ETV Bharat / sports

ముగిసిన పీవీ సింధు పోరాటం - ఒలింపిక్స్ నుంచి ఔట్ - Paris Olympics 2024 PV Sindhu

author img

By ETV Bharat Sports Team

Published : Aug 1, 2024, 11:44 PM IST

Paris Olympics 2024 PV Sindhu : ఒలింపిక్స్‌లో మూడో పతకంపై కన్నేసిన స్టార్‌ షట్లర్ పీవీసింధుకు నిరాశ ఎదురైంది. ఆమె పోరాటం ముగిసింది.

source Getty Images
Paris Olympics 2024 PV Sindhu (source Getty Images)

Paris Olympics 2024 PV Sindhu : ఒలింపిక్స్‌లో మూడో పతకంపై కన్నేసిన స్టార్‌ షట్లర్ పీవీసింధుకు నిరాశ ఎదురైంది. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్​లో గ్రూప్ ​స్టేజ్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన సింధుకు ఇప్పుడు ప్రీ క్వార్టర్స్​లో పరాజయం ఎదురవ్వడంతో ఆమె పోరాటం ముగిసింది. రియో ఒలింపిక్స్‌ 2016లో రజతం, టోక్యో ఒలింపిక్స్‌ 2020లో కాంస్యం గెలిచిన సింధు - ఇప్పుడు పారిస్​లో మాత్రం ప్రీక్వార్టర్స్‌కే పరిమితమైంది.

చైనాకు చెందిన 9వ ర్యాంకర్ హీబింగ్ జియావోపై 19-21,14-21 వరుస సెట్లలో ఓడింది. వాస్తవానికి ఈ పోరులో సింధు అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. తొలిగే మ్‌లో క్రాస్ కోర్ట్ షాట్స్‌తో సింధు, స్మాష్‌లతో చైనా ప్లేయర్ హోరాహోరీగా తలపడ్డారు. చివరకు చైనా ప్లేయర్ గెలిచింది. ఇక రెండోగేమ్ ఆరంభం నుంచే దూకుడు చూపించిన బింగ్​ వరుస పాయింట్స్‌తో సింధుపై ఒత్తిడిని పెంచింది. కానీ మధ్యలో సింధు కాస్త పుంజుకున్నా చివరికి ఆధిక్యాన్ని కాపాడుకొని రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది బింగ్​.

అయితే అంతకుముందు జరిగిన గ్రూప్‌ స్టేజ్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ఎస్టోనియాకు చెందిన యంగ్ ప్లేయర్ క్రిస్టిన్‌ కూబా పై 21-5, 21-10 పాయింట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సింధు గ్రూప్‌-M నుంచి ప్రీ క్వార్టర్స్​​కు చేరుకుంది. అయితే సింధు ఈ మ్యాచ్​ను కేవలం 34 నిమిషాల్లోనే ముగియడం విశేషం.

గత రెండు ఒలింపిక్స్​లో సింధు మెరుగైన ప్రదర్శనతో అదరగొట్టింది. అయితే కామెన్వెల్త్ గేమ్స్​ తర్వాత సింధు ఫామ్ కోల్పోయింది. ఈ క్రమంలో ఆమె గాయపడింది. గాయం నుంచి కోలుకున్నాక కూడా జరిగిన పలు టోర్నీల్లో ఆశించిన స్థాయిలో సింధు ప్రదర్శన చేయలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు. అయితే విశ్వక్రీడలు అనగానే సింధు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగినప్పటికీ ప్రీ క్వార్టర్స్​లో ఆమెకు నిరాశ తప్పలేదు. దీంతో క్రీడాభిమానులు కూడా ఆమె ఓటమి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

పారిస్​ ఒలింపిక్స్​ - పీవీ సింధు చీరపై విమర్శలు - ఎందుకంటే?

మలేషియా మాస్టర్స్ నుంచి కాన్ఫిడెన్స్‌ తీసుకెళ్తా- అలా చేసుంటే బాగున్ను!: పీవీ సింధు - PV Sindhu

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.