ETV Bharat / sports

హార్దిక్​కు షాక్- వచ్చే IPLలో తొలి మ్యాచ్​కు దూరం- ఫైన్​ కూడా - IPL 2024 - IPL 2024

Hardik Pandya Ban: ముంబయి ఇండియన్స్​ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు షాక్ తగిలింది. శుక్రవారం మ్యాచ్​లో స్లో ఓవర్ రేట్ మెయింటేన్ చేసినందుకు ఐపీఎల్ కమిటీ అతడికి భారీ జరిమానాతోపాటు ఓ మ్యాచ్ నిషేధం విధించింది.

Hardik Pandya Ban
Hardik Pandya Ban (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 18, 2024, 10:05 AM IST

Updated : May 18, 2024, 10:32 AM IST

Hardik Pandya Ban: ముంబయి ఇండియన్స్​ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు ఐపీఎల్ అడ్వజైరీ కమిటీ షాక్ ఇచ్చింది. శుక్రవారం లఖ్​నవూ సూపర్ జెయింట్స్​తో మ్యాచ్​లో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్​పై వేటు వేసింది. అతడికి రూ.30 లక్షలు జరిమానా విధిస్తూ, ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధించింది. ఇదే సీజన్​లో మూడోసారి ఈ తప్పిదం చేసిన కారణంగా నిషేధం విధించినట్లు కమిటీ పేర్కొంది.

'ఈ మ్యాచ్​లో కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లఘించినందుకు హార్దిక్​పై రూ.30 లక్షలు ఫైన్ విధిస్తూ, ఒక మ్యాచ్ నిషేధిస్తున్నాం. అతడితోపాటు ఇంపాక్ట్ ప్లేయర్ రోహిత్ శర్మతో కలిపి జట్టులోని ప్లేయర్లందరికీ రూ.12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 50శాతం కోత ఏది తక్కువైతే అది జరిమానా వేస్తున్నాం' అని ఓ ప్రకటనలో పేర్కొంది.

అయితే ప్రస్తుత సీజన్​లో ముంబయి జర్నీ ముగిసింది. లీద్ దశలో 14 మ్యాచ్​లు ఆడిన ముంబయు కేవలం 4 విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. దీంతో 2025 సీజన్​లోనే ముంబయి బరిలోకి దిగుతుంది. ఇక వచ్చే సీజన్​లో ముంబయి ఆడే తొలి మ్యాచ్​కు హార్దిక్ దూరం కానున్నాడు. కాగా, ఈ సీజన్​లో దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ఇప్పటికే మ్యాచ్ నిషేధం ఎదుర్కొన్నాడు.

కలిసిరాని సీజన్! జట్టుకు కెప్టెన్​గా రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్​కు ఈ సీజన్ అంతగా కలిసిరాలేదనే చెప్పాలి. అటు బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్​గానూ విఫలమయ్యాడు. ఏ పాత్రలోనూ రాణించలేకపోయాడు. అతడి కెప్టెన్సీలో 14మ్యాచ్​లు ఆడిన ముంబయి కేవలం 4విజయాలే నమోదు చేసింది. ఫలితంగా 8 పాయింట్లతో పట్టికలో చిట్ట చివరన నిలిచింది. ఇక 13మ్యాచ్​ల్లో బరిలోకి దిగిన హార్దిక్ కేవలం 18సగటుతో 216 పరుగులే చేశాడు. అటు బౌలింగ్​లోనూ మార్క్ చూపించలేకపోయాడు. 11 వికెట్లు పడగొట్టినా, ఏకందా 10+ ఎకనమీతో పరుగులు సమర్పించుకున్నాడు.

ఇక మ్యాచ్​విషయానికొస్తే, లఖ్​నవూ 18 పరుగుల తేడాతో నెగ్గింది. 215 పరుగుల ఛేదనలో ముంబయి ఓవర్లన్నీ ఆడి 196-6 కే పరిమితమైంది. ఓపెనర్ రోహిత్ శర్మ (68 పరుగులు), ఆఖర్లో నమన్ ధీర్ (62 పరుగులు) ఇద్దరు హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగిలిన బ్యాటర్లంతా చేతులెత్తేశారు.

రోహిత్ మెరిసినా, లఖ్​నవు మురిసింది- ఓటమితో ముంబయి బైబై! - IPL 2024 LSG VS MI

రోహిత్​కు ఇదే లాస్ట్ సీజన్​! - వైరల్ అవుతున్న వీడియో - Rohit Sharma Mumbai Indians

Last Updated : May 18, 2024, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.