ETV Bharat / sports

రోహిత్ ఖాతాలో పలు రికార్డులు- ఆ లిస్ట్​లో టాప్​లోకి హిట్​మ్యాన్ - IPL 2024 - IPL 2024

Rohit sharma IPL Recors: ముంబయి ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ పంజాబ్​తో మ్యాచ్​లో పలు రికార్డులు అందుకున్నాడు. అవేంటంటే?

Rohit sharma
Rohit sharma
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 19, 2024, 7:06 AM IST

Updated : Apr 19, 2024, 10:00 AM IST

Rohit sharma IPL Recors: 2024 ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్ మూడో విజయం నమోదు చేసింది. గురువారం పంజాబ్​తో జరిగిన ఉత్కంఠ పోరులో చివరి ఓవర్లో ముంబయి 9 పరుగుల తేడాతో నెగ్గింది. 193 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ 19.1 ఓవర్లలో 183 పరుగులకే ఆలౌటైంది. ఇక ఈ మ్యాచ్​లో ముంబయి స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ పలు రికార్డులు అందుకున్నాడు.

  • ఈ మ్యాచ్​లో రోహిత్ శర్మ 3 సిక్స్​లు బాదాడు. ఈ క్రమంలో ముంబయి తరఫున అత్యధిక సిక్స్​లు బాదిన బ్యాటర్​గా రికార్డు కొట్టాడు. రోహిత్ 224 సిక్స్​లతో కీరన్ పొలార్డ్ (223) ను అధిగమించి టాప్​లోకి దూసుకెళ్లాడు.
  • ఓవరాల్​గా ఐపీఎల్​లో అత్యధిక సిక్స్​లు బాదిన రెండో బ్యాటర్​గా కొనసాగుతున్నాడు. ఈ లిస్ట్​లో క్రిస్ గేల్ (357 సిక్స్​లు) టాప్​లో ఉండగా, రోహిత్ ఇప్పటివరకు 275 సిక్స్​లు బాది సెకండ్ ప్లేస్​లో ఉన్నాడు.
  • ఐపీఎల్​లో రోహిత్ శర్మ 250 మ్యాచ్​లు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత అందుకున్న రెండో ప్లేయర్​గా నిలిచాడు. ఎమ్​ఎస్ ధోనీ ఈ లిస్ట్​లో టాప్​లో ఉన్నాడు. అతడు 256 మ్యాచ్​లు ఆడాడు. ఆ తర్వాత దినేశ్ కార్తిక్ (249) మూడో ప్లేస్​లో దగ్గరగా ఉన్నాడు.
  • ఈ మ్యాచ్​లో రోహిత్ శర్మ 6500 ఐపీఎల్​ పరుగులు పూర్తి చేసుకున్నాడు. 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ రోహిత్ ఈ మైలురాయి అందుకున్నాడు. ఈ క్రమంలో 6500+ పరుగులు బాదిన నాలుగో బ్యాటర్​గా నిలిచాడు. ఈ లిస్ట్​లో విరాట్ కోహ్లీ (7624 పరుగులు), శిఖర్ ధావన్ (6769 పరుగులు), డేవిడ్ వార్నర్ (6563 పరుగులు) రోహిత్ కంటే ముందున్నారు.

ఇదే సీజన్​లో రోహిత్ అందుకున్న మరికొన్ని ఘనతలు

  • రోహిత్ ఇటీవల ముంబయి ఇండియన్స్ తరఫున 200 మ్యాచ్​లు పూర్తి చేసుకున్నాడు. రాజస్థాన్​తో మ్యాచ్​లో రోహిత్ ఈ ఘనత అందుకున్నాడు.
  • ఇదే సీజన్​లో రోహిత్ ఐపీఎల్​లో 100 క్యాచ్​లు పూర్తి చేసుకున్నాడు. రోహిత్ కంటే ముందు విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా ఈ ఘనత అందుకున్నారు.
  • రీసెంట్​గా చెన్నైతో జరిగిన మ్యాచ్​లో హిట్​మ్యాన్ సెంచరీ సాధించాడు. అయితే ఐపీఎల్​లో ఓ హ్యాట్రిక్ అండ్ సెంచరీ నమోదు చేసిన మూడో ప్లేయర్​ రోహిత్. ఈ లిస్ట్​లో సునీల్ నరైన్, షేన్ వాట్సన్ ఉన్నారు.

నాకు ఇప్పటికీ గుర్తుంది - బెస్ట్ ఐపీఎల్ థీమ్ సాంగ్ అదే : రోహిత్ - IPL 2024 Rohith Sharma

'అది నాకు నచ్చలేదు- దాని వల్ల దూబే, సుందర్​కు అన్యాయం'! - IPL 2024

Last Updated : Apr 19, 2024, 10:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.