Youngest And Oldest Players In Paris Olympics : పారిస్ వేదికగా విశ్వక్రీడలు మరికొద్ది గంటల్లో అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే పలు ఈవెంట్లు కూడా మొదలై అందులో మన భారత అథ్లెట్లు రాణిస్తున్నారు. అయితే ఓపెనింగ్ సెరిమనీ తర్వాత అఫీషియల్‌గా మరిన్ని ఈవెంట్లు జరగనున్నాయి. ఈ పోటీల్లో తమ సత్తా చాటి పసిడి పతకాలాను ముద్దాడేందుకు అథ్లెట్లు కూడా కసితో బరిలోకి దిగనున్నారు. 206 దేశాల నుంచి 10,500 మంది అథ్లెట్లు పాల్గొంటుండగా, అందులో ఓ ఇద్దరిపై అందరి దృష్టి పడింది. వారెవరో కాదు ఈ క్రీడల్లో అతి చిన్నవయస్కురాలైన, అతి పెద్ద వయస్కురాలైన ప్లేయర్
ఈ క్రీడల్లో అత్యంత పిన్నవయస్కురాలిగా చైనాకు చెందిన 11 ఏళ్ల చిన్నారి జెంగ్ హావోహావో పాల్గొననుంది. మహిళల స్కేట్‌బోర్డింగ్ ఈవెంట్‌లో ఈమె పోటీకి దిగనుంది. ఇక కెనడాకు చెందిన 61 ఏళ్ల జిల్ ఇర్వింగ్ ఈ క్రీడల్లో పాల్గొననున్న అతిపెద్ద వయస్కురాలిగా పాల్గొననున్నారు. ఈక్వెస్ట్రియన్ జట్టులో సభ్యురాలైన ఈమెకు ఇదే తొలి ఒలింపిక్ ఈవెంట్ కావడం గమనార్హం.
భారత్‌లోనూ పెద్ద - చిన్నా
ఇక భారత జట్టులో అత్యంత చిన్న వయస్సు ప్లేయర్‌గా ధినిధి దేషింగు పేరు రికార్డుకెక్కింది. స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనునన్న ఈమె వయస్సు 14 ఏళ్లు. ఇక ఒలింపిక్ హిస్టరీలో పిన్న వయస్సు ప్లేయర్‌గా పాల్గొననున్న రెండో భారత్ ప్లేయర్‌గానూ ధినిధి అరుదైన ఘనతను సాధించింది. మరోవైపు టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న భారత్ నుంచి విశ్వ క్రీడల్లో పోటీపడనున్న పెద్ద వయస్కుడు. ఈయన వయస్సు 44 ఏళ్లు.
మరోవైపు ఈ ఈవెంట్‌లోని వివిధ క్రీడల కోసం ఈ సారి భారత్ నుంచి 117 మంది పోటీపడుతున్నారు. గతంలో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మొత్తం ఏడు పతకాలు గెలవగా, అందులో అయిదు పతకాంశాల్లో ఈ సారి మన అథ్లెట్లు బరిలో దిగనున్నారు. నీరజ్‌చోప్రా (జావెలిన్), లవ్లీనా (బాక్సింగ్), మీరాబాయి చానూ (వెయిట్‌లిఫ్టింగ్), పీవీ సింధు (బ్యాడ్మింటన్)తో పాటు పురుషుల హాకీ జట్టు పతకం కోసం పోటీపడనుంది.
ఆ లిస్ట్ ప్రకారమే పరేడ్ - భారత్ ఏ ప్లేస్‌లో రానుందంటే? - PARIS OLYMPICS 2024
పారిస్ ఒలింపిక్స్‌కు ఏఐ నిఘా - ప్రైవసీపై వెల్లువెత్తుతున్న ఆందోళనలు - Paris Olympics 2024