Pak vs Ban Test Series: టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. పాకిస్థాన్‌ను వారి గడ్డపై తొలిసారి క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. పాక్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను బంగ్లా 2- 0తేడాతో నెగ్గింది. రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 185 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్ నైట్ స్కోరు 42/0తో (రెండో ఇన్నింగ్స్) మంగళవారం, ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఆ జట్టు 56 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ని అందుకుంది.
ఇక ఇటీవల ముగిసిన తొలి టెస్టులోనూ బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇప్పటికే వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న పాకిస్థాన్ తాజాగా పసికూన బంగ్లాతో టెస్టు సిరీస్ కోల్పోయింది. దీంతో పాకిస్థాన్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఈ మాత్రం దానికి 'ఆర్మీ ట్రైనింగ్ వృధా', 'ఆర్మీ ట్రైనింగ్ తర్వాత ఏకంగా బంగ్లా చేతిలో వైట్‌వాష్ అయ్యింది' అంటూ మీమ్స్ వస్తున్నాయి.
Scenes from Pakistan YouTube Studios after Pakistan got whitewashed by Bangladesh at home.#BANvsPAK pic.twitter.com/OTGX2ZDQ9C
— Krishna (@Atheist_Krishna) September 3, 2024
Pakistan 🇵🇰 after losing 2nd Test against Bangladesh 🇧🇩 , became the First Team to get Eliminated from WTC 2023-25 #BANvsPAK #PakistanCricket pic.twitter.com/ouP1FoOCAK
— Richard Kettleborough (@RichKettle07) September 3, 2024
Chaliye shuru karte hai #PAKvBAN #BANvsPAK pic.twitter.com/Kld5OcoBjg
— Raja Babu (@GaurangBhardwa1) September 3, 2024
Bangladesh 🇧🇩 has done Bangla Wash against Pakistan 🇵🇰 in Pakistan
— Richard Kettleborough (@RichKettle07) September 3, 2024
🇧🇩 2-0 🇵🇰 (White Wash)#BANvsPAK #PakistanCricket pic.twitter.com/Fy4046jMAI
WTC పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి బంగ్లా
ఈ సిరీస్ విజయంతో బంగ్లా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకొచ్చింది. బంగ్లాదేశ్ 33పాయింట్లు, 45.83 పాయింట్ పర్సెంటేజీతో ఇంగ్లాండ్ (45.00 పాయింట్ పర్సెంటేజీ)ను వెనక్కినెట్టి, నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన బంగ్లా 3 విజయాలు నమోదు చేసింది. మరో మూడింట్లో ఓడింది. మరోవైపు పాకిస్థాన్ 7 మ్యాచ్‌ల్లో 5 ఓటములతో ఎనిమిదో స్థానంలో ఉంది. 19.04 పాయింట్ పర్సెంటేజీతో పాకిస్థాన్ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
ఇకపై పాక్ టియర్ 2 టీమ్!
స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్ ఓటమితో పాకిస్థాన్ ఫ్యాన్స్ అసహనానికి గురవుతున్నారు. ఇప్పటినుంచి క్రికెట్‌లో పాకిస్థాన్‌ను టాప్ టీమ్‌గా పరిగణించకూడదని ఓ నెటిజన్ అన్నాడు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ లాంటి బడా టీమ్స్ ఉన్న టోర్నీల్లో పాక్ నెగ్గడం అసాధ్యం అని పేర్కొన్నాడు. ఇకపై పాక్‌ను టియర్ (Tier 2) టీమ్‌గా పరిగణంచడం బెటర్ అని తెలిపాడు.
Can Pakistan really be called a top-tier team anymore? 🧐 #BANvsPAK pic.twitter.com/OousrZbsdV
— Tanay Tiwari (@Tanay_Tiwari) September 3, 2024
బంగ్లాను ఆదుకున్న లిట్టన్ దాస్- పాక్‌పై వీరోచిత శతకం - Litton Das vs Pakistan
'డిక్లేర్డ్' నిర్ణయంతో ఓటమి - పాక్ 4, భారత్ 1 - Losing Test Match After Declaring