Pat Cummins IPL 2024: 2024 ఐపీఎల్‌కు సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. టోర్నీ ఛాంపియన్‌గా నిలిచేందుకు ఎస్ఆర్హెచ్ కొత్త ప్రణాళికలతో బరిలోకి దిగనుంది. ఇక కొత్త కెప్టెన్ స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ జట్టు ఈసారి బలంగా కనిపిస్తోంది. ఇక మార్చి 23న సన్‌రైజర్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ కనిన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌తో హైదరాబాద్ ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపాడు.
2024 సీజన్‌ను దూకుడుగా ప్రారంభించాలనుకుంటున్నట్లు కెప్టెన్ కమిన్స్ తెలిపాడు. 'ప్లాన్ చేసుకుని జట్టుకు మంచి ఆరంభం ఇవ్వాలనుకుంటున్నాము. టీ20లు ఆడటం కాస్త కష్టమే. కోల్‌కతా కూడా మంచి జట్టు. కానీ నేను ఈ సీజన్‌ను మంచి ఆటతీరుతో ఆరంభించాలని చూస్తున్నా. నా ఉద్దేశం, ప్రణాళికల గురించి మీకు తెలుసా? నాకు పరిచయం లేని ఆటగాళ్లతో కూడా నేను చాలా సన్నిహితంగా ఉంటాను. నా నుంచి వారు ఏం ఆశిస్తున్నారో తెలుసుకుంటాను. భువనేశ్వర్ కుమార్ వంటి అనుభవజ్ఞులు మాకు ఉన్నారు. ఎయిడెన్ మార్‌క్రమ్ గతేడాది కెప్టెన్‌గా ఉన్నాడు. మా జట్టులో ప్రతిభవంతులైన యువకులు ఉన్నారు. అభిషేక్ (శర్మ), ఉమ్రాన్ మాలిక్ లాంటి వాళ్లను చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. వీరిలో చాలా ఉత్సాహం కనిపిస్తోంది. రాబోయే సీజన్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ తరపున మంచి ఆటను కనబర్చుతామని నేను భావిస్తున్నా' అని కమిన్స్ అన్నాడు.
ఇక గత సీజన్లో సన్‌రైజర్స్ దారుణంగా ఆడి పాయింట్ల పట్టికలో అట్టగున నిలిచింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు నమోదు చేసి ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశ పర్చింది. ఇక వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ కమిన్స్ రాకతో సన్‌రైజర్స్ బలం పెరిగినట్లైంది. కమిన్స్‌తో పాటు ట్రావిస్ హెడ్, గ్లెన్ ఫిలిప్స్, వానిందు హసరంగ, హెన్రిచ్ క్లాసెన్ లాంటి నాణ్యమైన విదేశీ ప్లేయర్లతో జట్టు దృఢంగా ఉంది. బౌలింగ్‌లో స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మలిక్, జయదేవ్ ఉనాద్కత్, మార్కో జాన్సన్‌తో పటిష్ఠంగా ఉంది. దీంతో ఈసారి హైదరాబాద్ ఛాంపియన్‌గా నిలవడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు.
సన్‌రైజర్స్ కొత్త సారథి ఫిక్స్ - కమిన్స్ ఇన్ - మార్‌క్రమ్ ఔట్
'ఆ ఫార్ములాతో మూడోసారి విజేతగా SRH!' ఎంఎస్కే ప్రసాద్‌తో ఈటీవీ భారత్ ఎక్స్‌క్లూజివ్