ETV Bharat / sports

రాజస్థాన్ జైత్రయాత్ర- బట్లర్, శాంసన్ మెరుపు ఇన్నింగ్స్- బెంగళూరు హ్యాట్రిక్ ఓటమి - RCB vs RR IPL 2024 - RCB VS RR IPL 2024

RCB vs RR IPL 2024: 2024 ఐపీఎల్​లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. శనివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ నెగ్గింది.

RCB vs RR IPL 2024
RCB vs RR IPL 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 6, 2024, 11:06 PM IST

RCB vs RR IPL 2024: 2024 ఐపీఎల్​లో రాజస్థాన్​ రాయల్స్​ జైత్రయాత్ర కొనసాగుతోంది. రాజస్థాన్​ టోర్నీలో వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. శనివారం జైపుర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 184 పరుగుల టార్గెట్​ను 4 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. జాస్ బట్లర్ (100* పరుగులు), కెప్టెన్ సంజూ శాంసన్ (69 పరుగులు, 42 బంతుల్లో; 8x4, 2x6) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఆర్సీబీ బౌలర్లలో రీస్ టోప్లే 2, మహ్మద్ సిరాజ్​, యశ్ దయాల్ తలో వికెట్ దక్కించుకున్నారు.

భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్​కు రెండో బంతికే ఎదురుదెబ్బ తగిలింది. యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ (0) డకౌట్​ అయ్యాడు. కానీ, అసలు కథ అప్పుడే మొదలైంది. వన్​ డౌన్​లో వచ్చిన శాంసన్​తో బట్లర్ ఆర్సీబీ బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ జట్టును విజయం దిశగా నడిపించాడు. అటు శాంసన్​కూడా ఆర్బీసీ బౌలర్లకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా, మెరుపు ఇన్నింగ్స్​తో అలరించాడు. ఈ క్రమంలో బట్లర్, శాంసన్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అర్ధ శతకాల తర్వాత వీరిద్దరూ దూకుడు పెంచారు. రెండో వికెట్​కు ఏకంగా 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, ఆర్సీబీకి విజయాన్ని దూరం చేశారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టానికి 183 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్​లో చెప్పుకోవాల్సింది విరాట్ బ్యాటింగ్ గురించే. ఈ మ్యాచ్​లో విరాట్ సూపర్ సెంచరీ (113 పరుగులు, 72 బంతుల్లో ; 12x4, 4x6)తో బెంగళూరుకు మంచి స్కోర్ కట్టబెట్టాడు. మరో ఓపెనర్ ఫాఫ్ డూప్లెసిస్ (44 పరుగులు, 33 బంతుల్లో) రాణించాడు. మ్యాక్స్​వెల్ (1) మరోసారి నిరాశపర్చాడు. దీంతో ఆర్సీబీ 200లోపే పరిమితమైంది. కాగా, ఇది బెంగళూరుకు వరుసగా మూడో ఓటమి. ప్రస్తుత సీజన్​లో ఐదు మ్యాచ్​లు ఆడిన ఆర్సీబీ నాలుగు మ్యాచ్​ల్లో ఓడి కేవలం ఒక దాంట్లోనే నెగ్గింది.

ఐపీఎల్​లో 'విరాట్' మరో రికార్డ్- దరిదాపుల్లో కూడా ఎవరూ లేరుగా! - Virat Kohli Ipl Runs

ఆర్సీబీ x రాజస్థాన్- విరాట్​ను ఊరిస్తున్న రికార్డులు - Virat Kohli IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.