MS Dhoni Fathers Day Special : : ప్రతిఒక్కరికి వాళ్ల నాన్నే మొదటి హీరో. పుట్టిన దగ్గర నుంచి ఉన్నత స్థాయికి చేర్చే వరకు వారి వెన్నంటి నడిపించే నాన్న బాధ్యత అనంతం. పిల్లల అవసరాలకు ఆయన చేసే త్యాగం అనిర్వచనీయం. ఈ క్రమంలో ఫాదర్స్ డే(జూన్ 16) సందర్భంగా భారత దిగ్గజ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, కింగ్ విరాట్ కోహ్లీకి వారి కుమార్తెలు స్పెషల్ గిఫ్ట్‌లు ఇచ్చారు. అవేంటంటే?
మహీ వీడియోను షేర్ చేసిన జీవా
ఫాదర్స్ డే సందర్భంగా టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కుమార్తె జీవా ఓ అందమైన వీడియోను సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఈ వీడియోలో కెప్టెన్ కూల్ ధోనీ ఒక తోటలో శునకాలతో ప్రశాంతంగా ఆడుకుంటూ కనిపించాడు. పొడవాటి జుట్టుతో స్టైలిష్‌గా మహీ ఈ వీడియోలో ఉన్నాడు. కాగా, 2010 జులైలో భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ సాక్షిని వివాహమాడాడు. ఈ దంపతులకు 2015 ఫిబ్రవరి 6న జీవా అనే కుమార్తె జన్మించింది.
విరాట్‌కు వామిక స్పెషల్ గిఫ్ట్
టీమ్ ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీకి తన కుమార్తె వామిక ఫాదర్స్ డే సందర్భంగా ఓ అరుదైన కానుక ఇచ్చి విష్ చేసింది. తన పాద ముద్రలు కలిగిన కళాకృతిని విరాట్ అందించింది. ఈ కళాకృతిని అనుష్క శర్మ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వేదికగా పోస్ట్ చేసింది. అంతే కాకుండా కింగ్ కోహ్లీపై ప్రశంసలు కురిపించింది. 'ఒక వ్యక్తి ఇన్ని విషయాలలో అంత మంచిగా ఎలా ఉండగలడు! అంతా అయోమయంగా ఉంది.' వి లవ్ యూ విరాట్ అని పోస్ట్ లో క్యాప్షన్ ఇచ్చింది.
టీమ్ ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మకు 2017 డిసెంబరు 11న వివాహం జరిగింది. వీరికి 2021 జనవరి 11న ఓ కుమార్తె జన్మించింది. ఆమె పేరే వామిక. అలాగే ఈ దంపతులు 2024 ఫిబ్రవరి 15న పండంటి మగబిడ్డకు తల్లిదండ్రులయ్యారు. ఆ చిన్నారి పేరు అకాయ్. కాగా కింగ్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికాలో ఉన్నాడు.
'నా కూతురు అప్పుడే బ్యాట్ పట్టేసింది'- WPLకు వామిక, IPLలో అకాయ్? - IPL 2024