Australian Star Cricketer Nathan : క్రికెట్ స్టార్‌లు అందరూ దాదాపుగా క్రీడా రంగానికి సంబంధించిన వాటిలోనే స్థిరపడతారు. దీంతో పాటే రాజకీయాలు, వ్యాపారాలపై కూడా ఆసక్తి చూపుతారు. కానీ సచిన్, సెహ్వాగ్‌కు క్రికెట్‌లో సవాలు విసిరిన బౌలర్, ఆర్సీబీ ఆఫర్ ఇస్తే నో చెప్పిన ఆ ప్లేయర్ భిన్నంగా ఎవరూ ఊహించని కెరీర్ ఎంచుకున్నాడు. అతడే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ నాథన్ బ్రాకెన్య.
క్రికెట్ నుంచి కార్పొరేట్ వరల్డ్‌లోకి అడుగుపెట్టాడు నాథన్ బ్రాకెన్య. ప్రస్తుతం, అతడు ఫుల్టన్ హొగన్ అనే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఒకప్పుడు సచిన్, సెహ్వాగ్ లాంటి బ్యాటర్లకు సవాలు విసిరిన బౌలర్ అయిన అతడు ఇప్పుడో సాధారణ వ్యక్తిలా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
నాథన్ బ్రాకెన్ యూనివర్సిటీ లెవల్‌లో కమ్యూనికేషన్స్ చదివాడు, బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నాడు. జాబ్ కన్నా ముందు నాథన్ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. 2013, 2017 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఫెడరల్ పార్లమెంటు సీటు కోసం పోటీ చేశాడు. కానీ సక్సెస్ కాలేకపోయాడు.
నాథన్ బ్రాకెన్ క్రికెట్ కెరీర్ - 2001 నుంచి 2009 వరకు ఆస్ట్రేలియా జట్టుకు బ్రాకెన్ ప్రాతినిథ్యం వహించాడు. 2003, 2007 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అతడు బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడంలో దిట్ట. అత్యుత్తమ బ్యాటింగ్ ఆర్డర్‌ను కూడా భయపెట్టాడు. అతని బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్లు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ తెందూల్కర్ కూడా ఇబ్బంది పడ్డారు.
సచిన్, సెహ్వాగ్‌కు సవాలు(Sachin Sehwag) - నాథన్ బ్రాకెన్‌ను సెహ్వాగ్ 16 ఇన్నింగ్స్‌లలో ఎదుర్కొన్నాడు. ఏడు ఇన్నింగ్స్‌లలో బ్రాకెన్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. అలానే సచిన్ వికెట్ కూడా ఎక్కువ సార్లు పడగొట్టాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ళపై పైచేయి సాధించి, తన ప్రతిభను నిరూపించుకున్నాడు.
ఐపీఎల్ ఆఫర్‌కు నో చెప్పిన బ్రాకెన్ - నాథన్ బ్రాకెన్ కెరీర్‌లో గాయాలు కూడా వేధించాయి. అందువల్ల 2011లో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నుంచి వచ్చిన రూ.1.3 కోట్ల ఆఫర్‌ను తిరస్కరించాడు. అతడు డబ్బు కన్నా తన ఆరోగ్యానికి మొదటి స్థానం ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు ఐపీఎల్‌లో అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో, బ్రాకెన్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది.
నాథన్ బ్రాకెన్ టెస్ట్ క్రికెట్‌లో 12 వికెట్లు, వన్డేలో 174 వికెట్లు, టీ20లో 19 వికెట్లు తీశాడు. ప్రస్తుతం 47 సంవత్సరాల వయస్సులో, బ్రాకెన్ యంగ్ క్రికెటర్ల కోసం ఒక అకాడమీని స్థాపించాడు. ఎక్కువగా కార్పొరేట్ రంగంలో తన ఉద్యోగంలో నిమగ్నమై ఉన్నాడు.
వరల్డ్ కప్ ఫైనల్‌కు మను బాకర్ దూరం - ఎందుకంటే? - Manu Bhaker ISSF World Cup Final