Pakistan T20 World Cup Plan: టీ20 వరల్డ్ కప్‌లో భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుదీర్ఘ ఐపీఎల్ టోర్నీనే భారత జట్టు బెస్ట్ ప్రిపరేషన్‌గా భావిస్తోంది. ఒక్క వార్మప్ మ్యాచ్ తర్వాత టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగుతోంది. మరో వైపు పాకిస్థాన్ వరుసగా ఇంటర్నేషనల్ టీ20 సిరీస్‌లు ఆడుతోంది. ఇటీవలే ఐర్లాండ్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ని 2-1తో గెలుచుకుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది.
తాజాగా వరల్డ్ కప్ సన్నాహాలపై పాక్ స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్ ఓ స్పోర్ట్ ఛానెల్‌తో మాట్లాడాడు. మెగా టోర్నీలో తమ గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతోందో చెప్పాడు. 'ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత, మా మైండ్‌సెట్, బాడీ లాంగ్వేజ్ చాలా మారాయి. ఎవరూ ఓడిపోవడానికి ఇష్టపడరు. మేము దాన్ని అర్థం చేసుకున్నాం. ఆ మొదటి మ్యాచ్ తర్వాత, మారిన మా మైండ్ సెట్ కంటిన్యూ అయితే, కొత్త పాకిస్థాన్‌ని చూస్తారు. ప్రతి గేమ్ తర్వాత మీటింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మా ఆలోచనంతా మొదట బ్యాటింగ్ చేస్తే, 200కి పైగా స్కోర్ చేయడంపైనే ఉంటుంది. వరల్డ్ కప్‌లో మా బ్యాటింగ్ గురించి చర్చలు జరుగుతాయి. మా బౌలింగ్ కూడా వరల్డ్ క్లాస్' అని చెప్పాడు.
పాక్ కొత్త కోచ్ గ్యారీ కిర్‌స్టన్
టీ20 వరల్డ్ కప్‌కి ముందు కిర్‌స్టన్ పాక్‌కి కోచ్‌గా ఎంపికవ్వడంపై ఫఖర్ స్పందించాడు. 'గ్యారీ చాలా గొప్ప వ్యక్తి. అతను కొత్తవాడు. కానీ అతను కొత్త అని మాకు అనిపించలేదు. ఎందుకంటే అతను వచ్చిన రోజే టీమ్‌తో కలిసిపోయాడు. అతను అందరితో మాట్లాడడానికి ఇష్టపడతాడు. అతనితో పని చేయడానికి చాలా సంతోషిస్తున్నాం. అతడికి అంత సమయం లేదు. కానీ అతని మనస్తత్వం, స్నేహితుల్లా కూర్చుని మాతో మాట్లాడే విధానం, నాకు నచ్చింది. ప్రపంచకప్ చాలా దగ్గరగా ఉంది. ప్రస్తుతం ఎవరి మాటను(బ్యాటింగ్ సూచనలు గురించి) సరిగ్గా వినను. అది అంత సులభం కాదు. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో, అలానే వరల్డ్ కప్ ఆడుతాను. ఆ తర్వాత అతనితో కలిసి పని చేస్తాను' అని చెప్పాడు.
వైస్ కెప్టెన్సీకి అఫ్రిదీ నో: పాక్ టీ20 వరల్డ్ కప్ టీమ్‌కి బాబర్ అజామ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాలని వచ్చిన ఆఫర్‌ను స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిదీ తిరస్కరించినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతానికి అధికారికంగా పాక్ జట్టుకు వైస్ కెప్టెన్ లేడు. అంతకుముందు ఒక టీ20 సిరీస్‌లో పాకిస్థాన్‌కు అఫ్రిది కెప్టెన్సీ చేశాడు. అనంతరం తొలగించారు. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్సీ తిరస్కరించినట్లు భావిస్తున్నారు. కెప్టెన్‌గా తనను తొలగించడానికి గల కారణాలను తనకు ఎప్పుడూ సరిగా వివరించలేదని అఫ్రిదీ భావించినట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.
'అందుకోసమే మేము లగేజ్ మోయాల్సి వచ్చింది' - షహీన్ అఫ్రిదీ క్లారిటీ
పీఎస్ఎల్ విజేతగా లాహోర్.. కెప్టెన్‌గా షహీన్ అఫ్రిది రికార్డు