ON This Day CSK Won Two Titles IPL And CLT20 : ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ట్రోఫీలు నెగ్గిన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. అంతకన్నా ముందు ముంబయి ఇండియన్స్ ఉంది. రెండు జట్లు చెరో ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీలను సొంతం చేసుకున్నాయి. ఇక 2008 నుంచి 2014 వరకు సాగిన ఛాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీలోనూ చెన్నై, ముంబయి జట్లే హవా చూపించాయి.
అయితే 2008లో ముంబయిలో జరిగిన దాడుల కారణంగా ఈ టోర్నీని రద్దు చేశారు. ఆ తర్వాత ఆరుసార్లు వరుసగా సీఎల్‌టీ 20 నిర్వహించారు. ఇందులో రెండేసి కప్‌లను ఐపీఎల్‌కు చెందిన ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. చెరోసారి న్యూసౌత్ వేల్స్, సిడ్నీ సిక్సర్స్ ఈ కప్‌లను ఖాతాలో వేసుకున్నాయి.
కానీ, ఒకే ఏడాది ఐపీఎల్, సీఎల్‌టీ 20 టైటిళ్లను గెలిచిన తొలి జట్టుగా సీఎస్కే నిలిచింది. 2010లో ఇదే రోజున (సెప్టెంబర్ 26) సీఎల్‌టీ ఫైనల్ పోరులో విజయం సాధించింది. 2013లో ముంబయి కూడా ఇలానే రెండు కప్‌లు దక్కించుకుంది. కానీ ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు క్రియేట్ చేసింది.
సీఎల్‌టీ20 ఫైనల్‌లో - వరల్డ్ వైడ్‌గా ఆయా దేశాల్లో జరిగే లీగ్‌ల్లో టాప్-2లో నిలిచిన జట్లే ఛాంపియన్స్ లీగ్ టీ20 ట్రోఫీ కోసం పోటీకి సిద్ధమవుతాయి. అలా భారత్ నుంచి ముంబయి, చెన్నై అర్హత సాధించాయి. సెప్టెంబర్ 26న జరిగిన తుది పోరుకు చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు సౌతాఫ్రికా చెందిన వారియర్స్ వెళ్లాయి. జోహెన్స్‌బర్గ్ వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ పోరులో వారియర్స్‌ను 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఒడించింది.
ఈ మ్యాచ్‌లో మొదట బౌలింగ్ చేసిన చెన్నై జట్టు ప్రత్యర్థి టీమ్‌ను 128 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో సీఎస్కే కూడా కాస్త ఇబ్బందిని ఎదుర్కొంది. రెండు వికెట్లు మాత్రమే కోల్పోయినప్పటికీ 19వ ఓవర్ వరకూ మ్యాచ్ సాగుతూనే ఉంది. మురళీ విజయ్ (58), మైకెల్ హస్సీ (51*) అర్ధ శతకాలు బాది సీఎస్కేను గెలిపించారు. ధోనీ ఈ మ్యాచ్‌లో కేవలం 12 బంతుల్లోనే 17 పరుగులు చేసి మ్యాచ్‌ను కాపాడాడు. రవిచంద్రన్ అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గా నిలిచాడు. మొత్తం 13 వికెట్లు పడగొట్టాడు.
బుమ్రా దెబ్బకు విరాట్ హడల్ - 15 బంతుల్లో నాలుగుసార్లు ఔట్ - Bumrah Outs Virat Kohli