ETV Bharat / sports

'సన్​రైజర్స్'దే టైటిల్ - కావ్యా మారన్ ఫుల్ హ్యాపీ- పాప ఫ్యాన్స్ ఖుష్ ​ - కావ్యా మారన్ నెట్​వర్త్​

SA T20 Kaviya Maran: సౌతాఫ్రితా టీ20 లీగ్ ఫైనల్ మ్యాచ్​కు సన్​రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ హాజరై స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది. స్టేడియంలో హుషారుగా కేరింతలు కొడుతూ సన్​రైజర్స్ ప్లేయర్లను ప్రోత్సాహించింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

SA T20 KAVIYA
SA T20 KAVIYA
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 11:12 AM IST

Updated : Feb 11, 2024, 12:01 PM IST

SA T20 Kaviya Maran: సౌతాఫ్రికా టీ20 లీగ్​ 2024లో సన్​రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు ఛాంపియన్​గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్​లో ఈస్టర్న్​ కేప్ జట్టు డర్బన్ సూపర్ జెయింట్స్‌​పై నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్​రైజర్స్​ నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్​లో డర్బన్ సూపర్ జెయింట్స్‌ 115 పరుగులకే పరిమితమైంది. ఇక సన్​రైజర్స్​కు ఇది వరుసగా రెండో టైటిల్ కావడం విశేషం.

స్పెషల్ అట్రాక్షన్: ఈ మ్యాచ్​కు హాజరైన సన్​రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్ స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది. తమ జట్టు ప్లేయర్లు బౌండరీలు బాదుతుంటే కేరింతలు కొడుతూ ఆటగాళ్లను ఎంకరేజ్ చేసింది. అయితే ఐపీఎల్​లో డల్​గా కనిపించే కావ్య, సౌతాఫ్రికా లీగ్​లో తమ జట్టు గెలుపును ఆస్వాదిస్తూ నవ్వుతుంటే ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్​గా మారాయి. ఇక ఎప్పుడూ మీడియా, సోషల్ మీడియాకు దూరంగా ఉండే కావ్య ట్రోఫీ ప్రజెంటేషన్ అనంతరం బ్రాడ్​కాస్టర్​తో మాట్లాడుతూ సంతోషాన్ని షేర్ చేసుకుంది. 'మాకు ఇది వరుసగా రెండో టైటిల్. చాలా హ్యాపీగా ఉంది. మా ప్లేయర్లు ఆల్​రౌండ్ ప్రదర్శన కనబర్చారు. ఈ సీజన్​లో అన్ని మ్యాచ్​ల్లో రాణించి ఈరోజు టైటిల్ సాధించారు. ఛాంపియన్‌గా నిలవడం సంతోషంగా ఉంది' అని కావ్యా మారన్ చెప్పింది.

Sun Risers Hyderabad 2024: ఇక ఐపీఎల్​ విషయానికొస్తే, 2024 వేలంలో సన్​రైజర్స్​ భారీ కొనుగొళ్లు చేసింది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను రూ.20.50 కోట్ల రికార్డ్ ధరకు కొనుగోలు చేసింది. ఇది ఐపీఎల్​ చరిత్రలో రెండో అత్యధిక ధర. ఇక రూ.6.80 కోట్లకు ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌, రూ.1.50 కోట్లకు శ్రీలంక స్పిన్నర్​ వానిందు హసరంగను దక్కించుకుంది. ఇక దేశవాళీలో ఆకాశ్ సింగ్, జయదేవ్ ఉనాద్కత్, సుబ్రమణ్యన్‌లను కూడా తీసుకుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: మయాంక్ అగర్వాల్, హెన్రీచ్ క్లాసెన్(కీపర్), ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, వాషింగ్టన్ సుందర్, షెహ్‌బాజ్ అహ్మద్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్,అబ్దుల్ సమద్, ఉపేంద్ర యాదవ్, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ఆకాశ్ సింగ్, జయదేవ్ ఉనాద్కత్, సుబ్రమణ్యన్‌.

అటు ఐపీఎల్- ఇటు బిజినెస్​లు​- కావ్య పాప ఆస్తులెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

కొత్త కోచ్​ వేటలో సన్​రైజర్స్​.. బ్రియన్​ లారాకు బైబై.. అతడిపై ఆసక్తి!

Last Updated : Feb 11, 2024, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.