Paris Olympics 2024 Mascot Phryges : ఒలింపిక్స్ ఈ పేరు వినగానే చాలా మందికి ఐదు రింగుల చిహ్నమే గుర్తొస్తుంది. దీంతో పాటే ఓ ముద్దొచ్చే మస్కట్ కూడా మరికొంతమందికి గుర్తొస్తుంది. అయితే ఈ సారి పారిస్ 2024లో పెద్ద పెద్ద నీలి కళ్లతో ఉన్న ఫ్రీజ్ అనే మస్కట్ దర్శనమిస్తోంది. ఈ మస్కట్లోనే చిన్న చిన్న మార్పులు చేసి పారా ఒలింపిక్స్ కోసం కూడా సెలెక్ట్ చేశారు. ఈ సందర్భంగా ఫ్రీజ్ ఎలా రూపొందించారు, దాని చరిత్ర ఏంటో తెలుసుకుందాం.
1968 ఒలింపిక్ గేమ్స్ నుంచి ఈ మస్కట్ భాగమవుతూ వస్తోంది. ఆతిథ్య దేశాలు తమ సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ మస్కట్లను తయారు చేయడం ప్రారంభించాయి. 1968 ఫ్రాన్స్ వేదికగా నిర్వహించిన ఒలింపిక్స్‌లో మస్కట్ షూస్‌ను తయారు చేశారు. దీని భారీ తలలో ఒలింపిక్ రింగ్స్ కనపడేలా రూపొందించారు. అప్పట్లో ఈ మస్కట్‌ను తయారు చేసిన డిజైనర్‌కు పెద్దగా సమయం దొరకకపోవడం వల్ల ఇలా తయారు చేశాడని అంటుంటారు.
అనంతరం బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లో బింగ్ డ్వెన్‌డ్వెన్ అనే పాండాను మస్కట్‌గా తయారు చేశారు. టోక్యో ఒలింపిక్స్‌లో మిరాయిటోవానును మస్కట్‌గా ఎంపిక చేశారు.
ఇక ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ విషయానికొస్తే ఫ్రెంచి సంప్రదాయంలో ఫ్రీజియన్ క్యాప్ ఎంతో ముఖ్యమైనంది. దీని ఆధారంగానే ఫ్రీజ్ మస్కట్‌ను రూపొందించారు. ఫ్రాన్స్ చరిత్రలో ఇదో కీలక భాగం. క్రీడలు అన్నింటిని ఇవి మార్చగలవు అనే సూత్రంతోనే ఈ మస్కట్‌ను తయారుచేశారు. అలానే ఆటల్లోని సమష్టితత్వాన్ని తెలియజేస్తూ దీనిని తయారుచేశారు.
1798-1799 మధ్య ఫ్రెంచి విప్లవం జరిగింది. అప్పుడు స్వేచ్ఛకు చిహ్నంగా ఫ్రీజియన్ క్యాప్‌లను ఉపయోగించేవారు. అలా ఇవి చరిత్రలో స్థానం దక్కించుకొన్నాయి.
వీటని ఫ్రెంచి రిపబ్లిక్‌కు చిహ్నంగానూ భావిస్తారు. చాలా ప్రభుత్వ భవనాలు, స్టాంపులు, కాయిన్స్‌పైన కూడా ఇవి కనిపిస్తాయి. పురాతన గ్రీక్ చిత్రాల్లోనూ ఈ క్యాప్ దర్శనమిస్తుంది.
కాగా, పారిస్ ఒలింపిక్స్ 2024 జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. ఫ్రాన్స్‌లోని పారిస్ సహా ఇతర 16 నగరాల్లో ఇది జరగనుంది. ఈ అతిపెద్ద క్రీడా సంబరానికి ఫ్రెంచ్ రాజధాని ఆతిథ్యం ఇవ్వడం ఇది మూడోసారి. గతంలో 1900, 1924లోనూ ఫ్రాన్స్‌లో ఒలింపిక్స్ నిర్వహించారు.
Vers l'infini et au-délàààà 🚀
— Paris 2024 (@Paris2024) July 20, 2024
Plus vite, Plus haut, Plus fort - Ensemble ! Les Mascottes vont entrer dans la postérité pour les générations futures et partiront en mission sur la Lune en 2027 avec @SanctuaryOnMoon 🌝
Un petit pas pour les Phryges mais un grand pas pour… pic.twitter.com/cDOaW53zjg
రెండేళ్లలో ఎన్నో మార్పులు - పారిస్ బరిలో సత్తా చాటనున్న యంగ్ ఛాంపియన్స్ - Paris Olympics 2024
రూ.15,490 కోట్లతో క్రీడా గ్రామం - అథ్లెట్ల కోసం 3 లక్షల కండోమ్‌లు! - Paris Olympics 2024