Manu Bhaker ISSF World Cup Final : అక్టోబర్ 13 నుంచి 18 వరకు దేశ రాజధానిలో దిల్లీలో జరగనున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీకి ఒలింపిక్ డబుల్ గోల్డ్ మెడలిస్ట్ మను బాకర్ దూరంగా ఉండనుంది.
తాజాగా ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్ ఫైనల్ కోసం నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(NRAI) భారత జట్టును ప్రకటించింది. 23 మంది సభ్యులతో కూడిన టీమ్ జాబితాను విడుదల చేసింది. ఇందులో మను బాకర్ పేరు లేదు. పారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు బ్రాంజ్ మెడల్స్ సాధించిన మను బాకర్ వచ్చే మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలనుకుంది. అందుకే మనును ఈ టోర్నీకి సెలెక్ట్ చేయలేదని తెలిసింది.
రిథమ్ సాంగ్వాన్ (ఉమెన్ 10 మీ ఎయిర్ పిస్టల్, 25 మీ పిస్టల్), సోనమ్ ఉత్తమ్ మస్కర్ (ఉమెన్స్ 10 మీ ఎయిర్ రైఫిల్), దివ్యాంశ్ సింగ్ పన్వార్ (మెన్స్ 10 మీ ఎయిర్ రైఫిల్), గనేమత్ సెఖోన్ (మహిళల స్కీట్) ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్‌కు డెరెక్ట్‌గా సెలెక్ట్ అయ్యారు. మిగతా షూటర్లను మాత్రం ఒలింపిక్ ట్రయల్స్‌లో ర్యాంకింగ్స్ ఆధారంగా తీసుకున్నారు.
భారత జట్టు ఇదే
ఉమెన్స్ ఎయిర్ రైఫిల్ : తిలోత్తమ సేన్, సోనమ్ ఉత్తమ్ మస్కర్
మెన్స్ ఎయిర్ రైఫిల్ : అర్జున్ బాబుతా, దివ్యాంశ్ సింగ్ పన్వర్
మెన్స్ 50మీ రైఫిల్ త్రీపోజిషన్స్ : అఖిల్ షెరాన్, చైన్ సింగ్
ఉమెన్స్ 50మీ రైఫిల్ త్రీపోజిషన్స్ : నిశ్చల్, ఆషి చౌక్సే,
మెన్స్ ఎయిర్ పిస్టల్ : వరుణ్ తోమర్, అర్జున్ సింగ్ చీమా
ఉమెన్స్ ఎయిర్ పిస్టల్ : సురభి రావు, రిథమ్ సాంగ్వాన్
మెన్స్ 25మీ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ : విజయవీర్ సిద్ధు, అనిష్
ఉమెన్స్ 25మీ స్పోర్ట్స్ పిస్టల్ : సిమ్రాన్‌ప్రీత్ కౌర్ బ్రార్, రిథమ్ సాంగ్వాన్,
మెన్స్ ట్రాప్ : భౌనీష్, వివాన్ కపూర్,
ఉమెన్స్ ట్రాప్ : శ్రేయసి సింగ్, రాజేశ్వరి కుమారి
మెన్స్ స్కీట్ : మైరాజ్ అహ్మద్ ఖాన్, అనంతజీత్ సింగ్ నరుకా,
ఉమెన్స్ స్కీట్ : మహేశ్వరి చౌహాన్, గణేమత్ సెఖోన్,
టెస్టు చరిత్రలో ఈ మ్యాచ్‌లు వర్షార్పణం - రద్దైనవి ఇవే! - Test Matches Abandoned