Nitish Kumar SRH : వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమ్. ఈ సారి కూడా గెలుపు మనదే అనుకుంటూ క్రీజులోకి అడుగుపెట్టింది. అయితే అనుకున్నంత ఈజీగా వారిని ఆ గెలువు వరించలేదు. ఆట మొదలవ్వగానే ఆచీతూచీ ఆడుతున్న ప్లేయర్లను క్రమక్రమంగా పెవిలియన్ బాట పట్టిస్తున్నారు ప్రత్యర్థులు. దీంతో డీలా పడ్డ ఆ టీమ్‌ను ఒక్కసారిగా ఉత్తేజపరిచాడు ఓ తెలుగు కుర్రాడు. అతడు క్రీజులోకి వచ్చి ఆట మొదలెట్టగానే అందరిలో ఎక్కడ లేని ఉత్సాహం పెరిగిపోయింది. ఫోర్లు సిక్సర్లు బాది 37 బంతుల్లోనే 64 పరుగులు స్కోర్ చేశాడు. దీంతో ఇక తమ కష్టాలు గట్టెక్కిపోయాయంటూ అనుకుంటున్న సమయంలో ప్రత్యర్థులు ఈ కుర్రాడిని పెవిలియన్ బాట పట్టించారు. అయినప్పటికీ తాను ఇచ్చిన జోష్‌తో మిగతా ప్లేయర్లందరూ తమ వంతు ప్రయత్నం చేసి జట్టును గెలిపించారు. ఇంతకీ అతడెవరో కాదు సన్‌రైజర్స్ జట్టు యంగ్ స్టార్ నితీశ్ కుమార్. మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన పోరులో హైదరబాద్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ స్టార్ జర్నీ ఎలా మొదలైందంటే ?
2023 ఐపీఎల్ వేలంలో ఈ కుర్రాడిని సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ సీజన్లో అతడు రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అది కూడా బౌలర్‌గానే. కానీ ఇప్పుడు అదే ప్లేయర్ సన్‌రైజర్స్ జట్టులో కీలక పాత్ర పోషించాడు. దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్రప్రదేశ్ తరపున ఆడుతున్న. ఈ యంగ్ స్టార్, గత రంజీ ట్రోఫీ సీజన్‌లోనూ అదరగొట్టాడు. ఇప్పటి వరకు ఆడిన 17 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 566 పరుగులు చేశాడు. అంతే కాకుండా 22 లిస్ట్-ఎ మ్యాచ్‌ల్లోనూ 403 పరుగులు చేసి సత్తా చాటాడు.
నితీశ్ ఓ సూపర్ బ్యాటరే కాదు ఓ మీడియం పేసర్ కూడా. ఇప్పటి వరకు దేశవాళీ క్రికెట్‌లో 52 వికెట్లు తీశాడు. అందులో 5 వికెట్ల పెర్ఫామెన్స్లు కూడా ఉన్నాయి. అతడికి 15 ఏళ్ల వయసున్నప్పుడు 2017/18లో బీసీసీఐ అవార్డుల వేడుకలో మెరిశాడు. అండర్ 16 విభాగంలో స్టార్‌గా ఉన్నందును బీసీసీఐ నితీశ్‌కు జగ్‌మోహన్ దాల్మియా ట్రోఫీని అందజేసింది.
'అతడు ఎక్కడ నుంచి వచ్చాడో నాకు తెలుసు'
ఐపీఎల్లో సత్తా చాటుతున్న నితీశ్ కుమార్ ఆంధ్రా క్రికెట్ జట్టులో రెగ్యులర్ ప్లేయర్. ఈ నేపథ్యంలో అతడి గురించి తన కో ప్లేయర్ హనుమ విహారి ఆసక్తికర ట్వీట్ చేశారు. తనను కొనియాడుతూ ఓ ఎమోషనల్ నోట్ రాశాడు.
"NKR (నితీశ్ కుమార్ రెడ్డి) కొంచెం పేద కుటుంబం నుంచి వచ్చినవాడు. కుమారుడిని క్రికెటర్‌గా తీర్చిదిద్దడం కోసం అతడి తండ్రి ఉద్యోగం మానేశాడు. తండ్రి ఎంకరేజ్‌మెంట్‌తో నితీశ్ ఇప్పుడు ఓ నికార్సయిన క్రికెటర్‌గా మారాడు. నితీశ్ పడ్డ కష్టానికి ఫలితం లభించింది. తనకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నేను నితీశ్‌ను మొదటిసారి చూశాను. ఇప్పుడు అతడు ఓ సూపర్ క్రికెటర్‌గా ఎదిగిన తీరు చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నిజంగా అతడు ఓ ఆస్తి లాంటి వాడు. భవిష్యత్తులో టీమ్ఇండియాకు కూడా విలువైన ఓ ఆటగాడిగా మారతాడు" అంటూ నితీశ్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు.
-
NKR- comes from a humble background.
— Hanuma vihari (@Hanumavihari) April 9, 2024
His father left his job for his career, he guided him and nurtured him. His hard work has paid dividends and I’ve seen him whn he was 17 years old. Proud of him of how he’s grown as a player.Asset for SRH n India in the future!
ఇకపై జడ్డూను అలానే పిలవాలట - చెన్నై ఫ్రాంచైజీ అఫీషియల్ అనౌన్స్మెంట్! - Ravindra Jadeja New Name