ETV Bharat / sports

'వాళ్లు రోహిత్ వీక్​నెస్​ తెలుసుకున్నారు!- బోర్డర్ గావస్కర్​లోనూ ఇలా జరిగితే ఇక అంతే!' - ROHIT SHARMA IND VS NZ TEST SERIES

రోహిత్ శర్మ బౌలర్లకు అలాగే దొరుకుతున్నాడు : అనిల్ కుంబ్లే

Rohit Sharma India Vs New Zealand Test Series
Rohit Sharma (Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 2, 2024, 10:19 AM IST

Rohit Sharma IND Vs NZ Test Series : ప్రస్తుతం న్యూజిలాండ్​తో జరుగుతున్న టెస్ట్ సిరీస్​లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పెర్ఫామెన్స్ గురించి మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశారు. పేస్ బౌలర్ల బంతికి రోహిత్​ ఒకే రీతిలో ఔటవుతున్నాడని చెప్పాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే రోహిత్ శర్మను పేసర్లు బాగా ఇబ్బంది పెడుతున్నారని, ఇది ఆందోళన చెందాల్సిన విషయమే అని అన్నారు.

"బంగ్లాదేశ్‌తో ఇటీవలె జరిగిన టెస్ట్ సిరీస్‌లో కూడా రోహిత్ శర్మ ఈ రకంగా ఔటయ్యాడు. టీమ్ సౌథీ ఈ విషయాన్ని పసిగట్టి ఈసారి రోహిత్​ను అదే రీతిలో రోహిత్​ను పెవిలియన్ బాట పట్టించాడు. రీసెంట్​గా మ్యాట్ హెన్రీ కూడా అదే టెక్నిక్​ ఉపయోగించాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్‌లో షార్ట్ పిచ్‌ బాల్ వేసి మరీ రోహిత్​ను బోల్తా కొట్టిస్తున్నారు. ఈ బాల్​ను ఆడే విషయంలో రోహిత్ స్క్వేర్ అప్ అవుతూ ఇబ్బంది పడుతున్నాడు. ఆ బంతి ఏ మాత్రం స్వింగ్ అవ్వట్లేదు. బౌలర్లు డెక్‌తో హిట్ చేసి రోహిత్​ను ట్రాప్ చేస్తున్నారు. బంతి స్వింగ్ అవుతుందేమోనని పొరబడి రోహిత్ ఇలా పెవిలియన్ బాట పడుతున్నాడు. వీలైనంత త్వరగా రోహిత్ ఈ సమస్యను అధిగమించాలి. లేకుంటే బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఆసీస్ బౌలర్లు కూడా ఇదే టెక్నిక్​ను ఉపయోగిస్తారు."అంటూ కుంబ్లే ఆందోళన వ్యక్తం చేశారు.

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లోనూ రోహిత్ శర్మ(18) దారుణంగా విఫలమయ్యాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ ఒక్క హాఫ్ సెంచరీ మినహా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. తాజాగా జరిగిన మ్యాచ్​లోనూ మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో స్లిప్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.

ఇక నిన్న (నవంబర్ 1) జరిగిన మ్యాచ్ విషయానికొస్తే టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్​లో 235 పరుగులకు ఆలౌటైంది. స్పిన్​కు అనుకూలించిన ముంబయి వాంఖడే పిచ్​పై మనోళ్లు చెలరేగిపోయారు. స్టార్ బ్యాటర్ విల్ యంగ్ (71 పరుగులు), డారిల్ మిచెల్ ( 82 పరుగులు) ఇద్దరే హాఫ్ సెంచరీలతో రాణించారు. ఓపెనర్ టామ్ లేథమ్ (28 పరుగులు), డేవన్ కాన్వే (4 పరుగులు), రచిన్ రవీంద్ర (5 పరుగులు), టామ్ బ్లండెల్ (0), గ్లెన్ ఫిలిప్స్ (17 పరుగులు) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. రవీంద్ర జడేజా 5, వాషింగ్టన్ సుందర్ 4, ఆకాశ్ దీప్ 1 వికెట్లు దక్కించుకున్నారు.

0,1తో చెేతులెత్తేసిన రోహిత్, కోహ్లీ - కీలక మ్యాచుల్లో కుర్రాళ్లపై భారం!

భారత్ X న్యూజిలాండ్ : ఈసారి సత్తా చాటాల్సిందే- కళ్లన్నీ రోహిత్, విరాట్​పైనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.