Pak vs Aus ODI Series 2024 : పాకిస్థాన్ క్రికెట్ జట్టు అరుదైన ఘనత సాధించింది. 22ఏళ్ల తర్వాత తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ నెగ్గింది. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో పాకిస్థాన్ 8 వికెట్లతో నెగ్గింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాక్ 2-1తో దక్కించుకుంది. ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌లో ఆసీస్ నిర్దేశించిన 141 పరుగుల లక్ష్యాన్ని పాక్ 26.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో 2002 తర్వాత కంగారుల గడ్డపై పాక్ తొలిసారి వన్డే సిరీస్ చేజిక్కించుకుంది.
రీసెంట్గా అది కూడా
ఇటీవల పాకిస్థాన్ సొంతగడ్డపై టెస్టు సిరీస్ కూడా దక్కించుకుంది. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో పాక్ తలపడింది. ఈ సిరీస్‌లో తొలి టెస్టులో ఓడినా, ఆత్మ విశ్వాసంతో ఆడి తర్వాత రెండు మ్యాచ్‌ల్లో పాక్ విజయం సాధించింది. దీంతో సుదీర్ఘ విరామం తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్ విజయం అందుకుంది. తాజాగా ఆసీస్‌తో వన్డే సిరీస్ దక్కించుకోవడం వల్ల పాక్ ఆత్మవిశ్వాసాం మరింత పెరిగినట్లే!
Moments of joy 📸#AUSvPAK pic.twitter.com/39ADRhwiog
— Pakistan Cricket (@TheRealPCB) November 10, 2024
మార్పుల వల్లేనా?
గత రెండు సిరీస్‌లు మినహాయిస్తే, కొంతకాలంగా క్రికెట్లో పాకిస్థాన్ దీన పరిస్థితి ఎదుర్కొంటూ వచ్చింది. గతేడాది వన్డే వరల్డ్‌కప్, ఇటీవల టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఘోర పరాభవం, జట్టులో నిలకడలేకపోవడం వల్ల పాక్ క్రికెట్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దీంతో అప్పట్నుంచి పీసీబీ జట్టులో చాలా మార్పులు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో జట్టుకు కోచ్, కెప్టెన్, సెలక్టర్లు మారారు. ఇక రీసెంట్గా ఇంగ్లాండ్ టెస్టు, ఆసీస్‌పై వన్డే సిరీస్‌ల్లో విజయాలతో పాక్ గాడిన పడ్డట్లే అని విశ్లేషకుల మాట!
ఇక మ్యాచ్ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 31.5 ఓవర్లలో 140 పరుగులుకే కుప్పకూలింది. పాక్ పేసర్ల దెబ్బకు ఆసీస్ పరుగులు చేయడం కష్టమైంది. షహీన్ అఫ్రీదీ, నజీమ్ షా చెరో 3 వికెట్లతో సత్తా చాటారు. హారిస్ రౌఫ్ 2, హస్నేన్ 1 వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ఛేదనకు దిగిన పాక్ దూకుడుగా ఆడింది. ఓపెనర్లు 84 పరుగుల భాగస్వామ్యంలో గెలుపు ఖరారైంది. ఇక బాబర్ ఆజమ్ (28* పరుగులు), రిజ్వాన్ (30* పరుగులు) 26.5ఓవర్లలో ఆటను ముగించారు.
A convincing win in Perth completes a come-from-behind series triumph for Pakistan! 👏
— Pakistan Cricket (@TheRealPCB) November 10, 2024
Winning start for Rizwan in his first series as captain 🏏🙌#AUSvPAK pic.twitter.com/tP4zoOdv6E
స్కోర్లు
- ఆస్ట్రేలియా - 140 ఆలౌట్ (31.5 ఓవర్లు)
- పాకిస్థాన్- 143-2 (26.5 ఓవర్లు)
పాకిస్థాన్ సంచలనం - సొంత గడ్డపై 1348 రోజుల తర్వాత భారీ విజయం!
పాకిస్థాన్ కొత్త కెప్టెన్ ప్రకటన- బాబర్‌ను రిప్లేస్ చేసేది అతడే