MS Dhoni Daily Routine : అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికిన టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుతం ఐపీఎల్‌కు మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్నప్పటికీ, ఓ ప్లేయర్‌గా ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇక ఆ తర్వాత తన క్వాలిటీ టైమ్‌ను ఫ్యామిలీకి అలాగే ఇతర బిజినెస్‌లకు వినియోగిస్తున్నాడు.
మరోవైపు క్రికెట్‌కు దూరంగా ఉన్నా కూడా ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా న్యూ లుక్స్‌తో దూసుకెళ్తున్నాడు. తాజాగా కూడా ఆయన ఫొటోలు కొన్ని నెట్టింట తెగ ట్రెండ్ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఒక ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో ధోని తన డైలీ రొటీన్ గురించి చెప్పుకొచ్చాడు.
"నా డైలీ షెడ్యూల్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. అంతేకాకుండా అది నేను ఎక్కడ ఉన్నానన్న దానిపై ఆధారపడి ఉంటుంది. నేను ముంబయిలో ఎండార్స్‌మెంట్స్ కోసం వస్తే, మేనేజ్మెంట్ నన్ను సెట్‌కి పిలిచే సమయం బట్టి ఉంటుంది. దాని ప్రకారం నేను నా షెడ్యూల్‌ను ప్రిపేర్ చేసుకుంటాను. అయితే నేను రాంచీలో ఉన్నప్పుడు మాత్రం నా షెడ్యూల్ అక్కడి ప్రకారం ఫిక్స్ చేసుకుంటాను. కొంచెం లేట్‌గా లేస్తాను. బ్రేక్‌ఫాస్ట్ చేసి ఆ తర్వాత స్టేడియం లేదా జిమ్‌కు వెళ్లి అక్కడ చేయాల్సింది చేస్తుంటాను. తిరిగి వచ్చి, నా ఫ్యామిలీతో అలాగే పెంపుడు జంతువులతో టైమ్ స్పెండ్ చేస్తుంటాను. ఇక సాయంత్రం, నాకు అనిపిస్తే, నేను మళ్లీ స్టేడియానికి వెళ్లి టెన్నిస్ లేదా బ్యాడ్మింటన్ ఆడతాను. అని ధోనీ తన డైలీ రొటీన్ గురించి చెప్పుకొచ్చారు.
అయితే రిటైర్మెంట్ తర్వాత ధోనీకి తన ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడమే కాకుండా అప్పుడప్పుడు వ్యవసాయం కూడా చేస్తూ కనిపించారు. దానికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఈ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని గురించి వివరించారు.
"నేను వ్యవసాయానికి వెళ్లినప్పుడల్లా ట్రాక్టర్ గురించి అలాగే అక్కడ ఉపయోగించే పరికరాల గురించి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఫీల్డ్‌లో మీరు రెగ్యులర్‌గా లేకుంటే మీరు వాటిని మరచిపోతారు. అందుకే ఓ సారి ఈ ప్రాసెస్‌ను తెలుసుకుంటే మీరు మళ్లీ వెళ్లినప్పుడల్లా ఆ పాఠాలు మీకు ఎంతో ఉపయోగపడుతాయి. ఇది చాలా కఠినమైన పనే అయినా చాలా సరదాగా ఉంటుంది" అని ధోనీ పేర్కొన్నారు.
ఝార్ఖండ్ ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్‌గా ధోనీ
' మీకు అస్సలు ఏమీ తెలియదు'- ధోనీకి స్టంపింగ్ రూల్స్ నేర్పించిన సాక్షి!