Paris Olympics 2024 Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్ 2024లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్‌కు దూసుకెళ్లిన వినేశ్ ఫొగాట్ ఆ తర్వాత అనర్హత వేటుకు గురైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా స్వదేశానికి చేరుకున్న వినేశ్ ఫొగాట్ అస్వస్థతకు గురైంది! పారిస్ నుంచి దిల్లీకి వచ్చిన ఆమెకు ఇక్కడ ఘన స్వాగతం దక్కింది. అయితే ఆమె దిల్లీ నుంచి స్వగ్రామం హరియాణాలోని బలాలికి పది గంటల పాటు ప్రయాణించి చేరుకుంది. స్వగ్రామంలో స్థానికులు ఆమెకు భారీగా లడ్డూలను బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆత్మీయ సమావేశం కూడా నిర్వహించారు.
అయితే, సుదీర్ఘమైన ప్రయాణం చేసిన వినేశ్ తీవ్రంగా అలసిపోయింది. దీంతో సమావేశం జరుగుతుండగానే అస్వస్థతకు గురైంది. కాసేపు కుర్చీలోనే అలా ఉండిపోయింది. దీంతో అందరూ కాస్త కంగారుపడ్డారు. ఇప్పుడా వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
PARIS TO BALALI
— nnis Sports (@nnis_sports) August 17, 2024
It's a hectic day for Vinesh Phogat. She's traveling more than 20 hrs. #VineshPhogat #ParisOlympics2024 #wrestling #Paris2024 #ParisOlympics #Olympics pic.twitter.com/ZC5vEl8jYh
ఈ వీడియోలో వినేశ్ ఫొగాట్ పక్కనే ఆమె పెదనాన్న మహవీర్ ఫొగాట్, రెజ్లర్ బజరంగ్ పునియా సహా పలువురు కూర్చొని ఉన్నారు. సమావేశంలో పాల్గొన్న వినేశ్ కాసేపు కూర్చీలోనే తల వెనక్కి వాల్చి అలా ఉండిపోయింది. అనంతరం మంచి నీరును తాగిన తర్వాత కాస్త తేరుకున్నట్లు వీడియోలో కనిపించింది. "చాలా సమయం పాటు ప్రయాణించడం, షెడ్యూలింగ్ వల్ల వినేశ్ ఫొగాట్ కాస్త ఇబ్బంది పడింది. స్వగ్రామంలో ఆమెకు అద్భుతమైన స్వాగతం దక్కింది" అని పునియా అన్నాడు.
అంతకుముందు కూడా పారిస్‌లో ఉన్నప్పుడు తాను డిస్క్వాలిఫై అయినట్లు ప్రకటించడంతో వినేశ్ ఫొగాట్ అస్వస్థకు గురైనట్లు వార్తలు వచ్చాయి. డీహైడ్రేషన్ కారణంగా ఆమె అనారోగ్యం పాలైందని, పారిస్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారని అప్పుడు అన్నారు.
కాగా, పసిడి పోరుకు అర్హత సాధించిన వినేశ్ ఫొగాట్‌పై అనూహ్యంగా అనర్హత వేటు పడటం అందర్నీ షాక్‌కు గురి చేస్తోంది. వంద గ్రాముల అధిక బరువు ఉండడం వల్ల ఒలింపిక్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పడం విమర్శలకు దారీ తీసింది. అయితే వినేశ్ న్యాయ పోరాటం కూడా చేసింది. కాస్‌కు అప్పీల్ చేసుకుంది. కానీ అది తిరస్కరణకు గురైంది.
'కుస్తీ గెలిచింది, నేను ఓడాను' - రిటైర్మెంట్ ప్రకటించిన వినేశ్ - Vinesh Phogat Retirement
'ఆ రోజు వినేశ్ ఫొగాట్ చనిపోతుందని అనుకున్నా!'- కోచ్ సంచలన వ్యాఖ్యలు - Vinesh Phogat Olympics