Pullela Gopichand Love Story : భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపిచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అద్వితీయ ఆటతో ఈ తరం ఆటగాళ్లకు స్పూర్తిదాయకంగా నిలిచారు. ప్రస్తుతం జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవలే ఆయన ఓ ఇంటర్వ్యూకు మాజీ క్రికెటర్ చాముండేశ్వరనాథ్‌తో హాజరయ్యారు. ఈ ఇద్దరూ తమ జీవితంలోని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగా తమ లవ్ స్టోరీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలిపారు.
'ఆ అమ్మాయి ప్రపోజల్ - మా అమ్మకు చెప్పాను'
పుల్లెల గోపిచందకు రాజమండ్రికి చెందిన ఓ అమ్మాయి ప్రపోజ్ చేసిందట. ఆ అమ్మాయి అంటే తనకు కూడా ఇష్టమే అని చెప్పారట. కానీ తనకు ఎప్పుడూ ఆట మీదే శ్రద్ధ ఉండేదని, దాని వల్ల ఆమెతో ఎక్కువగా ఫోన్లు మాట్లాడటం కుదిరేది కాదంటూ తెలిపాడు. ఈ క్రమంలో 2001లో ఆ అమ్మాయిని వాళ్ల అమ్మకు చూపించారట. ఇక ఆ అమ్మాయిని చూసిన వెంటనే వాళ్ల అమ్మ ఓకే చెప్పడంతో వాళ్ల పెళ్లి జరిగిందంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.
'బ్యాంక్ ఉద్యోగం - ఆమెకు అలా ప్రేమ లేఖ ఇచ్చాను'
ఇక ఇదే వేదికగా మాజీ క్రికెటర్ చాముండేశ్వర నాథ్ కూడా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. తనకు 1970లో బ్యాంక్ జాబ్ రావడం చాలా గొప్పగా భావించానంటూ తెలిపారు. నాకు ఆ ఉద్యోగం వచ్చిందని చెబితే మా నాన్న నమ్మలేదని, ఐదు రోజుల తర్వాత ఇంటికి కాల్ లెటర్ వస్తే అది చూపిస్తే వాళ్ల నాన్న నమ్మినట్లు చెప్పారు. అయితే అప్పట్లో పైసలకు, రూపాయలకు తేడా తెలియకుండా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చారు. బ్యాంకులో లెక్క రాస్తూ పైసలన్నింటినీ రూపాయాల్లో రాసేసినట్లు దాని వల్ల కోట్ల రూపాయలు తేడావచ్చిందని చెప్పారు.
దీంతో అదే రోజు బ్యాంకులో ఆయన్ను బయటకు పంపించేసిన విషయాన్ని గుర్తు చేససుకున్నారు. అయితే తాను ప్రేమించిన అమ్మాయి కూడా అదే ఆఫీస్‌లో పని చేసేవారని, ఆమెపై తన ప్రేమను వ్యక్త పరిచేందుకు 'ఐలవ్ యూ' అని రాసిన ఓ పేపర్‌ను ఫైల్లో పెట్టి ఇచ్చినట్లు తెలిపారు. అలా తమ జీవితంలో జరిగిన సంఘటనల గురించి ఈ ఇద్దరు లెజెండ్ క్రీడాకారులు ముచ్చటించారు.