Pakistan Super League Win Prediction : పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో భాగంగా గురువారం కరాచీ వేదికగా క్వెట్టా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్ మధ్య పోటీ జరిగింది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఆఖరికి అయిదు వికెట్ల తేడాతో గ్లాడియేటర్స్ జట్టు విజయం కైవసం చేసుకుంది. అయితే మ్యాచ్‌లో గ్లాడియేటర్స్ గెలుపునకు మూడు పరుగులు కావాల్సి ఉంది. సరిగ్గా అదే సమయంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. గేమ్ మేనేజ్మెంట్ చేసిన ఓ తప్పిదం వల్ల ఇప్పుడు నెట్టింట మీమ్స్ వర్షం కురుస్తోంది.
అసలేం జరిగిందంటే ?
హోరా హోరీగా జరిగిన మ్యాచ్‌లో చివరి వరకు నెట్టుకొచ్చిన క్వెట్టా గ్లాడియేటర్స్‌కు చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు అవరమైంది. అయితే అదే టైమ్‌కు విన్ ప్రిడిక్షన్‌ను స్క్రీన్‌పై డిస్ప్లే చేశారు. అందులో కరాచీకి - 1 శాతం అని ఉండగా, క్వెట్టా విజయావకాశాలు 101 శాతంగా చూపించింది. దీంతో స్టేడియంలో ఉన్నవాళ్లు ఒక్కసారిగా షాకయ్యారు. కాసేపటి తర్వాత అసలు విషయాన్ని అర్థం చేసుకుని నవ్వుకున్నారు.
-
Win forecast in PSL. pic.twitter.com/nQr48JRwFI
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 29, 2024
బాబర్‌కు చేదు అనుభవం
Babar Azam Trolled : పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు స్వదేశంలో చేదు అనుభవం ఎదురైంది. 2024 పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ లో ది పెష్వార్ జల్మి- ముల్తాన్ సుల్తాన్ మ్యాచ్ జరుగుతుండగా సొంత దేశం అభిమానులే బాబర్‌ను ట్రోల్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన బాబర్ చేతిలో ఉన్న బాటిల్‌ను ఫ్యాన్స్‌పై విసరబోయాడు.
'ది పెష్వార్ జల్మి' జట్టుకు బాబర్ ఆజమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. శుక్రవారం ముల్తాన్ సుల్తాన్‌తో మ్యాచ్ జరుగుతుండగా బాబర్ బౌండరీ లైన్ వద్ద టీమ్మేట్స్తో కలిసి కూర్చున్నాడు. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు 'జింబాబర్', 'జింబాబర్' అంటూ బాబర్‌ను ట్రోల్ చేశారు. దీంతో బాబర్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. 'ఇలా రండి' అన్నట్లుగా సైగ చేసిన బాబర్, తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్‌ను వారిపై విసరబోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
'ఇదేం ఫీల్డింగ్రా బాబూ..!'.. నవ్వులు పూయిస్తున్న రనౌట్ వీడియో
నాటౌట్ను ఔట్‌గా చెప్పిన థర్డ్ అంపైర్ - పెద్ద పనే జరిగిపోయిందిగా!