RR vs GT IPL 2024 : ఐపీఎల్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో తలపడ్డ పోరులో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఇక ఓటమి తప్పదనుకున్న సమయంలో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది గుజరాత్ జట్టు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (72) జట్టును ముందుండి నడిపిస్తే, ఆఖరిలో వచ్చిన రాహుల్ తెవాతియా (22), రషీద్ ఖాన్ (24) కూడా మంచి స్కోర్ సాధించి జట్టును గెలిపించారు. దీంతో ఆ జట్టు 197 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి చివరి బంతికి ఛేదించింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (24) జాస్ బట్లర్ (8) విఫలమయ్యారు. దీంతో కెప్టెన్ సంజూ శాంసన్ (68*), రియాన్ పరాగ్ (76) స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నారు. వీరిద్దరూ గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. పోటీపడి మరీ బౌండరీలు బాదుతూ ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
మూడో వికెట్‌కు ఏకందా 130 పరుగులు జోడించి జట్టుకు మంచి స్కోర్ అందించారు. ఇక చివర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రియాన్ బౌండరీ లైన్ వద్ద విజయ్ శంకర్‌కు దొరికిపోయాడు. విజయ్ అందుకున్న అద్భుత క్యాచ్‌తో పరాగ్ పెవిలియన్ చేరాడు. చివర్లో షిమ్రన్ హెట్మెయర్ (13*) కూడా సహకారం అందించాడు. గుజరాత్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు.
గిల్ @3000: ఈ మ్యాచ్‌లో గిల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 3వేల పరుగులు సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. గిల్ 94 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత అందుకున్నాడు. కాగా, ఈ లిస్ట్‌లో కేఎల్ రాహుల్ (80 ఇన్నింగ్స్) ముందున్నాడు.
చాహల్ @150: రాజస్థాన్ రాయల్స్ జట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ బుధవారం (ఏప్రిల్ 10)న జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్లో 150 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. ఇప్పటివరకూ 150 మ్యాచ్‌లు ఆడిన చాహల్ 7.66 ఎకనమీతో 195 వికెట్లు పడగొట్టాడు.
-
.𝗣𝗮𝗿𝗮𝗴 𝗣𝗼𝘄𝗲𝗿! 💥💥
— IndianPremierLeague (@IPL) April 10, 2024
The in-form @rajasthanroyals batter smashes dual maximums against Noor Ahmad!
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #RRvGT pic.twitter.com/9YnmsVs8CC
'అది రోహిత్ ఇష్టం- అందరూ హిట్‌మ్యాన్‌ను కెప్టెన్ చేయాలనుకుంటారు' - Ambati Rayudu On Rohit Sharma