ETV Bharat / sports

విరాట్​ను అధిగమించిన పంత్- టెస్టు ర్యాంకింగ్స్ రిలీజ్

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ రిలీజ్- విరాట్​ను అధిగమించిన పంత్- రోహిత్ స్థానం ఎంతంటే?

ICC Ranking 2024
ICC Ranking 2024 (Source: Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 23, 2024, 3:10 PM IST

ICC Ranking 2024 : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బుధవారం తాజా టెస్టు ర్యాంకింగ్స్​ విడుదల చేసింది. లేటెస్ట్ ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ మూడు స్థానాలు ఎగబాకి విరాట్ కోహ్లీనీ అధిగమించాడు. ప్రస్తుతం పంత్ 745 రేటింగ్స్​తో ఆరో స్థానంలో నిలిచాడు. మరోవైపు విరాట్ (720 రేటింగ్స్) ఒక స్థానం దిగజారి ఎనిమిదో స్థానానికి పడిపోయాడు. యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (780 రేటింగ్స్​)నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (917 రేటింగ్స్​) అగ్రస్థానంలోనే ఉన్నాడు. కాగా, టాప్ 10లో ముగ్గురు భారత బ్యాటర్లు ఉన్నారు.

టాప్ 5 బ్యాటర్లు

  • జో రూట్ (ఇంగ్లాండ్)- 917 రేటింగ్స్
  • కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్)- 821 రేటింగ్స్
  • హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్)- 803 రేటింగ్స్
  • యశస్వీ జైస్వాల్ (భారత్)- 780 రేటింగ్స్
  • స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 757 రేటింగ్స్

ఇక టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండు స్థానాలు కోల్పోయి 15వ ప్లేస్​లో కొనసాగుతున్నాడు. మరోవైపు భారత్​తో తొలి టెస్టులో భారీ శతకంతో అదరగొట్టిన రచిన్ రవీంద్ర తాజా ర్యాకింగ్స్​లో ఏకంగా 36 స్థానాలు ఎగబాకాడు. 681 రేటింగ్స్​తో రచిన్ ప్రస్తుతం 18వ ప్లేస్​లో కొనసాగుతున్నాడు. ఇక పాకిస్థాన్ ప్లేయర్ సలమ్ అఘా ఎనిమిది స్థానాలు మెరుగుర్చపకున్నాడు. సలమ్ అఘా ప్రస్తుతం 684 రేటింగ్స్​తో 14వ స్థానంలో కొనసాగుతున్నాడు.

బాబర్, గిల్ ఇలా
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్, మరో నాలుగు స్థానాలు దిగజారిపోయాడు. ఇక టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గిల్ కూడా నాలుగు స్థానాలు కోల్పోయాడు. ఈ ఇద్దరూ 677 రేటింగ్స్​తో ప్రస్తుతం 19వ స్థానంలో కొనసాగుతున్నారు.

టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్
టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 871 రేటింగ్స్​తో అగ్రస్థానం పదిలంగా ఉంచుకున్నాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (849 రేటింగ్స్​) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక జోష్ హేజిల్​వుడ్ (847 రేటింగ్స్), పాట్ కమిన్స్ (820 రేటింగ్స్), కగిసొ రబాడ (820 రేటింగ్స్) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఐసీసీ ర్యాంకింగ్​లో బుమ్రా టాప్- కోహ్లీ, రోహిత్ ఏ పొజిషన్​లో ఉన్నారంటే? - ICC Test Rankings 2024

టాప్‌ 5లోకి రోహిత్- శ్రీలంక ప్లేయర్ ఏకంగా 42 స్థానాలు జంప్ - ICC Test Ranking 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.