ETV Bharat / sports

ఒలింపిక్స్ చరిత్ర : ఒక్క మహిళ కూడా పాల్గొనలేదు! - భారత్​కు తొలి గోల్డ్ అదే - ఎన్నో వింతలు, విశేషాలు! - Paris Olympics 2024

Paris Olympics 2024 : అభిమానం పల్లవించే.. ఉద్వేగం పలకరించే.. ఒళ్లంతా పులకరించే.. క్రీడా సంబరం "ఒలింపిక్స్" మళ్లీ వచ్చేసింది. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్‌లో మరికొద్ది గంటల్లో విశ్వక్రీడలు ఆరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇప్పటి వరకూ ఎన్నిసార్లు ఒలింపిక్స్ జరిగాయి? ఎలాంటి వింతలు, విశేషాలు చోటు చేసుకున్నాయి? అన్నది ఓసారి గుర్తుచేసుకుందాం.

Olympics Special Story
Paris Olympics 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 26, 2024, 6:21 PM IST

Updated : Jul 26, 2024, 6:36 PM IST

Olympics Special Story : యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విశ్వక్రీడలు ఒలింపిక్స్.. ఇవాళ్టి (జులై 26) నుంచి ప్రారంభంకానున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం పారిస్​లోని సెన్ నది వేదికగా ఒలింపిక్స్(Paris Olympics 2024) ప్రారంభోత్స వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన ఒలింపిక్స్​లో నమోదైన కొన్ని రికార్డులు, విశేషాల్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1896 ఏథెన్స్ : మొదటి ఒలింపిక్స్ 1896లో ఏథెన్స్‌లో జరిగాయి. 14 దేశాల నుంచి 241 మంది అథ్లెట్లు 43 క్రీడల్లో పాల్గొన్నారు. అయితే.. మహిళలకు ప్రత్యేక క్రీడా విభాగం లేకపోవడంతో ఒక్క మహిళ కూడా ఈ ఒలింపిక్స్​లో పాల్గొనలేదు. ఈ గేమ్స్​లో గ్రీస్ అత్యధిక పతకాలు సాధించింది.

1900 పారిస్ : ఈ సంవత్సరమే భారత్ ఒలింపిక్స్ ఆరంగేట్రం చేసింది. ఈ ఒలింపిక్స్​లో తొలిసారి భారత్‌ తరఫున బ్రిటీష్‌ ఇండియన్‌ అయిన నార్మన్‌ ప్రిట్జార్డ్‌ ఒక్కరే ప్రాతినిథ్యం వహించారు. ఐదు విభాగాల్లో నార్మన్‌ పాల్గొనగా.. మెన్స్‌ 200 మీటర్స్‌, మెన్స్‌ 200 మీటర్లు హర్డల్స్‌ పోటీల్లో రెండో స్థానంలో నిలిచి రెండు సిల్వర్ మెడల్స్ సాధించారు. అలాగే మహిళా అథ్లెట్ల కోసం ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారిగా స్టేడియం ఏర్పాటు చేశారు.

1912 స్టాక్‌హోమ్ : అమెరికన్ అథ్లెట్ జిమ్ థోర్ప్ పెంటాథ్లాన్, డెకాథ్లాన్‌లలో ఒకే ఒలింపిక్​లో రెండు గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నాడు.

1916 ఒలింపిక్స్ రద్దు : మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా 1916 ఒలింపిక్స్ రద్దయ్యాయి.

1924 పారిస్ : ఫిన్​లాండ్​కు చెందిన ట్రాక్ అథ్లెట్ పావో నూర్మి లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్​లో మూడు ఒలింపిక్ క్రీడలలో(1920, 1924, 1928)లో కలిపి తొమ్మిది స్వర్ణాలు, మూడు రజతాలు సాధించి రికార్డు సృష్టించాడు.

1928 ఆమ్‌స్టర్‌డామ్ : 1928 ఒలింపిక్స్​లో ప్రముఖ భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న మన హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి భారత్‌కు గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టింది.

1932 లాస్ ఏంజిల్స్ : 1928లో ప్రారంభమైన భారత హాకీ జట్టు విజయప్రస్థానం ఈ ఒలింపిక్స్​లో కూడా కొనసాగింది. ఆస్ట్రేలియా, బెల్జియం, డెన్మార్క్‌, స్విట్జర్లాండ్‌ జట్లను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్​లో నెదర్లాండ్‌తో పోటీ పడ్డ భారత్‌ 3-0తో ఘన విజయం సాధించి ఒలింపిక్స్​లో మరో స్వర్ణం పతకం సాధించింది.

1936 బెర్లిన్ గేమ్స్ : జర్మనీలో జరిగిన ఈ ఒలింపిక్స్​లో ఇద్దరు జపనీస్ పోల్ వాల్టర్లు రెండవ స్థానంలో నిలిచారు. అయితే, వారు మళ్లీ పోటీపడలేదు. వారికి లభించిన రజత, కాంస్య పతకాలను సగం సగం కట్ చేసి పంచుకున్నారు.

1948 లండన్ : ఈ ఒలింపిక్స్​లో నెదర్లాండ్స్‌కు చెందిన 30 ఏళ్ల గృహిణి Fanny Banker అసాధారణ ప్రదర్శనతో నాలుగు స్వర్ణ పతకాలను సాధించి రికార్డు నెలకొల్పింది. 1999లో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్స్ ఈ గొప్ప విజయానికి ఫానీని "శతాబ్దపు అత్యుత్తమ మహిళా అథ్లెట్"గా గౌరవించింది.

1952 హెల్సెంకీ : ఈ విశ్వక్రీడల్లో భారత్‌కు చెందిన ఖాసాబా ఖషబా దాదాసాహెబ్‌ జాదవ్‌ రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించాడు. ఇది స్వతంత్ర భారతదేశంలో మొదటి వ్యక్తిగత ఒలింపిక్ పతకం.

1960 రోమ్ : అమెరికన్ రన్నర్ విల్మా రుడాల్ఫ్ పోలియో కారణంగా ఆమె తన జీవితకాలంలో నడవలేదని వైద్యులు చెప్పారు. కానీ, ఆమె ఆత్మవిశ్వాసంతో ఈ ఒలింపిక్స్​లో పాల్గొని మూడు స్వర్ణాలను సాధించింది.

పేద దేశమైన ఇథియోపియాకు చెందిన నల్లజాతి క్రీడాకారిణి అబెబే బికిలా పాదరక్షలు లేకుండా పరిగెత్తి.. అత్యంత వేగవంతమైన రికార్డుతో మారథాన్ స్వర్ణం సాధించి ఈ ఒలింపిక్స్‌లో రికార్డు సృష్టించింది.

ఇదే ఒలింపిక్స్​లో కాసియస్ క్లే అనే 18 ఏళ్ల నల్లజాతి అమెరికన్ కుర్రాడు లైట్-హెవీ వెయిట్ విభాగంలో బాక్సింగ్‌లో బంగారు పతకాన్ని సాధించాడు. ఇది అప్పట్లో పెద్ద వార్త కాదు. కానీ, తర్వాత ఇదే అబ్బాయికి Muhammad అని పేరు పెట్టారు. ప్రపంచ ఆల్ టైమ్ సూపర్‌మ్యాన్ బాక్సర్‌గా చరిత్ర పుటల్లో నిలిచిన మహమ్మద్ ఆ కుర్రాడే.

1968 మెక్సికో : ఈ ఒలింపిక్స్‌లో అమెరికా ఆటగాడు బాబ్‌ బీమన్‌ లాంగ్‌ జంప్‌లో 8.90మీటర్లు గెంతి రికార్డు సృష్టించాడు. గత 50 ఏళ్ల ఒలింపిక్స్‌లో అతడి రికార్డును ఎవ్వరూ బద్దలు కొట్టలేదు.

1972 మ్యూనిచ్ : అమెరికన్ స్విమ్మర్ మార్క్ స్పిట్జ్ మ్యూనిచ్.. ఈ ఒలింపిక్స్‌లో ఏడు బంగారు పతకాలు సాధించి రికార్డు సృష్టించాడు. అలాగే ఈ ఒలింపిక్స్ టైమ్​లో 11 మంది ఇజ్రాయెల్ అథ్లెట్లను పాలస్తీనా మిలిటెంట్లు అపహరించి కాల్చిచంపారు.

పారిస్ ఒలింపిక్స్: ఇండియన్ అథ్లెట్లు ఈవెంట్లు- పూర్తి షెడ్యూల్ ఇదే!

1976 మాంట్రియల్ : ఈ ఒలింపిక్స్​లో 14 ఏళ్ల చిన్నారి రొమేనియన్ అథ్లెట్ నాడియా కొమనేసి జిమ్నాస్టిక్స్ చరిత్రలో 10.0 పర్ఫెక్ట్ స్కోర్‌ను సాధించి రికార్డ్ నెలకొల్పింది. అంతేకాదు.. ఆమె పర్ఫెక్ట్ 10.0ని మరో ఆరుసార్లు రికార్డ్ చేసి ఆల్‌రౌండ్ ఒలింపిక్ బంగారు పతక విజేతగా అవతరించింది.

1984 లాస్ ఏంజిల్స్ : ట్రాక్‌పై ఐదు దశాబ్దాల క్రితం జర్మనీలో నల్లజాతి అథ్లెట్ జెస్సీ ఓవెన్స్ సాధించిన అసాధారణ ఫీట్‌ను ఈ ఒలింపిక్స్​లో మరో అమెరికన్ నల్లజాతి క్రీడాకారుడు కార్ల్ లూయిస్ సమం చేశాడు. మొత్తం నాలుగు బంగారు పతకాలు సాధించాడు.

1988 సియోల్ : ఈ ఒలింపిక్స్‌లో స్ప్రింగ్‌బోర్డ్ పోటీలో పాల్గొన్న యూఎస్​కు చెందిన గ్రెగ్ లౌగానిస్ డైవింగ్ బోర్డ్‌ను ఢీ కొట్టగా తల వెనుక భాగంలో గాయమైంది. అయినా, మరుసటి రోజు డైవ్స్ పూర్తి చేసి ఈవెంట్‌లో విజయం సాధించాడు. తరువాతి వారం అతను 10-మీటర్ల ప్లాట్‌ఫారమ్‌లో స్వర్ణం సాధించాడు. ఒలింపిక్స్‌లో ఒక పురుష డైవర్ వరుసగా రెండు ఈవెంట్‌లను గెలుచుకోవడం ఇదే మొదటిసారి.

1996 అట్లాంటా : అమెరికాకు చెందిన మైఖేల్ జాన్సన్ ఈ ఒలింపిక్స్‌లో 200 మీటర్ల ప్రపంచ రికార్డుతోపాటు 200, 400 మీటర్లలో బంగారు పతకాలు సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. ఇదే ఒలింపిక్స్‌లో జిమ్నాస్టిక్స్‌లో కెర్రీ స్టగ్ అనే అమెరికన్ మహిళా క్రీడాకారిణి తన కాలు విరిగిన తర్వాత కూడా ప్రదర్శనను కొనసాగించి స్వర్ణాన్ని గెలుచుకుంది. ఈ ఒలింపిక్స్‌లో భారత టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ పురుషుల సింగిల్స్​లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

2000 సిడ్నీ : ఈ గేమ్స్​లో ఆస్ట్రేలియాకు చెందిన 'టార్పెడో' ఇయాన్ జేమ్స్ థోర్ప్ 400 మీటర్ల ఫ్రీస్టైల్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఇదే ఏడాది వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి కాంస్య పతకం సాధించింది.

2004 ఏథెన్స్ : అమెరికన్ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ ఒకే ఒలింపిక్స్‌లో ఆరు స్వర్ణాలు, రెండు కాంస్యాలు మొత్తం ఎనిమిది పతకాలతో అద్వితీయ రికార్డు సృష్టించాడు. ఈ ఒలింపిక్స్‌లో పురుషుల డబుల్ ట్రాప్ షూటింగ్‌లో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ భారత్​కు తొలి వ్యక్తిగత రజత పతకాన్ని సాధించి పెట్టాడు.

2008 బీజింగ్ : ఈ ఒలింపిక్స్​లో 1972 అమెరికన్ స్విమ్మర్ మార్క్ స్పిట్జ్ సాధించిన రికార్డును బద్దలు కొడుతూ మరో అమెరికన్ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ ఎనిమిది బంగారు పతకాలను సాధించి చరిత్ర సృష్టించాడు. ఉసేన్ బోల్ట్.. బీజింగ్‌లో కేవలం 9.69 సెకన్లలో 100 మీటర్ల పరుగును కంప్లీట్ చేసి నయా రికార్డు నెలకొల్పాడు.

2012 లండన్ : అన్ని దేశాల జట్లలో మహిళా అథ్లెట్లు పాల్గొన్న తొలి ఒలింపిక్స్ ఇదే. మైఖేల్ ఫెల్స్ ఈ ఒలింపిక్స్‌లో మళ్లీ మెరిసి తన వ్యక్తిగత పతకాల సంఖ్యను 22కి పెంచుకోవడం ఇక్కడ ప్రత్యేకం. ఇదే గేమ్స్​లో సైనా నెహ్వాల్ భారత్‌కు తొలి బ్యాడ్మింటన్ ఒలింపిక్ పతకాన్ని అందించింది. రెజ్లర్ సుశీల్ కుమార్ తన రెండో ఒలింపిక్ పతకాన్ని సాధించాడు. గగన్ నారంగ్, విజయ్ కుమార్, మేరీ కోమ్, యోగేశ్వర్ దత్ కూడా పతకాలు సాధించారు. మొత్తంగా ఈ ఒలింపిక్స్​లో భారత్​కు ఆరు పతకాలు వచ్చాయి.

2016 రియో : బహ్రెయిన్, ఫిజీ, ఐవరీ కోస్ట్, జోర్డాన్, కొసావో, ప్యూర్టో రికో, సింగపూర్, తజికిస్తాన్, వియత్నాం వంటి చిన్న దేశాలు ఈ ఒలింపిక్స్‌లో తమ తొలి ఒలింపిక్ బంగారు పతకాలను కైవసం చేసుకున్నాయి. స్టేడియంలో ఈ ఒలింపిక్స్ గేమ్స్​ చూసేందుకు వచ్చిన ప్రేక్షకుల సంఖ్య 60 వేలకు మించలేదు. అయితే ప్రపంచవ్యాప్తంగా టీవీ స్క్రీన్లపై ఒలింపిక్స్‌ను వీక్షించిన వారి సంఖ్య 325 కోట్లు దాటడం కొత్త రికార్డు.

2021 టోక్యో : కొవిడ్‌ కారణంగా చాలా క్రీడలు ప్రేక్షకులు లేకుండా జరిగాయి. టోక్యో ఒలింపిక్స్‌లో పునర్వినియోగపరచదగిన కార్డ్‌బోర్డ్ బెడ్‌లు,100% పునరుత్పాదక శక్తి నుంచి వచ్చే విద్యుత్‌తో సహా కొన్ని గొప్ప కార్యక్రమాలు చేపట్టారు. అలాగే అన్ని ఒలింపిక్ పతకాలు రీసైకిల్ చేసిన ఎలక్ట్రానిక్స్ నుంచి తయారు చేశారు. మొత్తం 47,000 టన్నుల సాంకేతిక వ్యర్థాలను, 5,000,000 సెల్ ఫోన్‌లను సేకరించి 5,000 పతకాలను తయారు చేశారట.

పారిస్ ఒలింపిక్స్​లో పాల్గొననున్న అతిచిన్న, పెద్ద ప్లేయర్లు ఎవరంటే?

ఒలింపిక్స్ లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్​ - ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

Last Updated : Jul 26, 2024, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.