ETV Bharat / sports

రంజీ ట్రోఫీ నుంచి పృథ్వీ షా ఔట్- ఆ రెండు విషయాలే కారణమా? - PRITHVI SHAW RANJI TROPHY

పృథ్వీ షాకు షాక్‌- రంజీలో నో ప్లేస్- అదే కారణమా?

Prithvi Shaw Ranji Trophy
Prithvi Shaw (IANS)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 22, 2024, 11:56 AM IST

Prithvi Shaw Ranji Trophy : టీమ్​ఇండియా యంగ్ క్రికెటర్‌ పృథ్వీ షాకు మంచి టాలెంట్ ఉందని అందరికీ తెలిసిందే. అయితే చేజేతులా పృథ్వీ షా తన కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నాడని విశ్లేషకులు అంటున్నారు. తనతో కలిసి ఆడిన క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతుంటే 24 ఏళ్ల పృథ్వీ షా మాత్రం ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నాడు. సరిగ్గా ఆటపై ఫోకస్ చేయలేకపోతున్నాడు. ఇప్పటికే భారత జట్టుకు దూరమైన అతడు తాజాగా రంజీ ట్రోఫీ జట్టులోనూ స్థానం కోల్పోయాడు. ముంబయి రంజీ టీమ్‌ లోకి పృథ్వీ షాను ఎంపిక చేయలేదు.

అవే కారణాలా?
పృథ్వీ షాను పక్కనపెట్టడానికి ముంబయి క్రికెట్ అసోసియేషన్ స్పష్టమైన కారణం చెప్పలేదు. అయితే ఫిట్​నెస్‌, క్రమశిక్షణారాహిత్యం వల్లే షాపై వేటు వేసినట్లు సమాచారం. నెట్‌ సెషన్స్‌ కు కూడా పృథ్వీ షా ఆలస్యంగా వస్తున్నాడని తెలుస్తోంది. అలాగే కొన్నిసార్లు నెట్ సెషన్స్ డుమ్మా కొడుతున్నాడట. ఒక వేళ పాల్గొన్నా వాటిని సీరియస్​గా తీసుకోవట్లేదని సమాచారం.

అంతంతమాత్రంగానే ఫిట్​నెస్
మరోవైపు పృథ్వీ షా ఫిట్​నెస్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. అధిక బరువుతో అతడు ఇబ్బంది పడుతున్నాడని తెలుస్తోంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ముంబయి క్రికెట్ అసోసియేషన్ సెలక్టర్లు అతడిపై క్రమశిక్షణాచర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. పృథ్వీని జట్టు నుంచి తప్పించాలనే నిర్ణయం కేవలం మేనేజ్‌మెంట్, సెలక్టర్లు తీసుకున్నది కాదట. కెప్టెన్, కోచ్‌ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించినట్లు తెలుస్తోంది.

పేలవమైన ఫామ్
కాగా, ప్రస్తుతం రంజీ సీజన్​లో పృథ్వీ షా ముంబయికి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్లు మొత్తం కలిపి 59 పరుగులే చేసి విఫలమయ్యాడు. అంతేకాకుండా ఫిట్ నెస్ విషయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో అతడిపై వేటు పడినట్లు తెలుస్తోంది.

అరంగేట్ర మ్యాచ్​లోనే సెంచరీ
కేవలం 18 ఏళ్ల వయసులోనే భారత జట్టు తరఫున టెస్టు కెరీర్‌ ఆరంభించిన పృథ్వీ షా తొలి మ్యాచ్​లోనే శతకం బాదాడు. అంత గొప్పగా కెరీర్‌ ను ప్రారంభించిన యంగ్ ప్లేయర్, ఇప్పుడు టీమ్‌ ఇండియా ఛాయల్లోనే లేడు. ప్రతిభకు లోటు లేని ఇతడిలో క్రమశిక్షణ కొరవడి, ఫిట్‌నెస్‌ లేక చేజేతులా కెరీర్‌ను దెబ్బ తీసుకుంటున్నాడు. టీమ్‌ఇండియా తరఫున అతడు చివరగా 2021 జులైలో శ్రీలంకతో టీ20 మ్యాచ్‌ ఆడాడు. ఆ తర్వాత జట్టులోకి మళ్లీ తిరిగిరాలేదు.

పృథ్వీ షా గ్రాండ్ రీ ఎంట్రీ - సెంచరీతో అదుర్స్

వర్షంలోనే పృథ్వీ షా బ్యాటింగ్ ప్రాక్టీస్.. టార్గెట్ వాళ్లేనా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.