Rohan Bopanna Miami All Time Record : భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నవయసు పెరిగే కొద్దీ అద్భుతాలు చేస్తున్నాడు. విజయాలబాటలో పరుగులు పెడుతున్నాడు. తాజాగా డబుల్స్ విభాగంలో మియామి ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుని ఆల్ టైమ్ రికార్డు సృష్టించాడు. సహచరుడు మ్యాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి మియామి ఓపెన్ ఫైనల్‌లో క్రొయేషియా ప్లేయర్ ఇవాన్ డొడిక్ - అమెరికన్ ప్లేయర్ ఆస్టిన్ క్రాజిసెక్‌పై 6-7, 6-3, 10-6 తేడాతో విజయం సాధించాడు. దీంతో 44 ఏళ్ల వయసులో 1000 టైటిల్ సాధించిన ఆటగాడిగా రోహన్ రికార్డు నమోదు చేశాడు. కొద్ది నెలల క్రితమే మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ మెన్స్ డబుల్స్‌ను టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న ఇప్పుడు ఈ విజయంతో మరోసారి రికార్డులకు ఎక్కాడు. అంతేకాదు లియాండర్ పేస్ తర్వాత తొమ్మిది ఏటీపీ మాస్టర్స్ 1000 ఈవెంట్ల ఫైనల్స్‌కు చేరిన రెండో భారత టెన్నిస్ ఆటగాడినూ రోహన్ నిలిచాడు.
మియామి ఫైనల్‌లో రోహన్ బోపన్న జోడీకి గట్టి పోటీనే ఎదురైంది. డొడిక్-ఆస్టిన్ మొదటి రౌండ్‌ను గెలిచారు. అయినాసరే ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా రెండో రౌండ్‌లో రోహన్ - ఎబ్డెన్ పుంజుకున్నారు. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 6-3 తేడాతో గెలిచారు. దీంతో మూడో రౌండ్ నిర్ణయాత్మకంగా మారింది. విజయం కోసం ఇరు జట్లూ హోరా హోరీ తలపడ్డాయి. రోహన్ - ఎబ్డెన్ దూకుడుగా ఆడి 10-6 తేడాతో మూడో రౌండ్‌లో విజయం సాధించి టైటిల్‌ను పట్టుకున్నారు.
ఈ మధ్యే ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ మెన్స్ డబుల్స్ టైటిల్‌ను భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో ఆస్ట్రేలియన్ ప్లేయర్ ఎబ్డెన్‌తో కలిసి ఆడిన బోపన్న, ఇటలీ జోడి సిమోన్- వావాసోరి జోడీపై జయభేరి మోగించారు. తద్వారా తొలిసారి పురుషుల డబుల్స్ గ్రాండస్లామ్ టైటిల్ నెగ్గిన ఆటగాడిగా భారత వెటరన్ ఆటగాడు రోహన్ బోపన్న నిలిచాడు. అతిపెద్ద వయసులో ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ నెగ్గిన ఆటగాడిగానూ 43 ఏళ్ల రోహన్ బోపన్న రికార్డులు తిరగరాశాడు. 60 ప్రయత్నాలలో విఫలమైన బోపన్న ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ 61వ ప్రయత్నంలో మెన్స్ డబుల్స్ టైటిల్ సాధించాడు. అలాగే అతిపెద్ద వయసులో డబుల్స్‌లో నెంబర్ వన్ ర్యాంక్‌కు చేరుకున్నాడు రోహన్ బోపన్న. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రోహన్ బోపన్నకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
'అందుకే పూరన్‌కు పగ్గాలు'-రాహుల్ కెప్టెన్సీ ఇక అంతేనా! - KL Rahul Lucknow Captaincy