ETV Bharat / sports

పారాలింపిక్స్​లో భారత్ జోరు- ఒక్కరోజే గోల్డ్ సహా 7 పతకాలు- మొత్తం ఎన్నంటే? - Paris Paralympics India 2024

Paris Paralympics India 2024: పారిస్ పారాలింపిక్స్​లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. సోమవారం ఒక్క రోజే భారత్ ఖాతాలో 7 పతకాలు చేరాయి. దీంతో ప్రస్తుత పారాలింపిక్స్​లో భారత్ పతకాల సంఖ్య 14కు చేరింది.

Paris Paralympics India
Paris Paralympics India (Source: Associated Press (Left), Getty Images (Right))
author img

By ETV Bharat Sports Team

Published : Sep 2, 2024, 11:00 PM IST

Paris Paralympics India 2024: పారిస్ పారాలింపిక్స్​లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్​​లో సుహాస్ యతిరాజ్ రజతం దక్కించుకున్నాడు. సోమవారం జరిగిన ఫైనల్​లో లుకస్ మజుర్ (ఫ్రాన్స్​) చేతిలో 9-21 13-21 తేడాతో ఓడి సిల్వర్​తో సరిపెట్టుకున్నాడు. ఇక టోక్యోలో కూడా సిల్వర్ సాధించిన యతిరాజ్, తాజాగా పారిస్​లోనూ రజతంతో మెరిశాడు. దీంతో బ్యాడ్మింటన్​లో రెండు పతకాలు సాధించిన తొలి పారా అథ్లెట్​గా రికార్డు సృష్టించాడు. ఈ పతకాలతో ప్రస్తుత పారాలింపిక్స్​లో భారత్ మెడల్స్​ సంఖ్య 14కు చేరింది.

కాగా, సోమవారం భారత పారా అథ్లెట్లు అదరగొట్టారు. ఈ ఒక్క రోజే ఆయా క్రీడాంశాల్లో భారత్​కు స్వర్ణం సహా 7 పతకాలు దక్కాయి. అందులో 2 పసిడి, 3 రజతం, 2 కాంస్య పతకాలు ఉన్నాయి. మరి ఎవరెవరు ఏయే విభాగాల్లో పతకాలు సాధించారంటే?

సోమవారం భారత్ పతకాలు

  • గోల్డ్: పారా అథ్లెట్ నితేశ్ కుమార్ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్​లో SL3లో గోల్డ్ మెడల్​ దక్కించుకున్నాడు. బ్రిటన్ అథ్లెట్​తో సోమవారం జరిగిన ఫైనల్​ మ్యాచ్​లో నితేశ్ 21-14, 18- 21, 23-21 తేడాతో నెగ్గాడు. అతడితో పాటు మెన్స్ జావెలిన్ త్రో F64లో సుమిత్ అంతిల్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. దీంతో​ ప్రస్తుత పారాలింపిక్స్​లో భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు చేరాయి.
  • సిల్వర్: యోగేశ్ కుతునియా డిస్కస్ త్రోవర్ విభాగంలో రజతం ముద్దాడాడు. డిస్కస్ త్రోవర్ F56 విభాగంలో పోటీ పడ్డ యోగేశ్ 42.22 మీటర్ల ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్​లో యోగేశ్​కు ఇదే అత్యత్తమ ప్రదర్శన. కాగా, పారాలింపిక్స్​లో సిల్వర్ దక్కించుకోవడం ఇది వరుసగా రెండోసారి. 2020 టోక్యోలోనూ అతడు రజతం ముద్దాడాడు.
  • తులసీమతి మురుగేశన్ మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ (SU5) ఈవెంట్​లో రజతంతో సత్తా చాటింది. గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో తులసిమతి 17-21, 10-21తో యాంగ్ క్విక్సియా (చైనా) చేతిలో ఓడి సిల్వర్​తో సరిపెట్టుకుంది. కాగా, మురుగేశన్​కు ఇదే తొలి పారాలింపిక్స్​ పతకం కావడం విశేషం.
  • కాంస్యం: మరోవైపు ఇదే ఈవెంట్​ ఫైనల్​ కంటే కాస్త ముందు మనీశా రామ్​దాస్ కాంస్యం ముద్దాడింది. కాంస్య పోరులో మనీశా 21-12, 21-8 వరుస సెట్​లలో ఆధిక్యం ప్రదర్శించి పతకం దక్కించుకుంది. ఈ క్రమంలో పారాలింపిక్స్​లో బ్యాడ్మింటన్ విభాగంలో పతకం సాధించిన తొలి మహిళా పారా అథ్లెట్​గా మనీషా రికార్డు సృష్టించింది. ఇక ఆర్చరీ మిక్స్​డ్ టీమ్​ కాంపౌండ్ ఓపెన్​లో పారా ఆర్చర్ జోడీ శీతల్​ దేవీ, రాకేశ్ కూమార్ కాంస్య పతకాన్ని సాధించారు.

పారిస్ పారాలింపిక్స్​లో భారత్ పతకాలు

స్వర్ణంరజతంకాంస్యంమొత్తం
35614

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.