Paris Olympics 2024 July 29 Schedule : పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ కాంస్య పతకంతో(షూటింగ్లో) ఖాతా తెరిచింది. ఇక నేడు(జులై 29) షూటింగ్‌లోనే మరో రెండు మెడల్స్ భారత్ ఖాతాలో చేరే ఛాన్స్ ఉంది. అవేంటి? ఇంకా ఏఏ ఈవెంట్లు ఈరోజు జరగనున్నాయి వివరాలు తెలుసుకుందాం.
ఒలింపిక్స్ జులై 29 షెడ్యూల్
బ్యాడ్మింటన్ : మెన్స్ డబుల్స్(సాత్విక్-చిరాగ్ × మార్క్-మెర్విన్) - మధ్యాహ్నం 12,
ఉమెన్స్ డబుల్స్ (అశ్విని-తనీషా × నమి-చిహారు) - మధ్యాహ్నం 12.50,
మెన్స్ సింగిల్స్ (లక్ష్యసేన్ × జులియన్) - సాయంత్రం 5.30
షూటింగ్ : 10మీ.ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్ (మను-సరబ్‌జోత్, రిథమ్-అర్జున్ చీమా) - మధ్యాహ్నం 12.45, మెన్స్ ట్రాప్ క్వాలిఫికేషన్ (పృథ్వీరాజ్) - మధ్యాహ్నం 1
హాకీ : భారత్ × అర్జెంటీనా - సా. 4.15
టేబుల్ టెన్నిస్ : ఉమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్ (శ్రీజ × జియాన్)- రాత్రి 11.30
పతకాలు ఎందులో వచ్చే అవకాశముందంటే?
షూటింగ్ : 10మీ.ఎయిర్ రైఫిల్ ఉమెన్స్ ఫైనల్ (రమిత) - మధ్యాహ్నం 1, మెన్స్ ఫైనల్ (అర్జున్ బబుతా) - మధ్యాహ్నం 3.30
ఆర్చరీ : మెన్స్ టీమ్ క్వార్టర్స్ (తరుణ్‌దీప్, బొమ్మధేవర ధీరజ్(విజయవాడ), ప్రవీణ్) - సాయంత్రం 6.30, మెడల్ రౌండ్లు- రాత్రి 8.18
డైవింగ్ : మెన్స్ సింక్రనైజ్డ్ 10మీ ప్లాట్‌ఫామ్ ఫైనల్ - మధ్యాహ్నం 2.30
స్కేట్ బోర్డింగ్ : మెన్స్ స్ట్రీట్ ఫైనల్ - రాత్రి 8.30
ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ - మెన్స్ టీమ్ ఫైనల్ - రాత్రి 9
స్విమ్మింగ్ : ఉమెన్స్ 400మీ. వ్యక్తిగత మెడ్లీ ఫైనల్ - రాత్రి 12, మెన్స్ 200మీ.ఫ్రీస్టైల్ ఫైనల్ - రాత్రి 12.10
జోరు చూపిస్తున్న ఆసీస్ - ఒలింపిక్స్ మెడల్స్ టేబుల్లో టాప్ పొజిషన్ కోసం అమెరికా, చైనా ఎక్కువగా పోటీపడుతుంటాయి. కానీ ఈ సారి ఆస్ట్రేలియా జోరు చూపిస్తోంది. ప్రస్తుతానికి ఆసీస్ 4 గోల్డ్ మెడల్స్, 2 రజతాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కాంస్యంతో భారత్ 22వ స్థానంలో ఉంది.
🚨 Schedule for tomorrow’s action! Tune in from 12 noon IST to #Cheer4Bharat. #JeetKiAur | #IndiaAtParis24 pic.twitter.com/rBEWIZYMmy
— Team India (@WeAreTeamIndia) July 28, 2024
పారిస్ ఒలింపిక్స్ : లక్ష్యసేన్ విజయం రద్దు - ఎందుకంటే?
లైవ్ పారిస్ ఒలింపిక్స్: మనూ బాకర్‌కు ప్రధాని ఫోన్- పతక విజేతతో మోదీ చిట్‌చాట్ - Paris Olympics 2024