పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఇటీవల కాలంలో ఘోర వైఫల్యాలను చవిచూస్తోంది. ఒకప్పుడు పెద్దపెద్ద జట్టనే మట్టికరిపించిన దాయాది జట్టు, ప్రస్తుతం పనికూనలపైనా ఓటమిపాలవుతోంది. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-0తో ఓడిపోవడమే అందుకు ఊదాహరణ. అలాగే పలు టోర్నీల్లో పాక్ జట్టు చతికిలపడిపోతోంది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో పాకిస్థాన్ జట్టు వైఫల్యానికి గల 3 ముఖ్యమైన కారణాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రాజకీయ ప్రమేయం
పాక్ క్రికెట్లో రాజకీయ ప్రమేయం ఎక్కువైపోయింది. రాజకీయ నాయకులు, సైనికులు కలిసి జట్టు ఎంపిక, కోచింగ్ మార్పులు, గేమ్ వ్యూహాలను రచించిన సందర్భాలు ఉన్నాయి. ఈ జోక్యం వల్ల పాకిస్థాన్ క్రికెట్ జట్టులో అస్థిరత పెరిగిపోయింది. అలాగే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎప్పటికప్పుడు ఛైర్మన్లను తరచుగా మారుస్తుంటుంది. మరోవైపు, ఆట, మెరిట్ ఆధారంగా కాకుండా రాజకీయ కోణంలో పాక్ జట్టులోకి ఆటగాళ్లను ఎంపిక చేసి సందర్భాలు ఉన్నాయి.
దేశీయ లీగ్‌లు లేకపోవడం మైనస్!
పాకిస్థాన్‌లో దేశీయ క్రికెట్ అంతగా ప్రసిద్ధి చెందలేదు. ఇతర దేశాల మాదిరిగా దేశీయ క్రికెట్లో సత్తా చాటే అవకాశం పాక్ యువ ఆటగాళ్లకు లేదు. అందుకు యువ ఆటగాళ్ల ప్రతిభ బయటపడట్లేదు. ఇది కూడ పాక్ జట్టు వైఫల్యానికి కారణం కావొచ్చని అంటున్నారు విశ్లేషకులు.
పిచ్‌లు కూడా కారణమే!
పాకిస్థాన్‌లో పిచ్‌లు కూడా ఆ దేశ క్రికెట్ పై ప్రభావం చూపుతున్నాయి. స్వదేశంలో పిచ్‌లను తమ జట్టుకు అనుకూలంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీర్చిదిద్దుతోంది. ఈ పిచ్‌లను అలవాటుపడ్డ క్రికెటర్లు, విదేశాల్లో బోల్తా కొడుతున్నారు.
ఈ నిర్ణయాలు తీసుకుంటే మంచిది!
పాకిస్థాన్ జట్టు క్రికెట్లో మళ్లీ పుంజుకోవాలంటే కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. రాజకీయాలను క్రికెట్లోకి రానివ్వకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుందని అంటున్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై రాజకీయ ప్రభావం ఉండకూడదని, జట్టు ఎంపిక ఆటగాళ్ల ప్రతిభ ఆధారంగా జరగాలని అభిప్రాయపడుతున్నారు. అలాగే పాకిస్థాన్‌లో దేశీయ క్రికెట్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. అలాగే స్వదేశంలో విభిన్న పిచ్‌లను తయారుచేయడం వల్ల, ఆటగాళ్లు విదేశాల్లోనూ ఇబ్బందిపడకుండా ఆడగలరని అంటున్నారు. ఎల్లప్పుడూ స్పిన్ ట్రాక్ లనే కాకుండా, అన్ని రకాల పిచ్ లను సిద్దం చేసుకోవాలని పేర్.
WTC టేబుల్లో కిందకి పడిపోయిన పాక్ - మరి భారత్ స్థానం ఎంతంటే?
బాబర్ షాకింగ్ డెసిషన్- కెప్టెన్సీకి గుడ్‌బై- ఏడాదిలో ఇది రెండోసారి - Babar Azam Captaincy