Paris Paralympics 2024 Indian Athlets : టోక్యో ఒలింపిక్స్ కన్నా మెరుగైన ప్రదర్శన చేసి పతక పంట పండిస్తారనుకున్న భారత అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్‌లో నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. ఒక్క స్వర్ణం కూడా రాలేదు. ఇప్పుడా లోటును తీర్చేందుకు పారిస్ పారాలింపిక్స్ కోసం సిద్ధమవుతున్నారు పారా వీరులు. కచ్చితంగా వీరు పిసిడిని ముద్దాడతారన్న అంచనాలు గట్టిగానే ఉన్నాయి. వారెవరో తెలుసుకుందాం.
బ్యాడ్మింటన్‌లో - టోక్యో పారాలింపిక్స్ మెన్స్ బ్యాడ్మింటన్ విభాగంలో ప్రమోద్ భగత్, కృష్ణ నగార్ గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. కానీ ఈ సారి డోపింగ్ నిబంధనల ఉల్లంఘన కారణంగా ప్రమోద్ దూరమయ్యాడు. దీంతో మెన్స్ బ్యాడ్మింటన్ విభాగంలో రాజస్థాన్ షట్లర్ కృష్ణ నగార్ మాత్రమే పోటీపడుతున్నాడు. అతడిపైనే పసిడి ఆశలు ఉన్నాయి. సింగిల్స్ ఎస్‌హెచ్6 విభాగంలో పోటీపడనున్నాడతడు. అతడు ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది ప్రపంచ ఛాంపియన్‌గానూ నిలిచాడు.
గత పారాలింపిక్స్‌లో ఐఏఎస్ అధికారి సుహాస్ యతిరాజ్ సిల్వర్ గెలిచారు. ఈ సారి పతకం రంగు మార్చాలనే లక్ష్యంతో ఉన్నారు. సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా కొనసాగుతున్న ఆయన - ఎస్‌ఎల్4 సింగిల్స్‌తో పాటు మిక్స్‌డ్ డబుల్స్ (ఎస్‌ఎల్3-ఎస్‌యూ5)లో పోటీ పడుతున్నారు.
పారాలింపిక్స్‌లో తొలిసారి పోటీ పడనున్నారు మహిళా షట్లర్లు మానసి జోషి, తులసిమతి. వీరు కూడా అద్భుత ప్రదర్శన చేస్తారన్న అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీలో సాధన కొనసాగించింది మానసి. ఇప్పటివరకు ఆమె ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో ఓ గోల్డ్ మెడల్ (2019), రెండు సిల్వర్ మెడల్స్, నాలుగు బ్రాండ్ మెడల్స్ సాధించింది. ఇక ఆసియా పారా క్రీడల్లో ఓ గోల్డ్ మెడల్, సిల్వర్, బ్రాంజ్ అందుకుంది తులసిమతి.
The much awaited moment 🇮🇳 🏅 pic.twitter.com/OSYgMXtRb3
— Krishna Nagar (@Krishnanagar99) September 5, 2021
జావెలిన్ - పారా జావెలిన్ త్రోయర్, హరియాణా అథ్లెట్ సుమిత్ అంటిల్ ఈ సారి గోల్డ్ మెడల్ సాధించడంతో పాటు తన పేరిట ఉన్న వరల్డ్ రికార్డును తానే బ్రేక్ చేయాలనే లక్ష్యంతో ఉన్నాడు. టోక్యో పారాలింపిక్స్ మెన్స్ ఎఫ్64 విభాగంలో అతడు వరల్డ్ రికార్డు 68.55మీతో ఛాంపియన్‌గా ఉన్నాడు. ఇప్పటికే ఐదు సార్లు ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు. పోటీలో దిగిన ప్రతీసారి గోల్డ్ లేదా ఇతర పతకం సాధిస్తూనే ఉంటాడు.
ఇతడు గత ఏడాది ఆసియా పారా క్రీడల్లో 73.29మీ బల్లెం విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆ మధ్య ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లోనూ వరుసగా రెండో సారి గోల్డ్ మెడల్ సాధించాడు.
ఇక 2016లో గోల్డ్ మెడల్, 2020లో సిల్వర్ గెలిచిన పారా హైజంప్ అథ్లెట్ మరియప్పన్ తంగవేలు, టోక్యోలో డిస్కస్‌త్రో (ఎఫ్56)లో సిల్వర్ మెడల్ సాధించిన యోగేశ్ కథునియా కూడా ఈ సారి పసిడిని అందుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.
The clock is ticking!
— Paralympic India 🇮🇳 (@ParalympicIndia) October 7, 2023
It’s just 15 more nights to go until the opening ceremony of #Hangzhou2022 Asian Para Games. 🇨🇳🎊#AsianParaGames #Hangzhou #Hangzhou2022 #countdown @19thAGofficial l @IndianOilcl l @SBI_FOUNDATION l @centralbank_in l @IndiaSports l @Media_SAI l @ICRC pic.twitter.com/b5dWqd46b6
ఆర్చరీలో - పారాలింపిక్స్‌లో ఆర్చరీ విభాగంలో ఇప్పటివరకు భారత్‌కు ఒక్క గోల్డ్ కూడా రాలేదు. కానీ ఈ సారి 17 ఏళ్ల పారా ఆర్చరీ శీతల్ దేవి తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. ఈ కశ్మీర్ అమ్మాయికి రెండు చేతులు లేకపోయినా కాలితో విల్లును పట్టి, భుజంతో నారిని లాగి బాణాలు సంధిస్తుంది.
ఈమె ఆసియా పారా క్రీడల్లో రెండు గోల్డ్ మెడల్స్, ఓ సిల్వర్ మెడల్ సాధించింది. కాంపౌండ్ విభాగంలో వ్యక్తిగత ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు మహిళల వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో పోటీపడనుంది.
ఇక టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించి పారాలింపిక్స్‌లో భారత్‌కు మెడల్ అందించిన మొదటి పారా ఆర్చర్‌గా నిలిచాడు హర్విందర్ సింగ్. అతడు ఈ సారి పతక రంగు మార్చాలనే పట్టుదలతో ఉన్నాడు.
మరోవైపు టోక్యోలో కాంస్యంతో పారాలింపిక్స్‌లో దేశానికి పతకం అందించిన మొదటి పారా ఆర్చర్‌గా నిలిచిన హర్విందర్ సింగ్ ఈ సారి పతకం రంగు మార్చాలనే లక్ష్యంతో ఉన్నాడు.
ఇంకా టోక్యో ఒలింపిక్స్‌లో పారా టేబుల్ టెన్నిస్ క్లాస్ 4లో సిల్వర్ మెడల్ సాధించిన భవీనా బెన్ కూడా ఈ సారి పసిడిని ముద్దాడలనే లక్ష్యంతో ఉంది.
A couple of years ago, I was shattered when things didn't go as planned. But then God had a better plan for me ❤️🏹🇮🇳
— Sheetal Devi Archery (@Sheetal_archery) August 25, 2024
Now I know that when life doesn't go our way, God has something even better in store. So, keep believing,work hard, and wait. ❤️🙏 pic.twitter.com/zG70U8Ucui
షూటింగ్ - టోక్యో పారాలింపిక్స్‌కు ముందు ఈ పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన భారత మహిళా అథ్లెట్లు లేరు. కానీ ఆ స్వర్ణాన్ని సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది అవని లేఖరా. టోక్యో పారాలింపిక్స్‌లో ఏకంగా రెండు పతకాలు సాధించిన ఈ రాజస్థాన్ అమ్మాయి - 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్‌లో పసిడి, 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో బ్రాంజ్ మెడల్ దక్కించుకుంది. ఒకే పారాలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన మొదటి భారత మహిళా అథ్లెట్‌గానూ నిలిచింది. ఇప్పుడు మహిళల 50మీ.రైఫిల్ 3 పొజిషన్స్ ఎస్‌హెచ్1, 10మీ.ఎయిర్ రైఫిల్ ఎస్‌టీడీ ఎస్‌హెచ్1, మిక్స్‌డ్ 10మీ. ఎయిర్ రైఫిల్ పీఆర్‌ఎన్ ఎస్‌హెచ్1 విభాగాల్లో పోటీ పడనుంది. ఇటీవల ఆమె పారా షూటింగ్ వరల్డ్ కప్‌లో రెండు బ్రాంజ్ మెడల్స్ సాధించింది.
ఇక టోక్యో ఒలింపిక్స్‌లో పీ4 మిక్స్‌డ్ 50మీ.పిస్టల్ ఎస్‌హెచ్1లో ఛాంపియన్‌గా నిలిచిన పిస్టల్ షూటర్ మనీశ్ నర్వాల్‌పైనా కూడా అంచనాలు ఉన్నాయి.
Wishing everyone a very happy new year! I wouldn't say that 2023 was my best year, but it was a year where I made significant progress in areas where 2022 had caused me anxiety. Given that it's a new year, many people may attempt to make changes to their lifestyles, some of which pic.twitter.com/fGj8k0ZM2c
— Avani Lekhara अवनी लेखरा PLY (@AvaniLekhara) January 1, 2024
పెళ్లి గురించి ప్రశ్న - సిగ్గుపడుతూ మను బాకర్ ఏం చెప్పిందంటే? - Manu Bhaker Marriage
'రోహిత్ శర్మ చాలా కాస్ట్లీ - అతడిని కొనడం కష్టమే!' - IPL 2025 Rohit Sharma