు ఆపి ఆ వ్యక్తితో మాట్లాడాడు.
ఎయిర్‌పోర్ట్‌కు ఎలా వెళ్లలంటూ ఆయన మాట్లాడటం మొదలెట్టారు. దీంతో సచిన్‌ను చూసి ఆ అభిమాని ఆనందంలో మునిగిపోయాడు. తనను కలవడానికి కారు ఆపినందుకు సచిన్‌కు ధన్యవాదాలు తెలిపాడు. తన చేతిపై ఉన్న సచిన్ టాటూని, లిటిల్ మాస్టర్‌కు సంబంధించిన కొన్ని అరుదైన ఫొటోలను ఆ ఫ్యాన్ తెందూల్కర్‌కి చూపించాడు. ఆ తర్వాత సచిన్ అతడికి ఆటోగ్రాఫ్ ఇచ్చారు. హెల్మెట్ పెట్టుకుని బైక్ నడుపుతున్నందుకు ఆ ఫ్యాన్‌ను అభినందించారు. తాను కూడా సీటు బెల్టు ధరించి ప్రయాణిస్తానంటూ పేర్కొన్నారు.
-
Sachin meets TENDULKAR. 😋
— Sachin Tendulkar (@sachin_rt) February 1, 2024
It fills my heart with joy when I see so much love showered on me. It is the love from the people that keeps coming from unexpected corners which makes life so special. pic.twitter.com/jTaV3Rjrgm
Sachin Tendulkar Stats : సచిన్ తెందూల్కర్ తన కెరీర్లో 664 అంతర్జాతీయ (200 టెస్టు, 463 వన్డే, 1 టీ20) మ్యాచ్‌లు ఆడారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 34357 పరుగులు చేశారు. ఇక క్రికెట్ చరిత్రలో 100 శతకాలు నమోదు చేసిన ఘనత కూడా తెందూల్కర్దే. ఆయన టెస్టుల్లో 51 సెంచరీలు, వన్డేల్లో 49 శతకాలు బాదారు.
వాంఖడేలో 22 అడుగుల సచిన్ విగ్రహం భావోద్వేగానికి లోనైన క్రికెట్ గాడ్