ETV Bharat / sports

రిటైర్మెంట్‌పై వినేశ్‌ ఫొగాట్​ వెనక్కి? - Vinesh Phogat Retirement Uturn - VINESH PHOGAT RETIREMENT UTURN

Vinesh Phogat Retirement : ఇటీవల జరిగిన పారిస్‌ ఒలింపిక్స్​లో ఫైనల్‌ చేరి అనూహ్య రీతిలో అనర్హత వేటు ఎదుర్కొన్న వినేశ్‌ ఫొగాట్‌ తాజాగా మరోసారి సామాజిక మాధ్యమాల వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పోస్ట్ చూస్తుంటే ఆమె తన రిటైర్మెంట్​ను వెనక్కి తీసుకునేలా కనిపిస్తోంది. పూర్తి వివరాలు స్టోరీలో

source ETV Bharat
Paris Olympics Vinesh Phogat (source ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 17, 2024, 6:34 AM IST

Vinesh Phogat Retirement : పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో అనర్హత వేటు వల్ల పతకాన్ని చేజార్చుకున్న స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ ఆ తర్వాత ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె తన రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె ఎక్స్​లో ఓ సుదీర్ఘ ఎమోషనల్​ పోస్ట్​ ద్వారా ఈ విషయాన్ని అన్యాపదేశంగా వెల్లడించింది. అలాగే తన వెన్నంటే ఉండి మద్దతు ఇచ్చిన దేశప్రజలకు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. చివరి వరకు సాయశక్తులా కృషి చేశానని, ప్రత్యర్థులకు లొంగిపోలేదని పేర్కొంది.

"మీ అందరికి ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నా పోరాటాన్ని ఇక్కడితో ఆపను. అనుకున్నది సాధించేందుకు సాయశక్తులా కష్టపడ్డాను. ప్రత్యర్థులకు లొంగిపోలేదు. కానీ ప్రస్తుతం కాలం కలిసి రాలేదు. విధి వక్రించింది. అందుకే నేను వెనుదిరిగాల్సి వచ్చింది. నా భవిష్యత్ ఏంటో ఇంకా నాకు పూర్తిగా తెలీదు. వాస్తవానికి 2032 వరకు నేను కుస్తీ ఆడగలనని భావించాను. కానీ నేను నమ్ముకున్న దాని గురించి, నిరంతరం పోరాడుతూనే ఉంటాను." అని రాసుకొచ్చింది.

అలానే కోచ్‌ వోలర్, తమ జట్టు వైద్యుడు దిన్షా పర్థీవాలాపై ప్రశంసలు కురిపించిన వినేశ్​, వారి పట్టుదల వల్లే తాను ఒలింపిక్స్‌కు వెళ్లగలిగానని చెప్పింది. వారికి కృతజ్ఞతలు తెలిపింది.

డాక్టర్‌ దిన్‌షా పార్దివాలా ఒక దేవదూత అని కొనియాడింది వినేశ్​. "పార్దివాలా కేవలం డాక్టర్‌ మాత్రమే కాదు. ఆయన దేవుడు పంపించిన వ్యక్తి. నా శిక్షణ సమయంలో గాయాలై నా మీద నేను నమ్మకం కోల్పోయినప్పుడు నాలో ఎంతో ధైర్యాన్ని అందించి ప్రోత్సహించారు." అని పేర్కొంది.

తన బెల్జియన్‌ కోచ్‌ వోలర్‌ అకోస్‌ గురించి మాట్లాడుతూ - "ప్రపంచ మహిళల రెజ్లింగ్‌లో నాకు దొరికిన బెస్ట్​ కోచ్​ వోలర్. గొప్ప మెంటార్. మంచి మనిషి. తన సహనం, నమ్మకంతో రింగులో కానీ, బయట కానీ ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ఎదుర్కొంటారు. నా ధ్యాస మళ్లినప్పుడు కూడా మళ్లీ ఆటలోకి ఎలా తీసుకెళ్లాలో ఆయనకు బాగా తెలుసు" అని వినేశ్‌ తెలిపింది. కాగా, అకోస్‌ ఆధ్వర్యంలోనే ఫొగాట్‌ రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ మెడల్స్‌ను సాధించిన సంగతి తెలిసిందే.

'ఆ రోజు వినేశ్ ఫొగాట్​ చనిపోతుందని అనుకున్నా!'- కోచ్ సంచలన వ్యాఖ్యలు - Vinesh Phogat Olympics

'కుస్తీ గెలిచింది, నేను ఓడాను' - రిటైర్మెంట్ ప్రకటించిన వినేశ్​ - Vinesh Phogat Retirement

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.