PM Meets Olympics Medallists : భారత ఒలింపిక్ క్రీడాబృందంతో తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. 78వ స్వాత్రంత్య్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా జరిగిన ఈ సమావేశంలో ఆయన క్రీడాకారుల మధ్య కలియదిరుగుతూ వారి అనుభవాలను తెలుసుకున్నారు. అంతేకాకుండా పారిస్ ఒలింపిక్స్‌లో క్రీడాకారుల పెర్ఫార్మెన్స్ను అభినందించారు. ఆ తర్వాత ప్లేయర్లతో కలిసి ఫొటోలు దిగారు. ఇదిలా ఉండగా, షూటర్ మను బాకర్ ఈ ఈవెంట్లో ప్రధానితో ప్రత్యేకంగా ముచ్చటించింది. తాను ఒలింపిక్స్‌లో వాడిన పిస్టోల్‌ను చూపించి మురిసిపోయింది.
మరోవైపు హాకీ పురుషుల జట్టు ప్రధానికి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. ప్లేయర్లంతా సంతకం చేసిన ఓ జెర్సీ, అలాగే హాకీ స్టిక్‌ను మోదీకి బహుమతిగా అందించారు. ఇక యంగ్ రెజ్లర్ అమన్ సెహ్రావత్ కూడా భారత జెర్సీని ప్రధానికి గిప్ట్ చేశారు.
#WATCH | PM Narendra Modi meets the Indian contingent that participated in #ParisOlympics2024, at his residence. pic.twitter.com/XEIs5tHrrI
— ANI (@ANI) August 15, 2024
అంతకుముందు ఆయన ఇచ్చిన స్పెషల్ స్పీచ్‌లో మోదీ ఒలింపిక్స్ గురించి ప్రస్తావించారు. ఒలింపిక్స్ నిర్వహణపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా క్రీడా సంబరానికి ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ఇక ఈ విశ్వక్రీడల్లో పోటీ పడిన అథ్లెట్లకు ధైర్యం చెబుతూనే, పారాఒలింపిక్స్‌కు వెళ్లే అథ్లెట్లకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
"ఒలింపిక్స్‌లో భారత పతాకాన్ని రెపరెపలాడించిన యువ క్రీడాకారులు మనతోనే ఉన్నారు. 140 కోట్ల మంది తరఫున, నేను వాళ్లందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. మరికొన్ని రోజుల్లో పారా ఒలింపిక్స్ జరగనున్నాయి. అందులో పోటీ పడేందుకు మన అథ్లెట్లు వెళ్లనున్నారు. వారికి ఆల్ ది బెస్ట్. మనం గతంలో G20 సమ్మిట్‌ను దిగ్విజయంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అటువంటి భారీ ఈవెంట్లను ఎలాంటి ఇబ్బందిలేకుండా నిర్వహించగలమని అందరికీ నిరూపించాం. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వడమనేది భారత్ కల. 2036లో ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం" అంటూ నరేంద్ర మోదీ తెలిపారు.
President Murmu Meets Olympics Players : భారత ఒలింపిక్ క్రీడాబృందంతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తాజాగా భేటీ అయ్యారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో మన అథ్లెట్లతో ఆమె ముచ్చటించారు. ముఖ్యంగా పతక విజేతలు పీఆర్ శ్రీజేశ్, మను భాకర్‌లతో రాష్ట్రపతి ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ ఇద్దరూ పారిస్ ఒలింపిక్స్‌లో తమ జర్నీ గురించి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ ప్రత్యేక ఆహ్వానాన్ని ఇచ్చినందుకు రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు.
'దేశం మొత్తం గర్విస్తోంది' - బల్లెం వీరుడికి ప్రధాని మోదీ అభినందనలు - Neeraj Chopra Modi
కాంస్య పతకంతో భారత హాకీ జట్టు గెలుపు సంబరాలు - మోదీ, ముర్ము అభినందనలు - Paris Olympics 2024