ETV Bharat / sports

హర్మన్ సేన శుభారంభం - పురుషుల హాకీలో టీమ్ఇండియా సూపర్ విక్టరీ - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024

Paris Olympics 2024 Hockey : పారిస్ ఒలింపిక్స్​లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్​లో భారత పురుషల హాకీ టీమ్ శుభారంభం చేసింది. న్యూజిలాండ్​పై జరిగిన తొలి పోరులో 3-2తో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

Paris Olympics 2024 Hockey Mens
Paris Olympics 2024 Hockey (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 6:35 AM IST

Paris Olympics 2024 Hockey : పారిస్ ఒలింపిక్స్​లో భారత పురుషుల హాకీ టీమ్​ శుభారంభం చేసింది. శనివారం (జులై 27)న జరిగిన తొలి పోరులో 3-2తో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. మన ప్లేయర్లలో వివేక్‌ సాగర్‌, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, మన్‌దీప్‌ సింగ్‌ గోల్స్‌ చేయగా, న్యూజిలాండ్ జట్టులో సైమన్‌ చైల్డ్‌, సామ్‌లేన్‌ తమ జట్లకు గోల్స్‌ అందించారు. మ్యాచ్‌ ఆఖరి నిమిషంలో దక్కిన పెనాల్టీ స్ట్రోక్‌ను హర్మన్‌ప్రీత్‌సింగ్‌ గోల్‌గా మలిచి జట్టును గెలిపించాడు.

మ్యాచ్ సాగిందిలా
మ్యాచ్ ప్రారంభంలో న్యూజిలాండ్ జట్టు దూకుడుగా ఆడింది. ఆట 8వ నిమిషంలో సామన్ లేన్ ఓ సూపర్ గోల్​తో తమ పాయింట్ల ఖాతా తెరిచాడు. అలా తొలి క్వార్టర్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంతో టాప్​లో చేరుకుంది. అయితే రెండో క్వార్టర్‌లోని 24వ నిమిషంలో దక్కిన పెనాల్టీని మన్‌దీప్ సింగ్ గోల్‌గా మలిచి స్కోర్​ను సమం చేశాడు.

ఆ తర్వాత నుంచి ఎంత ప్రయత్నించినా కూడా ఇరు జట్లకు ఒక్క గోల్​ కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో మొదటి క్వార్టర్​ను 1-1తో ముగించాల్సి వచ్చింది. ఇక వివేక్ సాగర్ కొట్టిన గోల్​తో 2-1 స్కోర్​తో భారత్‌ మూడో క్వార్టర్​లో ఆధిక్యాన్ని సాధించింది. ఆ తర్వాత కివీస్ గోల్ కొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ, మన గోల్ కీపర్ శ్రీజేష్ వాటిని అడ్డుకుంటూ వచ్చాడు. అలా 2-1 ఆధిక్యంతో మూడో క్వార్టర్ పూర్తైంది.

అయితే ఆట 46వ నిమిషంలో భారత్ చేసిన గోల్​ను న్యూజిలాండ్ అనుహ్యంగా అడ్డుకుంది. 53వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి న్యూజిలాండ్ జట్టు స్కోర్లను మరోసారి సమం చేసింది. ఇలా సమాన స్కోర్లతో మ్యాచ్​లో ఎవరిది పైచేయి కానుందన్న ఉత్కంఠత మొదలవ్వగా, ఆఖరి నిమిషంలో హర్మన్‌ప్రీత్ కౌర్ కొట్టిన గోల్ వల్ల భారత్ ఈ మ్యాచ్​లో విజయతీరాలకు చేరుకుంది. ఇక ఇదే జోష్​తోభారత్ సోమవారం (జులై 29)న అర్జెంటీనాతో తలపడనుంది.

ప్రిక్వార్టర్స్‌కు బాక్సర్​ ప్రీతి
బాక్సింగ్‌ ఈవెంట్​లో భారత్​ ముందుకుసాగింది. మహిళల 54కేజీ విభాగంలో ప్రీతి పవార్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. ఆరంభ పోరులో వియత్నాంకు చెందిన థి కిమ్‌ అన్‌ను ఆమె 5-0తో ఓడించింది.

టీటీలో హర్మీత్​ కిక్​స్టార్ట్ : టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌లో యంగ్ ప్లేయర్ హర్మీత్ దేశాయ్ శుభారంభం చేశాడు. ఆరంభ రౌండ్​లోనే 4-0 (11-7, 11-9, 11-5, 11-5)తో జోర్డాన్‌కు చెందిన జైద్‌ అబో యమాన్‌ను చిత్తు చేశాడు.

పన్వర్‌కు లాస్ట్ ఛాన్స్ : భారత్​ నుంచి ఒలింపిక్స్​లో ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక రోయర్‌ బాల్‌రాజ్‌ పన్వర్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరడంలో విఫలమయ్యాడు. హీట్‌ 1లో నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు. దీంతో మిగతా టాప్‌-3 ప్లేయర్లు ముందంజ వేశారు. అయితే రెపిచేజ్‌ రౌండ్‌కు అతడు అర్హత సాధించిన పన్వర్​, అక్కడ మెరుగైన ప్రదర్శన చేస్తే సెమీఫైనల్స్‌ లేకుంటే ఫైనల్‌కు చేరుకోవచ్చు.

డ్రాగన్ దేశానికే తొలి స్వర్ణం - పారిస్ ఒలింపిక్స్​లో మెడల్స్ ఖాతా తెరిచింది ఎవరంటే?

ఫైనల్​కు మను బాకర్- బ్యాడ్మింటన్​లో లక్ష్య, సాత్విక్- చిరాగ్ అదుర్స్- భారత్ డే 1 హైలైట్స్ ఇవే! - Paris Olympics 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.