ETV Bharat / sports

రోప్ క్లైంబింగ్​, టగ్​ ఆఫ్ వార్ - ఒలింపిక్స్​లోని ఈ విచిత్రమైన క్రీడల గురించి తెలుసా? - Paris Olympics 2024

Strangest Sports In Olympic History : ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్స్‌ మరి కొన్నిరోజుల్లో ప్రారంభం కానుంది. అయితే విశ్వ క్రీడల్లో కొన్ని ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన క్రీడలు ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దామా?

Strangest Sports In Olympic History
Paris Olympics 2024 (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 11:08 AM IST

Strangest Sports In Olympic History : అతి పెద్ద అంతర్జాతీయ క్రీడా సంబరమైన ఒలింపిక్స్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. 84 దేశాల నుంచి 10,000 మంది అథ్లెట్లు ఈ విశ్వ క్రీడలలో పాల్గొంటారు. ఇందులో మొత్తం క్రీడలు 32 ఉండగా మనకు ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్ , షూటింగ్ వంటివి బాగా తెలుసు. అయితే విశ్వ క్రీడల్లో ఒకప్పుడు కొన్ని ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన క్రీడలు ఉన్నాయని మీకు తెలుసా. అవేంటో ఒకసారి చూద్దాం.

200 మీటర్ల అబ్స్టాకిల్ రేస్
1900లో పారిస్‌లో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో ఈ ఈవెంట్‌ను ప్రవేశపెట్టారు. ఈ స్విమ్మింగ్ ఈవెంట్ చాలా క్లిష్టంగానూ అలాగే సరదాగానూ ఉంటుంది. 200మీటర్ల అబ్స్టాకిల్ రేస్‌లో అడ్డంకులు దాటుకుంటూ ఈత కొడుతూ లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. పోటీ దారులు ఒక స్తంభంపైకి ఎక్కి, పడవల వరుసపై దూకి ఈత కొట్టి లక్ష్యాన్ని వేగంగా చేరుకోవాలి. ఈ నేపథ్యంలో స్విమ్మర్లు మూడు సెట్ల అడ్డంకులను అధిగమించి 200 మీటర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది.

సోలో సిన్​క్రనైజ్డ్ స్విమ్మింగ్
డ్యాన్స్‌ చేసినట్లు ఈత కొట్టడమే సోలో సిన్​క్రనైజ్డ్​ స్విమ్మింగ్. 1984, 1992 మధ్య జరిగిన ఒలింపిక్ క్రీడల్లో ఈ సోలో సిన్​క్రనైజ్డ్​ స్విమ్మింగ్ ఈవెంట్ నిర్వహించారు. సంగీతానికి తగ్గట్లు కళాత్మకంగా ఈత కొట్టినవారికి పతకం దక్కుతుంది. అమెరికా స్విమ్మర్ ట్రేసీ రూయిజ్‌ ఈ విభాగంలో 1984లో స్వర్ణం పతకాన్ని గెలుచుకున్నారు.

రోప్ క్లైంబింగ్:
1896, 1900-08,1924, 1932 ఒలింపిక్స్‌ క్రీడల్లో ఈ ఈవెంట్​ను నిర్వహించారు. 1859లో హెలెనిక్ ఒలింపిక్స్‌లోనూ ఈ పోటీలు జరిగాయి. 1932 వరకు ఒలింపిక్స్‌లోని జిమ్నాస్టిక్ ఈవెంట్‌లలో ఇదీ ఓ ఆటగా ఉండేది. మొదటి ఒలింపిక్ సమయంలో తాడు 14 మీటర్ల పొడవు ఉండేది. 1932 తర్వాత దీనిని ఒలింపిక్స్‌ నుంచి తొలగించారు.

ఓపెన్ క్లాస్ మోటర్ బోటింగ్‌
1908 సమ్మర్​ ఒలింపిక్స్‌లో ఈ ఓపెన్​ క్లాస్ మోటర్‌ బోటింగ్​ ఈవెంట్​ను నిర్వహించారు. చాలా కాలం పాటు వాయిదా వేసి ఆ తర్వాత ఈ రేస్‌ నిర్వహించారు. మూడు ఒలింపిక్స్‌లో ఈ ఈవెంట్‌ నిర్వహించారు. ఆ తర్వాత మోటర్‌బోటింగ్ మళ్లీ కనిపించలేదు. 1908లో ఈ పోటీ విన్నర్​గా ఎమిలే థుబ్రోన్ నిలిచారు.

సైక్లింగ్ టాన్డెమ్​ స్ప్రింట్
1908, 1920, 1972ల్లో జరిగిన ఒలింపిక్‌ క్రీడల్లో 2000మీటర్ల టాన్డెమ్​ సైక్లింగ్ ఈవెంట్ నిర్వహించారు. 2,000 మీటర్ల రేసులో నలుగురు కలిసి సైక్లింగ్‌ చేస్తారు. ఆ తర్వాత ఈ ఈవెంట్‌ను ఒలింపిక్స్‌ నుంచి తొలగించారు.

టాన్డెమ్​ సైక్లింగ్
ఇది ఒక ఆసక్తికరమైన ఈవెంట్‌. చూపు మంచిగా ఉన్న వారు దృష్టి లోపం ఉన్న పోటీదారులతో కలిసి రైడ్ చేస్తారు.

టగ్ ఆఫ్ వార్
1900, 1920 వరకు ఒలింపిక్ క్రీడలలో టగ్-ఆఫ్-వార్ నిర్వహించేవారు. 1920లో ఆంట్‌వెర్ప్‌లో టగ్‌ ఆఫ్‌ వార్‌ను చివరిసారి నిర్వహించారు. 1920 తర్వాత టగ్ ఆఫ్ వార్​ను ఒలింపిక్స్ నుంచి తొలగించారు.

క్రోకెట్
1900స్​లో క్రోకెట్ అనే క్రీడ నిర్వహించేవారు. ఫ్రాన్స్‌లో అత్యంత విజయవంతమైన క్రీడ ఇది. అయితే ఈ గేమ్​ చాలా ఈజీగా ఉన్నందున, అలాగే ఆడిన ప్రతి ఒక్కరూ ఈజీగా విన్ అవుతున్నందున దాన్ని కొంత కాలం తర్వాత ఒలింపిక్స్​ నుంచి తొలగించారు.

పారిస్​ ఒలింపిక్స్​ - ఒకే యూనివర్సిటీ నుంచి ఎనిమిది మంది అథ్లెట్లు

184 దేశాలు, 10వేల అథ్లెట్లు, 329 పతకాలు- పారిస్ ఒలింపిక్స్ ఫుల్ డీటెయిల్స్ - PARIS OLYMPICS 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.