ETV Bharat / sports

అంజలీలోని ఆ క్వాలిటీకి సచిన్ ఫిదా - తొలిసారి అక్కడే కలిశారట!- వీరి లవ్ స్టోరీ తెలుసా ? - Sachin Tendulkar Birthday

Sachin Tendulkar Birthday : క్రికెట్ హిస్టరీలో ఓ అద్భుతమైన అధ్యాయం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ కెరీర్. అతడు సాధించిన ప్రతి విజయం, రికార్డు అభిమానులు ప్రత్యేకంగా గుర్తుంచుకుంటారు. మరి ఎంత మందికి సచిన్‌ లవ్‌ స్టోరీ గురించి తెలుసు?

Sachin Tendulkar Birthday
Sachin Tendulkar Birthday
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 24, 2024, 6:55 AM IST

Sachin Tendulkar Birthday : ఇండియాలో చాలా మంది క్రికెటర్లుగా మారడానికి, ప్రపంచంలో చాలా మంది క్రికెటర్లుగా రాణించడానికి అతడే కారణం. ప్రత్యక్షంగా వారి ఎదుగుదలకు అతడు చేసింది ఏమీ లేకపోయినప్పటికీ, పరోక్షంగా వారికి తన ఆటతో పంచిన స్ఫూర్తి మాత్రం వెలకట్టలేనిది. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది, అవును మనం మాట్లాడుతోంది క్రికెట్‌ గాడ్‌ 'సచిన్‌ తెందూల్కర్‌' గురించి. ఏప్రిల్ 24న సచిన్‌ పుట్టిన రోజు. ఈ ఏడాది సచిన్‌ 44వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. అయితే సచిన్ క్రికెట్ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతను సాధించిన విజయాలు, నెలకొల్పిన రికార్డులు ప్రతి క్రికెట్‌ అభిమానికి పరిచయమే. కానీ సచిన్ లవ్​స్టోరీ గురించి మీకు తెలుసా ?

ఏయిర్​పోర్ట్​లో తొలిచూపు
సచిన్‌, తన సతీమణి అంజలీని ముంబయి ఇంటర్నేషనల్‌ ఆమెను తొలిసారి ఎయిర్‌పోర్టులో చూశాడు. తొలి చూపులోనే ప్రేమించాడట. అది 1990. సచిన్, తన మొట్టమొదటి ఇంటర్నేషనల్ గేమ్‌ ఆడి తిరిగి వస్తున్నాడు. సరిగ్గా అప్పుడే అంజలి తన తల్లిని రిసీవ్‌ చేసుకోవడానికి ఎయిర్‌పోర్ట్‌కి వచ్చారు. అప్పుడే ఆ ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. చూడగానే ఒకరిపై ఒకరికి తెలియని ఆకర్షణ మొదలైందట. ఆ తర్వాత అనుకోకుండా ఇద్దరూ, ఒక కామన్‌ ఫ్రెండ్‌ ఇంట్లో కలిశారు. అక్కడి నుంచే వారి ప్రేమ కథ మొదలైంది.

ఆ క్వాలిటీ సచిన్​కు బాగా నచ్చింది
"నాకు క్రికెట్‌ గురించి ఏమీ తెలియదు. నాలోని ఆ లక్షణమే సచిన్‌ నన్ను ఇష్టపడటానికి మొదటి కారణం." అంటూ అంజలి ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చారు. ఆ ఇద్దరూ డేటింగ్ ప్రారంభించాక, అంజలి పూర్తిగా క్రికెట్‌ గురించి పూర్తిగా తెలుసుకున్నారు. ఆ రోజుల్లో వారి మధ్య ఉన్న ఏకైక కమ్యూనికేషన్‌ లెటర్లు మాత్రమే. అందుకే రిలేషన్‌లో ఉన్న సమయంలో సచిన్‌కు తరచూ ఆమె చాలా ప్రేమ లేఖలు రాశారు. అంజలికి ఓ ఫోన్ కాల్ చేయడానికి చాలా దూరం నడవాల్సి వచ్చేదట. దాదాపు 5 ఏళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత ఈ జంట 1995లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

సచిన్ తెందూల్కర్ కంటే అంజలి ఆరేళ్లు పెద్ద. ఈ ఏజ్‌ గ్యాప్‌ గురించి ఆమెను పలువురు చాలా సార్లు ప్రశ్నించారు. అయితే తమ మధ్య ఈ ఏజ్ గ్యాప్ కేవలం ఒక సంఖ్య మాత్రమేనంటూ సచిన్​, అంజలి చాలా సందర్భాల్లో సమాధానమిచ్చారు. తమ ముచ్చటైన కపుల్ గోల్స్​తో ఎంతోమందికి ఇన్​స్పిరేషన్​గా నిలిచింది ఈ జంట. ఇక వీరికి సారా తెందూల్కర్‌, అర్జున్ తెందూల్కర్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే.

క్రికెట్‌లో సచిన్ బిజీబిజీగా ఉన్నప్పుడు అంజలినే కుటుంబం, పిల్లల బాధ్యతలను చక్కగా నిర్వర్తించేవారట. తమ బంధాన్ని నిలుపుకోవడానికి అంజలి, సచిన్ కలిసి చేసిన అన్ని ప్రయత్నాల కారణంగా వారు ఇప్పుడు అందమైన, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. సచిన్‌ క్రికెట్‌ కెరీర్‌ మాత్రమే కాదు, అతని లవ్‌ స్టోరీ, వ్యక్తిగత జీవితం కూడా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

14 ఏళ్ల క్రితం సచిన్ డబుల్ సెంచరీ - వన్డే హిస్టరీలో బెస్ట్ మూమెంట్​!

28 ఏళ్లకే రూ.100 కోట్ల డీల్- ప్రపంచంలోనే తొలి క్రికెటర్​గా రికార్డ్ - Rs 100 Crore Deal Cricketer

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.