Paris olympics 2024 Vinesh Phogat Tweet Viral : ఎన్నో గాయాలు, అవమానాలను, విమర్శలను భరించిన కుస్తీ యోధురాలు వినేశ్ ఫోగాట్ ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్‌లో తన ప్రదర్శనతో గట్టి సమాధానమిచ్చింది. ఈ విశ్వక్రీడల్లో ఫైనల్‌కు చేరిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో సామాన్యులు, క్రీడాభిమానులు, సినీ,రాజకీయ ప్రముఖులు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Vinesh Phogat Disqualifies : అయితే ఆమె ఫైనల్‌కు చేరి ఒకరోజు కూడా అవ్వలేదు అంతలోనే ఆమెకు గట్టి షాక్ తగిలింది. ఫైనల్‌లో ఆమె కచ్చితంగా పతకం సాధిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న భారత అభిమానులకు చేదు వార్తను అందింది. 50 కేజీల విభాగంలో ఇవాళ(ఆగస్ట్ 7) రాత్రి ఫైనల్‌లో ఆమె పోటీ పడాల్సి ఉంది. దీంతో ఆమె బరువును చూసిన నిర్వాహకులు ఆమె అదనపు బరువు పెరిగినట్లు గుర్తించారు. 100 గ్రాములు అదనంగా ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో వినేశ్‌పై అనర్హత వేటు వేశాయి ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ.
"కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడం వల్ల వేటు పడింది. దయచేసి వినేశ్ ఫోగాట్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని కోరుతున్నాం. ఇది అత్యంత బాధాకరం" అని భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది.
వైరలవుతున్న పాత ట్వీట్ - అయితే ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌కు కొన్ని నెలల ముందు విమర్శకులను ఉద్దేశించి వినేశ్ ఫోగాట్ చేసిన పోస్ట్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "డియర్ హేటర్స్. మిమ్మల్ని నివ్వెరపర్చడానికి నా దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి. కాస్త ఓపిక పట్టండి" అని అందులో ఆమె రాసుకొచ్చింది. చెప్పినట్టుగానే ఒలింపిక్స్ సెమీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో ఆ పాత ట్వీట్ వైరల్‌గా మారింది. కానీ అంతలోనే ఇప్పుడు అనర్హత వేటు పడటం చాలా బాధకారమైన విషయం.
కాగా, మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా వినేశ్ ఫోగాట్ సహా ఇతర స్టార్ రెజ్లర్లు గతేడాది నిరసనలు తెలుపుతూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. దీంతో ఆమెపై భారీగా విమర్శలు వచ్చాయి. రెజ్లింగ్‌ను పక్కనబెట్టి రాజకీయాలు చేస్తోందని పలువురు ఆరోపించారు. వీటికి బదులిస్తూనే వినేశ్ ఒలింపిక్స్‌లో తాను చేయబోయే ప్రదర్శన గురించి పోస్ట్ పెట్టింది.
వినేశ్ ఫోగాట్‌పై అనర్హత వేటు - ఒలింపిక్స్‌కు ఐఓఏ ఛాలెంజ్ - Vinesh Phogat Paris Olympics 2024
ఫైనల్‌కు దూసుకెళ్లిన వినేశ్ ఫోగాట్‌కు షాక్ - ఆమెపై అనర్హత వేటు