ETV Bharat / sports

కీలక పోరు - వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే? - IPL 2024 CSK VS RCB - IPL 2024 CSK VS RCB

RCB vs CSK IPL 2024 : 2024 ఐపీఎల్​లో కీలక పోరుకు ఆర్సీబీ- చెన్నై సిద్ధమవుతున్నాయి. అయితే మ్యాచ్ జరిగే బెంగళూరులో వర్షం పడే సూచనలు ఉన్నాయి. మరి శనివారం ఏ సమయానికి వాతావరణం ఎలా ఉండనుందంటే?

RCB vs CSK IPL 2024
RCB vs CSK IPL 2024 (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 18, 2024, 3:01 PM IST

RCB vs CSK IPL 2024 : 2024 ఐపీఎల్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్​కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. సీజన్ 17లో ప్లేఆఫ్స్ చేరాలంటే ఆర్సీబీకి ఈ మ్యాచ్ అత్యంత కీలకం. దీంతో ఈ మెగాపోరు కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే మ్యాచ్ జరగనున్న చిన్నస్వామి స్టేడియం ప్రాంతంలో శనివారం వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వాతావరణంపై ఆక్యూవెదర్‌ ఓ అంచనా వేసింది. దాని ప్రకారం మ్యాచ్ జరిగే ఛాన్స్​ ఎక్కువగా ఉంది. ఉదయాన్నే బెంగళూరులో పొడి ఎండ ఉందంటూ పలువురు నెటిజన్లు నెట్టింట పోస్ట్​లు పెడుతున్నారు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఎందుకంటే నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే ఆర్సీబీ ఈ మ్యాచ్​లో తప్పక నెగ్గాలి. ఒకవేళ వర్షం కురిసి రద్దైతే చెన్నై ప్లేఆఫ్స్​కు దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం నుంచి అక్కడ వాతావరణం ఎలా ఉండనుందో చూద్దాం.

  • మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. టాస్ 7 గంటలకు వేస్తారు. ఈ లెక్కన దాదాపు గంట ముందు నుంచే వర్షం పడకుండా ఉండాలి.
  • కానీ, ఆక్యూ వెదర్‌ ప్రకారం, సాయంత్రం 6 గంటల వరకు వర్షం కురిసే అవకాశాలు 87% ఉన్నాయి.
  • రాత్రి 7 గంటలకు వాతావరణం సాధారణ స్థితికి వస్తుంది. చినుకులు పడే అవకాశం 34 శాతానికి దిగిపోతుంది. ఇదే పరిస్థితి రాత్రి 10 గంటల దాకా ఉండే ఛాన్స్ ఉంది.
  • అయితే రాత్రి 11 గంటలకు మాత్రం వర్షం పడుతుందని ఆక్యూ వెదర్‌ రిపోర్ట్ చెబుతోంది. ఈ సమయంలో జల్లులు పడే అవకాశం 51 శాతంగా ఉంది.
  • ఈ రిపోర్ట్​ ప్రకారం మ్యాచ్ జరిగే ఛాన్స్​లు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ వర్షం పడి మ్యాచ్‌ ఆగితే, గ్రౌండ్​ను క్లీన్ చేసేందుకు 'సబ్‌ఎయిర్‌' సిస్టమ్‌తో అక్కడి సిబ్బంది రెడీగా ఉంటారు.
  • ఒకవేళ సాయంత్ర నుంచి భారీ వర్షం పడినా, 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. అయితే అలా జరగాలంటే 10.30 గంటలకల్లా గ్రౌండ్​ సిద్ధంగా ఉండాలి.
  • ఇక చెన్నై (14 పాయింట్లు), ఆర్సీబీ (12 పాయింట్లు)తో ఉన్నాయి. ఒకవేళ మ్యాచ్ రద్దైతే చెన్నై ప్లేఆఫ్స్​కు, ఆర్సీబీ ఇంటికి వెళ్తాయి.

వర్షం ముప్పు - ఆర్సీబీని సబ్‌ ఎయిర్‌ సిస్టమ్‌ కాపాడుతుందా? - IPL 2024 CSK VS RCB

'రెండుసార్లు నా హార్ట్ బ్రేక్ అయ్యింది- కోలుకోడానికి కొన్ని రోజులు పట్టింది' - IPL 2024

ముంబయికి రోహిత్ బైబై!- ఆఖరి మ్యాచ్ ఆడేశాడా?- కోచ్ రెస్పాన్స్​ ఇదే - IPL 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.