Sachin ODI Double Century : క్రికెట్ లవర్స్ ఎప్పటికీ గుర్తుపెట్టుకునే మూమెంట్స్ హిస్టరీలో చాలానే ఉన్నాయి. అయితే అందులో ఫిబ్రవరి 24కి మాత్రం మరింత ప్రత్యేకత ఉంది. ఎందుకుంటే సరిగ్గా 14 ఏళ్ల క్రితం భారత జట్టు మాజీ ప్లేయర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వన్డేలో ఓ ఘనతను సాధించాడు. అదేంటంటే ?
2010, 24 ఫిబ్రవరి న గ్వాలియర్ వేదికగా సౌతాఫ్రికాతో వన్డే మ్యాచ్ జరిగింది. ఎంతో ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్‌లో సచిన్ ద్విశతకం బాది రికార్డుకెక్కాడు. దిగ్గజ ప్లేయర్‌కు ఇదంతా కామనే కదా అని అనుకుంటే మీరు పొరబడట్లే. సుమారు 37 ఏళ్ల వయసులో సచిన్ ఈ రికార్డును అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.
మ్యాచ్ సాగిందిలా :
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. సీనియర్ బ్యాటర్, ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ మైదానంలోకి దిగాడు. అయితే ఎన్నో ఆశల నడుమ ఆయన క్రీజుల్లోకి రాగా, కేవలం 9 పరుగులు మాత్రమే చేసి వెనుతిరిగాడు. పార్నెల్ బౌలింగ్‌లో స్టెయిన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన దినేశ్ కార్తీక్‌తో కలిసి సచిన్ జట్టుకు అద్భుతమైన ఇన్నింగ్స్ ఇచ్చాడు. ఈ ద్వయం తమ పార్ట్నర్షిప్లో రెండో వికెట్ సమయానికి 194 పరుగుల భారీ స్కోర్‌ను సాధించారు. 79 పరుగులు మాత్రమే చేయగలిగిన దినేశ్, 34వ ఓవర్‌లో అనుహ్యంగా ఔటయ్యాడు.
ఇక ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన యూసఫ్ పఠాన్ కూడా 36 పరుగులు చేశాడు. ఫోర్లు, సిక్స్‌లు బాదినప్పటికీ జట్టుకు కీలక ఇన్నింగ్స్ ఇవ్వలేకపోయాడు. దీంతో జట్టును కాపాడటం ఇక ధోనీ వంతు అయ్యింది. 42వ ఓవర్‌లో బరిలోకి దిగిన ధోనీ తన ధనాధన్ ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థులను ఓ ఆట ఆడేసుకున్నాడు. అప్పటికే క్రీజులో ఉన్న సచిన్ శతకం బాది డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. కానీ సచిన్‌కి స్ట్రైక్ ఇవ్వకుండా ధోనినే బ్యాటింగ్ చేయడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచిన్ ఎలాగైనా డబుల్ సెంచరీ చేయాలంటూ కోరుకుంటున్నారు.
ఎందుకంటే వన్డే క్రికెట్ చరిత్రలో అంతకముందు ఎప్పుడూ ఏ బ్యాటర్ కూడా డబుల్ సెంచరీ సాధించలేదు. దీంతో సచిన్ ఇన్నింగ్స్‌పై క్రికెట్ లవర్స్ కొండంత ఆశలు పెట్టుకున్నారు. అయితే కొద్ది సేపటికే తాము కలలు కన్న తరుణం రానే వచ్చింది. 147 బంతుల్లోనే సచిన్ తన డబుల్ సెంచరీ మార్క్‌ను సాధించాడు. టీమ్ఇండియా ఇన్సింగ్ చివరి ఓవర్‌లో చార్ల్ లాంగ్‌వెల్ట్ వేసిన మూడో బంతికి సచిన్ సింగిల్ తీశాడు. అలా వన్డే క్రికెట్‌లో తొలి ద్విశతకం చేసిన ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.
-
🗓️ #OnThisDay in 2010
— BCCI (@BCCI) February 24, 2024
The legendary @sachin_rt created history by becoming the first batter to score an ODI Double Hundred in Mens Cricket 👏👏#TeamIndia pic.twitter.com/NCcnQkhkcj
భూతల స్వర్గంలో క్రికెట్ ఆడిన లిటిల్ మాస్టర్
ఫ్యాన్ మూమెంట్ - అభిమానికి సర్ప్రైజ్ ఇచ్చిన క్రికెట్ గాడ్