Rishabh Pant IPL 2025 : టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాడు. 2025 ఐపీఎల్ కోసం తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీతో చర్చలు జరిపాడని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే దీన్ని పంత్ ఖండించాడు. అదంతా అవాస్తవం అని, ఇలాంటి ఫేక్ ప్రచారాలను నమ్మవద్దని కోరాడు.
ట్వీట్లో ఏముందంటే?
'రిషభ్ పంత్ తన మేనేజర్ ద్వారా వారం కిందట ఆర్సీబీ మేనేజ్మెంట్తో సంప్రదింపులు జరిపాడు. ఆర్సీబీలో కెప్టెన్సీ స్థానం ఆశించాడు. కానీ, ఆర్సీబీలోకి పంత్ రావడం విరాట్ కోహ్లీకి ఇష్టం లేదని, అందుకే జట్టు మేనేజ్మెంట్ పంత్ రాకను తిరస్కరించింది' అని పోస్ట్‌లో సదరు నెటిజన్ రాసుకొచ్చాడు. దీనికి పంత్ ఘాటుగా స్పందించి రిప్లై ఇచ్చాడు. 'ఇది ఫేక్ న్యూస్. సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ న్యూస్ ఎందుకు ప్రచారం చేస్తారు. తెవిగలవారు ఇలాంటి వార్తలను వ్యాప్తి చేయరు. ఎటువంటి సమాచారం లేకుండా తప్పుడు వార్తలను సృష్టించవద్దు. ఇలాంటి వార్తలను వ్యాప్తి చేయడం ఇదే మొదటిసారి కాదు, ఆఖరిసారి కాదు. అందుకే ఫేక్ వార్తలను ఖండించాల్సి వచ్చింది. దయచేసి మీ సో కాల్డ్ సోర్స్‌లను మరోసారి చెక్ చేసుకోండి. దయచేసి తప్పుడు సమాచారం ప్రచారం చేయవద్దు' అని పంత్ రిప్లై ఇచ్చాడు.
Fake news . Why do you guys spread so much fake news on social media. Be sensible guys so bad . Don’t create untrustworthy environment for no reason. It’s not the first time and won’t be last but I had to put this out .please always re check with your so called sources. Everyday…
— Rishabh Pant (@RishabhPant17) September 26, 2024
కాగా, 2016లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన పంత్ అప్పట్నుంచి దిల్లీ క్యాపిటల్స్ జట్టుకే ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు 111 మ్యాచ్‌ల్లో 3284 పరుగులతో రాణించాడు. అయితే 2022లో రోడ్డు ప్రమాదం కారణంగా 2023 సీజన్లో పంత్ ఐపీఎల్ ఆడలేదు. ఇక మళ్లీ 2024లో ఐపీఎల్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం దిల్లీ కెప్టెన్‌గానూ కొనసాగుతున్నాడు.
టాప్-10లోకి పంత్
రోడ్డు ప్రమాదం జరిగిన రెండేళ్ల తర్వాత రిషభ్ పంత్ ఇటీవలే తొలి టెస్టు ఆడాడు. ఆ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 39 రన్స్, రెండో ఇన్నింగ్స్ లో శతకం బాదాడు. దీంతో ఇటీవలే ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ లో రిషభ్ పంత్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఏకంగా టాప్-10లోకి దూసుకొచ్చాడు. పంత్ ప్రస్తుతం 731 రేటింగ్స్ తో ఆరో స్థానం దక్కించుకున్నాడు.
ఒక్క సెంచరీతో ర్యాంకింగ్స్‌లోకి పంత్ రీ ఎంట్రీ - రోహిత్, విరాట్ బిగ్ డ్రాప్ - ICC Ranking 2024
'ధోనీతో పోల్చవద్దు- నన్ను నాలాగే ఉండనివ్వండి' - Pant Dhoni Comparison