Rohit sharma vs australia T20 World Cup: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్- 8లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. సోమవారం సెయింట్ లూయిస్ మైదానాన్ని సిక్సర్లతో ముంచెత్తుతూ భారీ ఇన్నింగ్స్ (92 పరుగులు; 41 బంతుల్లో: 4x7, 6x8)తో రఫ్పాడించాడు. తొలి నుంచే ఎటాకింగ్ గేమ్ ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ క్రమంలోనే 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కాగా, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.
అప్పుడే మొదలైంది
రోహిత్ విధ్వంసం ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే మొదలైంది. ఆసీస్ స్టార్ పేసర్ మిచెస్ స్టార్క్‌ను హిట్‌మ్యాన్ ఊచకోత కోశాడు. ఈ ఓవర్లో వరుసగా 6,6,4,6,0,6తో ఏకంగా 29 (వైడ్ సహా) పరుగులు వచ్చాయి. ఆ తర్వాత కమిన్స్ వేసిన 5వ ఓవర్లో 6,4,4తో 15 పరుగులు పిండుకున్నాడు. ఇలా ఆసీస్ అగ్రస్థాయి బౌలర్లైన స్టార్క్, కమిన్స్‌ను హిట్‌మ్యాన్ ఆటాడేసుకున్నాడు. కాగా, సెంచరీకి చేరువైన క్రమంలో 92 పరుగుల వద్ద స్టార్క్ యార్కర్‌కు రోహిత్ బౌల్డయ్యాడు.
ఏకైక బ్యాటర్‌గా రికార్డ్
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో 200 సిక్స్‌లు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ లిస్ట్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గప్టిల్ (173), జాస్ బట్లర్ (137) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఆస్ట్రేలియాపై సిక్సర్ల సునామీ
రోహిత్ అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో కలిపి)లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సిక్స్‌లు బాదిన రికార్డు కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాపై రోహిత్ 130+ సిక్స్‌లు బాదాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ (130 సిక్స్‌లు vs ఇంగ్లాండ్‌పై)ను అధిగమించాడు.
Rohit Sharma: Aaj nahi chhodunga! 💪#INDvsAUS #T20WorldCup pic.twitter.com/d5IwbJL0Ek
— Disney+ Hotstar (@DisneyPlusHS) June 24, 2024
Rohit Sharma is on the charge ⚡
— T20 World Cup (@T20WorldCup) June 24, 2024
A rampant fifty from him powers India to 60/1 at the end of the Powerplay 🔥#T20WorldCup | #AUSvIND | 📝: https://t.co/amIpWtj5n8 pic.twitter.com/1iZYYZ8YP3
19వేల పరుగులు పూర్తి: ఈ ఇన్నింగ్స్‌తో రోహిత్ అంతర్జాతీయ కెరీర్ (అన్ని ఫార్మాట్ల)లో కలిపి 19వేల పరుగులు పూర్తి చేశాడు. 80పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఈ మైలురాయి అందుకున్నాడు. ఇప్పటిదాకా రోహిత్ ఇంటర్నేషనల్ క్రికెట్లో 19012 పరుగులు చేశాడు.
ఇక టీమ్ఇండియా ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 205-5 భారీ స్కోర్ చేసింది. రోహిత్‌తోపాటు సూర్యకుమార్ యాదవ్ (31), శివమ్ దూబే (28), హార్దిక్ పాండ్య (27) రాణించారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, స్టోయినిస్ చెరో 2, హేజిల్‌వుడ్ 1 వికెట్ దక్కించుకున్నారు.