ETV Bharat / sports

'అప్పట్లో ఒకడుండేవాడు'- డకెట్ కామెంట్స్​కు రోహిత్​ స్ట్రాంగ్ రిప్లై

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 3:14 PM IST

Updated : Mar 6, 2024, 4:43 PM IST

Rohit Sharma On Pant: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్ ప్లేయర్ డకెట్​ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించాడు. ఇంతకీ అతడు ఏమన్నాడంటే?

Rohit Sharma On Pant
Rohit Sharma On Pant

Rohit Sharma On Pant: భారత్- ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్టు మార్చి ​7న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్​కు ధర్మశాల స్టేడియం వేదిక కానుంది. ఇక ఇరుజట్లు ఇప్పటికే ధర్మశాలకు చేరుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టేశాయి. ఈ క్రమంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్​లో పాల్గొన్నాడు. ఈ మీట్​లో రోహిత్ శర్మ ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ డకెట్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్​ రిప్లై ఇచ్చాడు.

టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ యశస్వీ జైశ్వాల్ తమ జట్టు బజ్​బాల్ వ్యూహాన్ని చూసి దూకుడుగా ఆడడం నేర్చుకున్నాడని ​ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ డకెట్ ఇటీవల వ్యాఖ్యానించాడు. దీనిపై రోహిత్ తాజా ప్రెస్​ కాన్ఫరెన్స్​లో స్పందించాడు. 'మా జట్టులో రిషభ్ పంత్ అనే ప్లేయర్ ఉండేవాడు. బహుషా బెన్ డకెట్ ఆతడి ఆట చూసి ఉండడు' ఇంగ్లాండ్ ప్లేయర్​ డకెట్​కు రోహిత్ అని స్ట్రాంగ్​ రిప్లై ఇచ్చాడు. అంటే ఇంగ్లాండ్ బజ్​బాల్ కంటే ముందే పంత్ టెస్టుల్లో వేగంగా ఆడాడు అని రోహిత్ వ్యాఖ్యల అర్థం.

ఇక ఇదే మీట్​లో బజ్​బాల్ గురించి మాట్లాడాడు రోహిత్. 'బజ్​బాల్ అంటే ఏంటి? నిజంగా నాకు దాని గురించి తెలీదు. కానీ, ఇంగ్లాండ్ జట్టు గతంలో కంటే ఇప్పుడు ఆటలో మెరుగైంది. ప్రస్తుత సిరీస్​లో సెంచరీ సాధించిన ఇద్దరు బ్యాటర్లకు ఆ క్రెడిట్ దక్కుతుంది' అని రోహిత్ అన్నాడు. ఇక ఐదు టెస్టుల సిరీస్​ను భారత్ ఒక మ్యాచ్​ మిగిలుండగానే కైవసం చేసుకుంది.

Jaiswal vs England Test: ప్రస్తుత సిరీస్​లో జైశ్వాల్ అదరగొడుతున్నాడు. ఎనిమిది ఇన్నింగ్స్​ల్లో కలిపి 78.63 సగటున 655 పరుగులు నమోదు చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉండడం విశేషం. ఇక ఇప్పటివరకు సిరీస్​లోనే అత్యధికంగా 23 సిక్స్​లు బాదాడు.

5వ టెస్టుకు భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ , కేఎస్ భరత్, దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్.

100వ టెస్ట్ : అతడు ఉంటే కెప్టెన్‌కు భరోసా - ప్రత్యర్థులకు హెచ్చరిక!

కెరీర్​లో బెస్ట్ ప్లేస్​కు యశస్వి- టాప్​ 10లోకి దూసుకుపోయాడుగా

Last Updated : Mar 6, 2024, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.